
సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు ఉత్పత్తిదారు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు సౌదీ అరేబియాలో సౌదీ ఆరాంకో ప్రాసెసింగ్ యూనిట్లపై ఉగ్రదాడి కలకలం రేపింది. కంపెనీకి చెందిన రెండు ఆయిల్ యూనిట్ల లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడులు జరిగాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. బుక్యాక్‌లోని ప్రాసెసింగ్ ప్లాంట్, ఖురైస్ చమురు క్షేత్రంపై జరిగిన ఈ దాడి నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టంలేదని తెలిపింది. ఆరాంకో భద్రతా బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని వెల్లడించింది. ఇక్కడ రోజుకు 7 మిలియన్ బారెల్స్ ముడి చమురును ప్రాసెస్ అవుతుందని అంచనాలు సూచిస్తున్నాయి.
కాగా ఈ దాడిపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత వహించలేదు. ఈ ప్లాంట్‌ను గతంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. 2006లో అల్-ఖైదా ఆత్మాహుతి దళాలు ఈ చమురుసముదాయంపై దాడికి విఫలయత్నం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment