న్యూఢిల్లీ: గ్రీన్‌పార్క్ ఎక్స్‌టెన్షన్‌లో ఉండే అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తనియా హత్య కేసు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు విధించిన రిమాండ్ ముగియడంతో నిందితులు ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్‌ను సీబీఐ అడిషనల్ చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రీతమ్ సింగ్ ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 21 దాకా కస్టడీ విధించారు.
మృతుడి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ కేసును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయడం తెలిసిందే. లజ్‌పత్‌నగర్‌లో జనవరి 29న ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకే ఈ యువకుడు మరణించినట్టు కేసు నమోదయింది.