Oil Company
-
సౌదీ అరామ్కో లాభం రికార్డ్
దుబాయ్: గ్లోబల్ చమురు దిగ్గజం సౌదీ అరామ్కో గతేడాది(2022) కొత్త చరిత్రను లిఖిస్తూ 161 బిలియన్ డాలర్ల(రూ. 13 లక్షల కోట్లకుపైగా) నికర లాభం ఆర్జించింది. వెరసి ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలరీత్యా లిస్టెడ్ కంపెనీలలో సరికొత్త రికార్డును సాధించింది. సౌదీ అరామ్కోగా పిలిచే సౌదీ అరేబియన్ ఆయిల్ కో కొద్ది నెలలుగా చమురు ధరలు జోరందుకోవడంతో తాజా ఫీట్‌ను సాధించింది. ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం ఇందుకు సహకరించింది. రష్యా చమురు, నేచురల్ గ్యాస్ అమ్మకాలపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ప్రభావం చూపింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. 2021లో సాధించిన 110 బిలియన్ డాలర్లతో పోలిస్తే నికర లాభం 46 శాతంపైగా ఎగసింది. కాగా.. కోవిడ్–19 సంక్షోభం తదుపరి ఇటీవల చైనా ఆంక్షలు సడలించడంతో చమురుకు డిమాండ్ మరింత ఊపందుకోనున్నట్లు సౌదీ అరామ్కో భావిస్తోంది. వెరసి ఉత్పత్తిని పెంచే యోచనలో ఉంది. అయితే మరోపక్క వాతావరణ మార్పులకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. శిలాజ ఇంధనాల విక్రయం ద్వారా ఒక కంపెనీ 161 బిలియన్ డాలర్లు ఆర్జించడం షాక్‌కు గురిచేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఏన్స్ కాలమార్డ్ వ్యాఖ్యానించారు. -
31న పెట్రో ఉత్పత్తులు కొనుగోలు చేయం
సాక్షి, హైదరాబాద్ : ఈనెల 31న ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. చాలా కాలం నుంచి డీలర్ మార్జిన్ పెంచాలని కోరుతున్నా కంపెనీలు పట్టించుకోకపోవడంతో ఈ రకంగా నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సంఘం వెల్లడించింది. అయితే వినియోగ దారులకు పెట్రోల్, డీజిల్ అందించడంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుం టామని స్పష్టం చేసింది. 2017 నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగినా తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని పేర్కొంది. తమ పెట్టుబడులు, ఖర్చులు పెరిగినా కంపెనీలు ‘డీలర్ మార్జిన్’ పెంచకపోవడం, పెట్రోలియం ఉత్పత్తులపై అకస్మాత్తుగా పన్నుల్లో మార్పు వంటి అంశాలతో తమకు సమస్యలు ఎదురవుతున్నాయని డీలర్ల సంఘం తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.అమరేందర్‌రెడ్డి శుక్రవారం హెచ్‌పీసీఎల్ రాష్ట్ర సమన్వయకర్త యతేంద్ర పాల్సింగ్కి లేఖ రాశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకపోతే మున్ముందు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే బంక్‌లు తెరిచి ఉంచడం వంటి చర్యలు చేపడతామని అమరేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
షాకింగ్ : 10,000 మంది ఉద్యోగులపై వేటు
లండన్ : కరోనా వైరస్ విజృంభణతో చమురుకు డిమాండ్ పడిపోవడంతో బ్రిటిష్ ఇంధన దిగ్గజం బీపీ 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం సిబ్బందిపై వేటువేసేందుకు కంపెనీ సంసిద్ధమైంది. ఈ ఏడాది చివరికి దాదాపు 10,000 మంది ఉద్యోగులు కంపెనీ వీడే ప్రక్రియను తాము చేపట్టామని బీపీ సీఈఓ బెర్నార్డ్ లూనీ తమ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మూతపడటం, ఎయిర్‌లైన్స్ విమానాలు ఎగరకపోవడంతో చమురు ధరలు పతనమై మైనస్‌లోకి జారుకున్నాయి. ప్రభుత్వాలు లాక్డౌన్లను సడలించిన నేపథ్యంలో వ్యాపారాలు క్రమంగా తెరుచుకోవడంతో చమురు ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని బీపీ చీఫ్ బెర్నార్డ్ లూనీ చెప్పారు. తమ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఫలితంగా తొలి క్వార్టర్లో తమ రుణాలు 600 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అన్నారు. నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.ఈ ఏడాది సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు, బోనస్‌లను నిలిపివేశామని చెప్పారు. కాగా బీపీలో ఎక్కువ కార్యాలయ సిబ్బందిపైనే తొలగింపు వేటు ప్రభావం అధికంగా ఉండనుంది. చదవండి : అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు -
సౌదీ ఆరామ్‘కింగ్’!
