
తిరువనంతపురం: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..! యూఏఈలో నివాసముండే కేరళకు చెందిన సోప్నా నాయర్‌కు ఊహించని విధంగా జాక్‌పాట్ తగిలింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహించే లాటరీలో బుధవారం ఆమెను భారీ లాటరీ వరించింది. వివరాలు.. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వారు బిగ్ టిక్కెట్ లాటరీ నిర్వహిస్తున్నారు. సోప్నా గతంతో మూడునాలుగు సార్లు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి బహుమతి లభించలేదు.
ఇటీవల మరోసారి తన అదృష్టం పరీక్షించుకొంది. తన భర్తకు తెలియకుండా ఐదోసారి టికెట్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డ్రా.. బుధవారం జరిగింది. డ్రాలో సోప్నాకు 3.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.22 కోట్లు) బహుమతి వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక లాటరీ గెలుచుకోవడం పట్ల సోప్నా, ఆమె కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. గెలుచుకున్న సొమ్ములో కొంత నిరుపేదలను ఆదుకోవడానికి, మిగతాది తన కుటుంబ పోషణకు కేటాయిస్తానన్నారు సోప్నా.
Comments
Please login to add a commentAdd a comment