విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కమిటీ సభ్యుడు
ఇబ్రహీంపట్నం: విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కమిటీ సభ్యుడు అత్తిలి సుజీత్, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరాజు నర్సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ గేటు సమీపంలో నారాయణ కళాశాల ఎదుట ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇంటర్ ఎంపీసీ రెండో ఏడాది విద్యార్థి పవన్‌నాయక్(17)ను వేధించిన నారాయణ కళాశాల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ డీవో విఠల్ విచారణ: విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై నారాయణ కళాశాలలో సోమవారం ఆర్‌డీవో విఠల్, ఆదిబట్ల సీఐ అశోక్ కుమార్ విచారణ జరిపారు. ఎన్‌ఎస్‌యూ నాయకులతో ఆర్డీవో మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.