దుబాయ్: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో స్టాక్ మార్కెట్ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్ ధరను (9.39 డాలర్లు –రూ.662) తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు. గురువారం కూడా ఈ షేర్ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీల (ఎక్సాన్ మొబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, షెవ్రాన్, బీపీ) మొత్తం మార్కెట్ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఐపీఓ, మార్కెట్ విలువలోనూ అగ్రస్థానం.... ఇటీవలే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్కో బ్రేక్ చేసింది. ఇక బంపర్ లిస్టింగ్‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా ప్రపంచ నెంబర్–1 కంపెనీగా సౌదీ ఆరామ్కో అవతరించింది. అంతే కాకుండా లిస్టెడ్ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్ 10 స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ఒకటిగా (తొమ్మిదవ స్థానాన్ని) సౌదీ అరేబియా స్టాక్ ఎక్సే్ఛంజ్ నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటిదాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో యాపిల్, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్ (92,600 కోట్ల డాలర్లు), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ (86,200 కోట్ల డాలర్లు), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (57,200 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► 1938లో ఒక చమురు బావితో సౌదీ ఆరామ్కో ప్రస్థానం మొదలైంది. ► ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లాభదాయక, అతి పెద్దదైన చమురు కంపెనీగా మారింది. ► ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముడి చమురు సరఫరాల్లో 10% ఈ సంస్థేదే. ► 2018లో కంపెనీ నికర లాభం 46% ఎగసి 11,110 కోట్ల డాలర్లకు పెరిగింది. 35,600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 13 రిలయన్స్‌లకు మించి... ఇక మన దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా రూ.9,90,564 కోట్లతో(14,050 కోట్ల డాలర్లు) రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి 13 కంపెనీలు కలిసినా... ఒక సౌదీ ఆరామ్కో కన్నా తక్కువే!! -
బాబోయ్ పెట్రోల్ ధరలు..
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. వరుసగా నాలుగో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. పైసా.. పైసా పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో సోమవారం పెట్రోల్ ధర లీటర్‌కు 12 పైసలు పెరిగింది. చెన్నైలో 13 పైసలు ఎగిసింది. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ ధర 46 పైసలు హెచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధర ఏడాది గరిష్టానికి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.32 ఉండగా, ఢిల్లీలో రూ.74.66గా ఉంది. డీజిల్ ధరలు ఢిల్లీలో రూ. 65.73, కోల్‌కతాలో రూ. 68.14, ముంబైలో రూ. 68.94, చెన్నైలో రూ. 69.47గా ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, బయట పనులకు వెళ్లేవారు సొంత వాహనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు తోడు, పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యులు మరింత భారం మోయాల్సి వస్తోంది. -
ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజం.. ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. మంగళవారం నాటి మార్కెట్ విలువ ఆధారంగా బీపీ పీఎల్సీని వెనక్కి నెట్టేసి ఈ రికార్డును నమోదు చేసింది. తద్వారా అగ్రగామి ఇంధన కంపెనీల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం బ్రిటిష్ కంపెనీ బీపీ మార్కెట్ విలువ 132 బిలియన్ డాలర్లు కాగా, రిలయన్స్ మార్కెట్ విలువ 133 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత నెలలోనూ ఓ సారి బీపీని మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ అధిగమించింది. అలాగే, ఆసియాలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ పెట్రోచైనా మార్కెట్ విలువకు చేరువగా ఆర్ఐఎల్ వచ్చేసింది. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేరు 35% ర్యాలీ చేయగా, బీపీ షేరు 1.2% పెరిగింది. వచ్చే 18 నెలల కాలంలో కంపెనీని రుణరహితంగా మారుస్తామని ఈ ఏడాది ఆగస్ట్‌లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. -
ఐపీఓకు సౌదీ ఆరామ్కో
దహ్రన్(సౌదీ అరేబియా): సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో కంపెనీ ఐపీఓ (ఇనీశీయల్ పబ్లిక్ ఆఫర్) వివరాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈ కంపెనీ 2016లోనే ఐపీఓకు వచ్చే ప్రయత్నాలు చేసింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఐపీఓ ఎట్టకేలకు సాకారమవుతోంది. బుక్ బిల్డింగ్ విధానంలో షేర్లను జారీ చేస్తామని, కంపెనీ చైర్మన్ యాసిర్ అల్–రుమయ్యన్ ఆదివారం వెల్లడించారు. ఆఫర్ ధరను, ఎన్ని షేర్లను విక్రయించేది ఈ బుక్ బిల్డింగ్ పీరియడ్ చివర్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్లు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. సౌదీ వాసులు, సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్న విదేశీయులు, ఇతర గల్ఫ్ వాసులు కూడా దరఖాస్తు చేయవచ్చని వివరించారు. ఈ నెల 9న ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనున్నది. సౌదీ ఆరామ్కో షేర్ల ట్రేడింగ్ సౌదీ స్టాక్ ఎక్సే్చంజ్(తాదావుల్)లో వచ్చే నెల(బహుశా డిసెంబర్ 11న) మొదలు కావచ్చని అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ! ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ బహుశా ఇదే కానున్నది. ఎంత వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదో అనే నిర్ణయాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. విశ్లేషకులైతే ఈ కంపెనీ విలువను 1.7–1.5 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. 1% వాటా విక్రయిస్తే, ఐపీఓ సైజు సుమారుగా 1,500 కోట్ల డాలర్లు అవుతుందని, ప్రపంచంలోనే 11వ అతి పెద్ద ఐపీఓ అవుతుందని అంచనా. ఒకవేళ 2 శాతం వాటా విక్రయిస్తే, ఇష్యూ సైజు 3,000 కోట్ల డాలర్ల అవుతుందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఇదే అవుతుందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఐపీఓ రికార్డ్ ఇప్పటిదాకా అలీబాబా కంపెనీ(2,500 కోట్ల డాలర్లు) పేరిట ఉంది. కాగా, ప్రస్తుతానికి విదేశీ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్ ఆలోచనను సౌదీ ఆరామ్కో పక్కనపెట్టింది. కాగా మన దేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతి పెద్ద ఐపీఓ కోల్ ఇండియాదే (రూ.15,100 కోట్లు–సుమారుగా 200 కోట్ల డాలర్లు) 11,110 కోట్ల డాలర్ల నికర లాభం... గత ఏడాదిలో సౌదీ ఆరామ్కో కంపెనీకి 11,110 కోట్ల డాలర్ల నికర లాభం వచ్చింది. ఇది దిగ్గజ కంపెనీలు–యాపిల్, గూగుల్, ఎక్సాన్ మొబిల్ కంపెనీల మొత్తం నికర లాభం కంటే కూడా ఎక్కువే కావడం విశేషం. -
సౌదీ ప్రభుత్వ ఆయిల్ కంపెనీపై డ్రోన్‌దాడి కలకలం
సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు ఉత్పత్తిదారు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు సౌదీ అరేబియాలో సౌదీ ఆరాంకో ప్రాసెసింగ్ యూనిట్లపై ఉగ్రదాడి కలకలం రేపింది. కంపెనీకి చెందిన రెండు ఆయిల్ యూనిట్ల లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడులు జరిగాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. బుక్యాక్‌లోని ప్రాసెసింగ్ ప్లాంట్, ఖురైస్ చమురు క్షేత్రంపై జరిగిన ఈ దాడి నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టంలేదని తెలిపింది. ఆరాంకో భద్రతా బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని వెల్లడించింది. ఇక్కడ రోజుకు 7 మిలియన్ బారెల్స్ ముడి చమురును ప్రాసెస్ అవుతుందని అంచనాలు సూచిస్తున్నాయి. కాగా ఈ దాడిపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత వహించలేదు. ఈ ప్లాంట్‌ను గతంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. 2006లో అల్-ఖైదా ఆత్మాహుతి దళాలు ఈ చమురుసముదాయంపై దాడికి విఫలయత్నం చేశాయి. -
పెట్రోల్, డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌక!
