ఏలూరు అర్బన్: పెదపాడు మండలం నాయుడుగూడెంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పెదపాడు పోలీసులు అరెస్ట్ చేశారని ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామంలో గత నెల 16న కొల్లి నాగమోహన్ (40) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని పెదపాడు 17వ తేదీన పోలీసులకు సమాచారం అందిం ది.
డీఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదపాడు ఎస్సై కె.రామకృష్ణ ఘటనా స్థలా నికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతుడు నాగమోహన్‌కు అదే గ్రామానికి చెందిన బేతపూడి భార్గవి అనే వివాహితతో వివా హేతర సంబం«ధం ఉందని గుర్తిం చారు. భార్గవి కుటుంబసభ్యులు హత్య కు పా ల్పడి ఉండవచ్చని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. భార్గవి భర్త బేతపూడి ఉదయకుమార్, అతని పినతండ్రి బేతపూడి జాన్ విలి యమ్, ఉదయకుమార్ స్నేహితులు వే మూరి రాజేష్, మాతంగి శ్యాంసన్ పరా రీలో ఉన్నారని తెలుసుకుని వారి కోసం గాలింపు చేపట్టారు.
ఈ విషయం తెలి సిన నలుగురు నిందితులు మంగళవారం పెదపాడు వీఆర్వో బి.కోటేశ్వరరావు వద్ద నేరం అంగీకరించి లొంగిపోయారు. నిందితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న వీఆర్వో వారిని పెదపాడు పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచారని డీఎ స్పీ వెంకటేశ్వరరావు చెప్పారు. రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదపా డు ఎస్సై కె.రామకృష్ణ పాల్గొన్నారు.
ఇది పరువు హత్య: డీఎస్పీ
నాగమోహన్‌తో తన భార్య భార్గవి వివా హేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త ఉదయకుమార్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా భర్తతో గొడవ పెట్టుకుని భార్గవి దాదాపు ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కుల పెద్దలు, పినతండ్రి జాన్ విలియంతో కలిసి ఉదయ్‌కుమార్ అత్తగారింటికి వెళ్లి భార్యను తిరిగి నాయుడుగూడెం తీసుకువచ్చాడు. ఇంత జరిగినా ఆమె ప్రవర్తన మార్చుకోకపోగా నాగమోహన్‌తో సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈనేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు భార్గవి ప్రయత్నించింది.
ఉదయ్‌కుమార్‌ను ట్రా క్టర్‌తో ఢీకొట్టేందుకు నాగమోహన్ ప్రయత్నం కూడా చేశాడు. నాగమోహన్ కారణంగా కుటుంబం పరువు పోతుండటంతో పాటు తన ప్రాణాలకు హాని ఉందని భావించిన ఉదయ్‌కుమార్ తన పినతండ్రి, స్నేహితులతో కలిసి నాగమోహన్‌ను హతమార్చేందుకు పథకం వేశాడు. ఈక్రమంలో నాగమోహన్ మద్యం మత్తులో రోడ్డు పక్కన సమాధులపై పడుకుని ఉండటం అనువుగా మార్చుకుని కత్తి, రాడ్‌లతో తలపై నరికి హత్య చేశారు.
హత్యకేసులో నిందితుల అరెస్ట్
Published Wed, Jun 21 2017 5:03 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement
Advertisement