వెంటనే చర్య తీసుకోండి
Published Mon, Feb 3 2014 5:07 AM | Last Updated on Mon, Aug 20 2018 5:23 PM
న్యూఢిల్లీ: నగరంలో ఉంటున్న ఈశాన్య భారతీయులకు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 19 యేళ్ల యువకుడిపై దాడి చేసిన ఇద్దరిపై వెంటనే చర్య తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయమై రాజ్‌ఘాట్ బయ ట ఆదివారం నిర్వహించిన ఆందోళనలో పార్టీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఈశాన్యవాసులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. గతంలో కూడా నగరంలో ఈశాన్యరాష్ట్రాల ప్రజలపై దాడులు కొనసాగాయి. వారిని వేధించిన ఘటనలు వెలుగుచూశాయి. ఇవి ఇంతటితోనే ఆగిపోవాలి. నిడో తానియాపై బుధవారం జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. కారకులపై వెంటనే చర్యలకు ఆదేశించాల’న్నారు.
మణిపూర్ మహిళలపై దక్షిణ ఢిల్లీలో దాడి...
అరుణాచల్ ప్రదేశ్ యువకుడిపై జరిగిన దాడిపై పోలీసులు ఇంకా ఏ చర్య తీసుకోకముందే ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలపై మరో దాడి జరిగింది. దక్షిణ ఢిల్లీలోని కోట్లా ముబారక్ ప్రాంతంలో జనవరి 25న తమను కొందరు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. నిడో టానియా హత్యతో వెలుగుచూసిన ఈ ఘటనపై ఈశాన్యవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కేసు నమోదు చేశాం: పోలీసులు
కాగా పోలీసులు మాత్రం సదరు బాధితుల ఆరోపణలను కొట్టివేస్తున్నారు. ఆమె చేసిన ఫిర్యాదును నమోదు చేసుకున్నామని, అయితే ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం... సుమారు 20 సంవత్సరాలమళ్లీ తనను ఎన్నుకోవచ్చని సిబల్ ఆశిస్తున్నారు. అయితే కార్యకర్తల వ్యతిరేకత సిబల్‌కు ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రైమరీస్ జాబితా నుంచి తన నియోజకవర్గాన్ని తొలగించేలా చేశారు. సిబల్ అడుగుజాడల్లో నడుస్తూ కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న కృష్ణతీరథ్ కూడా తననియోజకవర్గాన్ని ఆ జాబితా నుంచి తొలగించుకున్నారని చెబుతున్నారు.
అయితే ఈ ఇరువురు ఎంపీల ైవె ఖరికి భిన్నంగా న్యూఢిల్లీ ఎంపీ అజయ్ మాకెన్ తన నియోజకవర్గాన్ని ప్రైమరీస్ జాబితాలో చేర్చాలని పార్టీని కోరారు. ఈ ప్రతిపాదన ద్వారా ఆయన అధిష్టానానికి మరింత దగ్గరయ్యేలా చేస్తున్నారని, దాంతో పాటు న్యూఢిల్లీలో ఓటమి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కొద్దో గొప్పో ఉన్న చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే అభిప్రాయం కూడా మాకెన్‌కు ఉందని కొందరు అంటున్నారు.
Advertisement