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను కిలోలీటర్‌కు రూ.9,990 (14.7 శాతం) తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.58,060కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.58.06. ఢిల్లీ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ.68.65తో పోలిస్తే తక్కువకు అందుబాటులోకి వచ్చింది. లీటర్ డీజిల్ ధర రూ.62.66 కంటే కూడా చౌకగా మారింది. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఇది పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం. డిసెంబర్‌లోనూ ఓ సారి పెద్ద మొత్తంలో రేట్లకు కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో ఏటీఎఫ్ ధరలు ఏడాది కాలంలోనే కనిష్ట స్థాయికి చేరాయి. -
సౌదీ ఆరామ్కో... ఇక జాయింట్ స్టాక్ కంపెనీ
రియాద్: సౌదీ అరేబియా చమురు దిగ్గజ కంపెనీ ఆరామ్కో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ కంపెనీకి జాయింట్ స్టాక్ కంపెనీ హోదాను ఇస్తున్నట్లు తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ హోదా ఈ నెల 1 నుంచే ఈ కంపెనీకి వర్తిస్తుందని అధికారిక గెజెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ హోదా కారణంగా వ్యక్తిగత ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీ వాటాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో ఆరామ్కో ఐపీఓ రానున్నదని ఆరామ్కో సీఈఓ అమిన్ నాసర్ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఇదే కానున్నది. ఈ ఐపీఓలో భాగంగా 5 శాతం వాటా విక్రయం ద్వారా 10, 000 కోట్ల డాలర్లు సమీకరించే అవకాశాలున్నాయి. రెనో క్విడ్ కొత్త వేరియంట్ -
ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్‌తో ఘటన రూ. కోటి సొత్తు బుగ్గిపాలు సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మేడ్చల్ పారిశ్రామికవాడలో ప్రమాదం మేడ్చల్: ఓ ఆయిల్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. రూ. కోటి విలువైన సొత్తు నష్టం జరిగింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం మేడ్చల్ పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. కంపెనీ ఎండీ యాకుబ్ అలీ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యాకుబ్‌అలీ ఇద్దరు భాగస్వామ్యులతో కలిసి మేడ్చల్ పారిశ్రామికవాడలో సుప్రీం లూబ్రికెంట్స్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. పెద్దపెద్ద మోటార్లు, వాహనాల్లో ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్‌ను సేకరించి ఈ కంపెనీలో రీసైక్లింగ్ చేసి తిరిగి విక్రయిస్తుంటారు. శనివారం ఉగాది పర్వదినం నేపథ్యంలో పరిశ్రమకు సెలవు ఉంది. కంపెనీకి కాపలాగా సెక్యూరిటీగార్డు సంజీవరెడ్డి మరో ఇద్దరు కార్మికులు ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శశాంక్‌రెడ్డి నగరంలోని జీడిమెట్లలో ఉన్న ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో అరగంటలోపు రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు గంటన్నరసేపు తీవ్రంగా శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ఇంజన్లలో నీరు సరిపోకపోవడంతో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి ఎం.సురేష్ తన ట్రాక్టర్ల ద్వారా నీటిని సకాలంలో సరఫరా చేశాడు. కంపెనీలో బాయిలర్‌లోకి మంటలు చెలరేగడంతో పరిశ్రమ బయటకు మంటలు చిమ్మాయి. ప్రమాదంలో కంపెనీ షెడ్డు, రీసైక్లింగ్ పరికరాలు, ఆయిల్ పూర్తిగా కాలిపోయాయి. షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం.. కంపెనీలో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ ఎండీ యాకుబ్ అలీ, పోలీసులు నిర్ధారించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్, సీఐ శశాంక్‌రెడ్డి ఎస్ఐలు రాములు, గోపరాజు పరిస్థితిని సమీక్షించారు. రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాగునీరు విషతుల్యం
