‘నారాయణ’ విద్యార్థి అనుమానాస్పద మృతి | suscepicious death of narayana student | Sakshi
Sakshi News home page

‘నారాయణ’ విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Wed, Jul 27 2016 5:42 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

suscepicious death of narayana student

– అధ్యాపకుడు మందలించాడని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి?
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సందీప్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరంలోని బుధవారపేటలో నివాసం ఉంటున్న మహానంది, సరస్వతి దంపతులకు నలుగురు సంతానం కాగా.. రెండవ కుమారుడు సందీప్‌ స్థానిక నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లిన సందీప్‌ను తరగతి గదిలో మ్యాథ్స్‌ లెక్చరర్‌ మందలించినట్లు తెలిసింది. తోటి విద్యార్థుల ఎదుట చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థి తీవ్ర మనోవేదనకు లోనైనట్లు సమాచారం. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకోగా.. అప్పటికి ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని తండ్రి ఆటోడ్రై వర్‌ కాగా.. తల్లి నగరంలోని కేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వీపర్‌గా పని చేస్తున్నారు. విధులు ముగించుకొన్ని తల్లి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా విగతజీవిగా మారిన కుమారుడిని చూసి నిశ్చేష్టురాలయింది. స్థానికుల సహకారంతో సమాచారం భర్తకు చేరవేసింది. అప్పటికే సందీప్‌ మృతి చెందినట్లు తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంలో కళాశాల ప్రేమయం లేదని చెప్పించేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు మధ్యవర్తిగా ఈ పంచాయితీ జరిగినట్లు సమాచారం. చివరకు.. తమ కుమారుడు అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్‌ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. ఇదిలాఉంటే గత ఏడాది నన్నూరు సమీపంలోని నారాయణ బ్రాంచ్‌లోనే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది సమయంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు కార్పొరేట్‌ కళాశాలల్లో ఒత్తిళ్లకు అద్దం పడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement