Nido Tania
-
నిడో హత్య కేసు నిందితులకు జ్యుడీషయల్ కస్టడీ
న్యూఢిల్లీ: గ్రీన్‌పార్క్ ఎక్స్టెన్షన్లో ఉండే అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తనియా హత్య కేసు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు విధించిన రిమాండ్ ముగియడంతో నిందితులు ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్‌ను సీబీఐ అడిషనల్ చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రీతమ్ సింగ్ ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 21 దాకా కస్టడీ విధించారు. మృతుడి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ కేసును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయడం తెలిసిందే. లజ్‌పత్‌నగర్‌లో జనవరి 29న ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకే ఈ యువకుడు మరణించినట్టు కేసు నమోదయింది. -
దర్యాప్తునకు సీబీఐ ఓకే
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తనియను జనవరి 29న లజజ్పత్నగర్లో కొం దరు వ్యాపారులు కొట్టిచంపినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు నిర్వహించనుంది. ఢిల్లీ పోలీ సులే కేసు దర్యాప్తు పూర్తి చేశారు కాబట్టి తమ ప్రమే యం అవసరం లేదని సీబీఐ మొదట వాదించింది. అయితే సాక్ష్యాధారాలను క్షుణ్నంగా పరిశీలించాక దర్యాప్తునకు అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే సీబీఐ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేయనుంది. అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నిడో పవిత్ర కుమారుడు, బీఏ మొదటి ఏడాది చదివే నిడో తనియ జనవరి 29న లజ్‌పత్‌నగర్‌లోని మిత్రుని ఇంటికి బయలుదేరాడు. ఏ బ్లాక్‌లో నివసించే మిత్రుని ఇల్లు ఎక్క డుందో తెలుసుకోవడానికి అక్కడున్న ఓ మిఠాయి దుకాణంలో అడిగాడు. దుకాణంలో కూర్చున్న ఇద్ద రు సోదరులు ఫర్మాన్, రిజ్వాన్ తన జుట్టును చూసి గేలి చేయడం నిడో తనియంకు కోపం తెప్పించిం ది. దాంతో ఫర్మాన్, రిజ్వాన్‌తో వాదనకు దిగాడు. కోపం ఆపుకోలేక దుకాణం గ్లాసును బద్దలుకొట్టా డు. దానితో ఫర్మాన్, రిజ్వాన్ , మరికొందరు కల సి నిడోను చితకబాదారు. దెబ్బలు తిన్న నిడో పోలీ సులు, మిత్రులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మిత్రులు స్థాని కులతోనూ ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లి రాజీ కుదిర్చారు, పోలీ సులు సూచన మేరకు తాము నిడోకు రూ. ఏడువేలు ఇచ్చామని రిజ్వాన్ చెప్పాడు. అయితే ఆ తరువాత పోలీసులు నిడోను దుకాణం వద్దకే తీసుకువచ్చి వదిలారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులు నిడోను మరోమారు చితకబాదారని అతని మిత్రులు ఆరోపించారు. మరునాడు ఉదయం గ్రీన్‌పార్క్ ఎక్స్‌టెన్షన్‌లోని గదిలో ఇతడి మృతదేహం కనిపించిందని కుటుంబసభ్యులు చెప్పారు. దెబ్బల ధాటికే నిడో మరణించారని ఆరోపించారు. ఈ ఘటనలో నింది తులు ఇద్దరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటిం చారు. నిడో ఘటనపై ఈశాన్య ప్రాంతవాసులు, ప్రజాప్రతినిధులు ప్రధాని మన్మోహన్సింగ్, హోం మంత్రి షిండే, బీజేపీ నేత హర్షవర్ధన్‌ను కూడా కల సి ఫిర్యాదు చేశారు. ఈశాన్య ప్రాంత పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలసి నీడోపై జరిగిన దాడి పట్ల నిరసన వ్యక్తం చేసింది. ఇతని మృతిపై హోంశాఖ ఢిల్లీ పోలీసుల నివేదిక కోరింది. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. -
నిడో హత్యపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: నగరంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తానియా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నిడో తల్లిదండ్రులు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను మంగళవారం కలిసారు. వారితో భేటీ అనంతరం ఈ మేరకు షిండే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. మృతుడి తల్లిదండ్రులు ఈ కేసులో సీబీఐ దర్యాప్తును కోరారు.. అందువల్ల కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింద’ని ఆయన తెలిపారు. వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులకు తప్పక శిక్షిస్తామని మృతుడి కుటుంబానికి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు హోం మంత్రి షిండేను మృతుడు నిడో తానియా తల్లిదండ్రులు కలిసి 15 నిమిషాలపాటు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు ఈ కేసులో సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేశారు. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా నిడో తల్లి పవిత్ర( కాంగ్రెస్ ఎమ్మెల్యే, అరుణాచల్ ప్రదేశ్) మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈశాన్యవాసులు వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని తాము హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. నిడో హత్య కేసులో నలుగురి అరెస్టు అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా హత్య కేసులో పోలీసులు నలుగురిని మంగళవారం అరెస్టు చే సినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సన్నీ ఉప్పల్, పవన్, సుందర్, ఫర్మాన్లను నిందితులుగా గుర్తించామ ని మేజిస్ట్రేట్‌కు విన్నవించారు. తలలో అంతర్గత గాయాలవల్లే నిడో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని చెప్పారు. కాగా, అంతకుముందు పవన్, సుందర్, ఫర్మన్ను ఈ నెల మూడో తేదీన పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మంగళవారం సన్నీ ఉప్పల్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈనెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కాగా నిందితులు పవన్, సుందర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు 14వ తేదీన విచారణకు స్వీకరించనుంది. రాహుల్ గాంధీని కలిసిన నీడో తల్లిదండ్రులు లాజ్‌పత్‌నగర్‌లో దుకాణదారుల దెబ్బల ధాటికి మరణించిన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నీడో తానియా త ల్లిదండ్రులు మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. ఈశాన్య ప్రాంతవాసులపై వివక్షను పోగొట్టడానికి చర్యలు చేపట్టాలని వారు రాహుల్ గాంధీని కోరారు. జాతివివక్షకు వ్యతిరేకంగా బహిరంగ స్థలాలలో హోర్డింగులు, పోస్టర్లు అమర్చడానికి ప్రభుత్వానికి చేయూత నివ్వవలసిం దిగా తాను వ్యాపారవేత్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు నీడో తల్లి చెప్పారు. నీడో విషయంలో ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
పార్లమెంట్లో మాట్లాడతా..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు నిడో తానియాపై జరిగిన దాడి ఘటనను పార్లమెంట్లు లేవనెత్తుతానని సిక్కిం పార్లమెంట్ సభ్యుడు పీడా రాయ్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. అందుకే తాను ఈ అంశాన్ని సభలో లేవనెత్తి చర్చకు డిమాండ్ చేస్తానన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యహారాల మంత్రి కమల్‌నాథ్, ఆర్థిక మంత్రి చిదంబరం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎల్ కే అధ్వానీ, సుష్మా స్వరాజ్‌ల దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధికార ప్రతినిధిస్థాయిలో, ఈశాన్య రాష్ట్రాల ఎంపీల ఫోరమ్ కార్యదర్శిగా ఆయన చేసిన ఈ ప్రకటనపై తామూ ఆలోచిస్తామని మిగతా పార్టీల నాయకులు తెలిపారు. ఎన్ఎస్యూఐ ఆందోళన... నిడో తానియా హత్యకు కారకులైనవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ విధ్యార్థులు సోమవారం ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం ఎదుట ఆందోళనకు దిగారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో సుమారు 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ర్యాలీ నిర్వహిస్తామని కోరగా ఢిల్లీ పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం ఎదుటే ఆందోళనకు దిగారు. తమ డిమాండ్‌కు పోలీసుల నుంచిగానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ ఎటువంటి స్పందన రాకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
వెంటనే చర్య తీసుకోండి
న్యూఢిల్లీ: నగరంలో ఉంటున్న ఈశాన్య భారతీయులకు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 19 యేళ్ల యువకుడిపై దాడి చేసిన ఇద్దరిపై వెంటనే చర్య తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయమై రాజ్‌ఘాట్ బయ ట ఆదివారం నిర్వహించిన ఆందోళనలో పార్టీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఈశాన్యవాసులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. గతంలో కూడా నగరంలో ఈశాన్యరాష్ట్రాల ప్రజలపై దాడులు కొనసాగాయి. వారిని వేధించిన ఘటనలు వెలుగుచూశాయి. ఇవి ఇంతటితోనే ఆగిపోవాలి. నిడో తానియాపై బుధవారం జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. కారకులపై వెంటనే చర్యలకు ఆదేశించాల’న్నారు. మణిపూర్ మహిళలపై దక్షిణ ఢిల్లీలో దాడి... అరుణాచల్ ప్రదేశ్ యువకుడిపై జరిగిన దాడిపై పోలీసులు ఇంకా ఏ చర్య తీసుకోకముందే ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలపై మరో దాడి జరిగింది. దక్షిణ ఢిల్లీలోని కోట్లా ముబారక్ ప్రాంతంలో జనవరి 25న తమను కొందరు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఆరోపించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. నిడో టానియా హత్యతో వెలుగుచూసిన ఈ ఘటనపై ఈశాన్యవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేశాం: పోలీసులు కాగా పోలీసులు మాత్రం సదరు బాధితుల ఆరోపణలను కొట్టివేస్తున్నారు. ఆమె చేసిన ఫిర్యాదును నమోదు చేసుకున్నామని, అయితే ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం... సుమారు 20 సంవత్సరాలమళ్లీ తనను ఎన్నుకోవచ్చని సిబల్ ఆశిస్తున్నారు. అయితే కార్యకర్తల వ్యతిరేకత సిబల్‌కు ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రైమరీస్ జాబితా నుంచి తన నియోజకవర్గాన్ని తొలగించేలా చేశారు. సిబల్ అడుగుజాడల్లో నడుస్తూ కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న కృష్ణతీరథ్ కూడా తననియోజకవర్గాన్ని ఆ జాబితా నుంచి తొలగించుకున్నారని చెబుతున్నారు. అయితే ఈ ఇరువురు ఎంపీల ైవె ఖరికి భిన్నంగా న్యూఢిల్లీ ఎంపీ అజయ్ మాకెన్ తన నియోజకవర్గాన్ని ప్రైమరీస్ జాబితాలో చేర్చాలని పార్టీని కోరారు. ఈ ప్రతిపాదన ద్వారా ఆయన అధిష్టానానికి మరింత దగ్గరయ్యేలా చేస్తున్నారని, దాంతో పాటు న్యూఢిల్లీలో ఓటమి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కొద్దో గొప్పో ఉన్న చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే అభిప్రాయం కూడా మాకెన్‌కు ఉందని కొందరు అంటున్నారు.