చిలకలూరిపేటరూరల్ : ఆయిల్ కంపెనీల నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిల్లుల్లోని వ్యర్థ రసాయనాలను వాగుల్లోకి విడుదల చేసి ఆ నీటిని విషతుల్యం చేస్తున్నారు. ఫలితంగా ఆనీటిని సాగుకు వినియోగించిన పొలాల్లోని పంటలు ఎండుముఖం పడుతుండగా.. రంగుమారి నురుగుతో కూడిన వాగు నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నాయి. చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామ శివారులో రాష్ర్ట వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన ఆయిల్‌మిల్ ఉంది. ఈ మిల్లుతోపాటు ఎగువున ఉన్న మరికొన్ని కంపెనీల్లో అవసరాలకు వినియోగించిన కలుషిత నీటిని కుప్పగంజివాగులోకి తరలిస్తున్నారు. రసాయనాలు కలిసిన నీరు వాగులో చేరటంతో ఆనీరు రంగు మారి దుర్వాసన వెదజల్లుతోంది. మానుకొండవారిపాలెం - వేలూరు గ్రామాల మధ్య ప్రవహించే ఈ వాగు నీటిని ప్రజలు తాగేందుకు, పంటల సాగుకు వినియోగిస్తారు. కలుషిత నీటిని తాగిన ప్రజలు అనారోగ్యానికి గురౌతున్నారు. పశువులు మరణిస్తున్నాయి. వాగునీటిని సాగుకు వినియోగిస్తున్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. వేలూరు, మానుకొండవారిపాలెం, దండమూడి, గొట్టిపాడు, మిట్టపాలెం తదితర గ్రామాల ప్రజలు ఈ నీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వాగునీరు చెరువుల్లోకి... చిలకలూరిపేట మండలంలోని వివిధ గ్రామాలు సాగర్ ఆయకట్టు టేల్పాండ్ (చివరి ప్రాంతంలో) ఉన్నాయి. కుడికాలువ నీరు పూర్తిస్థాయిలో ప్రవహించకపోవటంతో వాగు నీటిని తాగునీటి చెరువులకు పంపింగ్ చేస్తారు. రసాయనాలతో కలిసిన మురుగునీరు చెరువులకు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వేలూరులోని చెరువుకు నీటిని పంపింగ్ చేసేందుకు వాగు సమీపంలోనే పంపింగ్ హౌస్‌ను నిర్మించారు. ఈ నీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దండమూడి గ్రామంలో వాగు పరీవాహకంలో బోర్ నుంచి వస్తున్న నీరు కూడా కలుషితమైంది. పంటపొలాలకూ రసాయన నీరు... పరిశ్రమల్లో పత్తి విత్తనాల నుంచి నూనె తీసేందుకు, క్రూడ్ ఆయిల్‌ను వేరు చేసేందుకు అధికంగా కార్బన్-ఎస్, హైడ్రోసోడియం, కాస్టిక్ సోడా, కొన్ని సందర్భాల్లో యాసిడ్‌ను వినియోగిస్తారు. పరిశ్రమల ద్వారా నిత్యం వచ్చే వృథా నీటిని మిల్లులో చెరువులను ఏర్పాటు చేసి నిల్వ చేస్తారు. ఈ నీటిని వేసవి ప్రారంభంలోనే విడుదల చేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువకు ఈనెల 15వ తేదీ తర్వాత నీరు నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు సాగు నీటి కోసం ఎదురు చూశారు. ఆయకట్టు చివరిప్రాంతంలో ఉండటంతో సాగు నీరు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ప్రత్యామ్నాయంగా వాగునీటిని ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కుప్పగంజి వాగు నీటిలో రసాయనాలు కలవటంతో ఇదే నీరు ఓగేరు వాగులో గొట్టిపాడు వద్ద కలిసిపోతోంది. దీనిపై అవగాహనలేని రైతులు పొగాకు, జొన్న, అపరాలు తదితర పంటలకు కలుషిత నీటిని పెడుతున్నారు. ఫలితంగా ఆ పంటలు దెబ్బతింటున్నాయి. రచ్చబండలో రచ్చ రచ్చ... వాగునీటిలోకి రసాయనాలు కలిసిన నీరు ప్రవహిస్తుందని వీటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. మానుకొండవారిపాలెం గ్రామంలో గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వాగునీటి సమస్యపై ప్రత్తిపాటిని ప్రజలు ప్రశ్నించగా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ దీనిపై ఆయన దృష్టిసారించలేదు. కలుషిత నీటిని వాగులో కలువకుండా చూసి ప్రజా రోగ్యాన్ని పరిరక్షించాలని బాధిత గ్రామా ల ప్రజలు అధికారులను కోరుతున్నారు. -
జనవరి 1నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
* 48 శాతం మంది వినియోగదారులకే లబ్ది * మిగిలిన 52 శాతం మందికి మూడు నెలల గడుపు సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ నగదు బదిలీ అమలుకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి1 నుంచి ఈ పథకం అమలు కానుంది. జిల్లాలో 8.12లక్షల గ్యాస్ వినియోగదారులున్నారు. ఇందులో 92 శాతం మందికి ఆధార్ సీడింగ్ అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీల వారీగా చూస్తే హెచ్‌పీసీఎల్ పరిధిలో 95 శాతం మంది లబ్దిదారులకు ఆధార్ సీడింగ్ పూర్తికాగా, బీపీసీ ఎల్ పరిధిలో 99శాతం పూర్తికాగా, ఐఒసీఎల్ పరిధిలో మాత్రం కేవలం 83 శాతం మాత్రమే జరిగింది. కీలకమైన అకౌంట్ సీడింగ్ మాత్రం 48 శాతానికి మించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినాసీడింగ్ జరగనందున డిసెంబర్ వరకు అమలు కాలేదు. అప్పట్లో 24 శాతానికి మించి ఆధార్,అకౌంట్సీడింగ్ జరక్క పోవడంతో కొద్ది మందికి మాత్రమే ఈ ఏడాది జనవరిలో అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మిగిలిన వారికి డబ్బులు పడలేదు. ఫలితంగా గందరగోళం నెలకొంది. ఆ తర్వాత కేంద్రమే ఈ పథకానికి తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా అన్ని జిల్లాలకు వర్తింప చేయాలని కేంద్రం నిర్ణయించడంతో యంత్రాంగం అకౌంట్సీడింగ్పై దృష్టి పెట్టింది. మరో 20రోజులే మిగిలి ఉండడంతో అకౌంట్ నెంబర్లు సేకరించి సీడింగ్ చేయాలని జిల్లా జేసీ ప్రవీణ్‌కుమార్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి సేకరించిన అకౌంట్ నెంబర్లను బ్యాంకులవారీగా అందజేసేందుకు ప్రతీ బ్యాంకుకొక నోడల్ అధికారిని నియమించారు. సీడింగ్ కాకపోయినా భయపడాల్సిన అవసరం లేదని జేసీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. మోడిఫైడ్ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్‌లో జనవరి నుంచి మూడు నెలలలోపు ఆధార్ నెంబర్లు లేకపోయినా అకౌంట్ ఓపెన్ చేసుకుని నెంబర్లను గ్యాస్ ఏజెన్సీలకు లేదా,తమ గ్యాస్ కన్స్యూ మర్ నెంబర్లు బ్యాంకులకు అందజేసి సీడింగ్ చేయించుకుంటే సరిపోతుందని వివరించారు. అప్పటి వరకుపాతపద్దతిలోనే సబ్సిడైజ్డ్ సిలిండర్లే సరఫరా అవుతాయన్నారు. -
పొదుపు బాటలో ఆర్టీసీ
సాక్షి, అనంతపురం: ఆర్టీసీకి అవసరమైన డీజిల్‌ను నేరుగా చమురు సంస్థల నుంచే కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించడంతో అనంతపురం రీజియన్‌కు నెలకు సుమారు రూ.16.20 లక్షల మేర ఆదా కానుంది. జిల్లాలోని 12 డిపోల పరిధిలోని 724 బస్సులు రోజుకు 3 లక్షల కిలోమీటర్ల మేరకు తిరుగుతుండగా, సుమారు 65 వేల లీటర్ల డీజిల్ వ్యయమవుతోంది. గతంలో రూ.51.55తో ఆర్టీసీ చమురు సంస్థల నుంచి డీజిల్ కొనుగోలు చేసేది. ఆర్టీసీ సంస్థకు రాయితీపై డీజిల్ అందించరాదని 2013 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సంస్థ ఒక్కో లీటరుపై రూ.11.87 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. బయటి బంకుల్లో డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా కొంత వరకైనా ఈ భారాన్ని తగ్గించుకోవచ్చని భావించిన ఆర్టీసీ అధికారులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలపై నియంత్రణ వదులుకోవడం.. ఎక్కువ మోతాదులో డీజిల్ కొనుగోలు చేసే సంస్థకు తక్కువ ధరకే అందించే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చమురు సంస్థలతోనే కొనుగోలు చేయాలని ఆర్టీసీకి సూచించింది. ఈ నిర్ణయంతో బయటి మార్కెట్లో లీటరుపై చెల్లించే ధరకన్నా రూ.0.90 పైసలు తక్కువకే లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో లీటరు డీజిల్ ధర రూ.64లు ఉండగా, ఆర్టీసీకి లీటరు రూ.63.10 లకే లభించనుంది . దీంతో జిల్లాలో రోజుకు 65 వేల లీటర్ల డీజిల్ అవసరం అవుతుండగా రోజుకు రూ.58,500 ఆదా అవుతుంది. కమీషన్లకు చెక్ అధిక మోతాదులో డీజిల్ కొనుగోలు చేసే సమయంలో లీటరుపై 50 పైసల మేర కమీషన్ ఇచ్చేలా సంస్థకు చెందిన కొందరు అధికారులు బంకుల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే.. రోజుకు రూ.32,500 మేరకు అధికారులు కమీషన్ల రూపంలో నొక్కేస్తున్నట్లు సమాచారం. ఎలాగూ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతున్నామన్న ధీమాతో బంకుల నిర్వాహకులు ట్యాంకర్లను నేరుగా ఆర్టీసీ డిపోలకే పంపేవారు. రాయితీ తొలగింపు ఆర్టీసీకి భారంగా మారగా అటు వ్యాపారులు, ఇటు సంస్థ అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. అయితే , ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అలాంటి ఆర్టీసీ అధికారులకు మింగుడుపడడం లేదని తెలుస్తోంది.ఇక నుంచి నేరుగా చమురు సంస్థల నుంచే డీజిల్ కొనుగోలు చేయాలని ఉత్తర్వులు రావడంతో, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. -
ఆర్టీసీకి కుచ్చుటోపీ
లో కొటేషన్ పేరుతో ప్రైవేటు బంకుల నుంచి డీజిల్ కొనుగోలు డీజిల్ నాణ్యత అంతంతే.. అక్రమాలకు చోటు కొత్త విధానంతో ఆర్టీసీకి నెలకు రూ.21 లక్షల నష్టం ఆయిల్ కంపెనీల నుంచి సబ్సిడీతో నేరుగా కొనుగోళ్లే మేలు పలమనేరు: ఇంధన పొదుపు వారోత్సవాలు, ఆదా చేసే డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఆర్టీసీ నష్టాల బాటలోనే పయనిస్తోంది. పాత విధానాన్ని కాదని ప్రైవేటు బంకుల నుంచి లో కొటేషన్ పేరుతో డీజిల్‌ను కొనుగోలు చేస్తుండడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ విధానం ప్రైవేటు బంకు యజమానులకు బంగారు బాతు గుడ్డులా మారింది. జిల్లాలో మొత్తం 14 డిపోలున్నాయి. వీటిలో ఏడు చిత్తూరు డివిజన్లో, మరో ఏడు తిరుపతి డివిజన్లో ఉన్నాయి. మొత్తం మీద 1,400 బస్సులు (ఆర్టీసీ అద్దె బస్సులు కాకుండా) ఈ డిపోల పరిధిలో ఉన్నాయి. ఈ బస్సులకు రోజుకు 1.26 లక్షల లీటర్ల డీజిల్ అవసరముంది. ఈ డీజిల్‌ను ప్రస్తుతం సంబంధిత డిపోల పరిధిలోని ప్రైవేటు బంకు ల నుంచి ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ఈ కారణంగా జిల్లాలో నెలకు రూ.21 లక్షల నష్టం వాటిల్లుతోంది. గతంలో ఆయిల్ కంపెనీల నుంచే కొనుగోలు గతంలో ఆర్టీసీ బస్సులకు డీజిల్ పలు ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా అందుతుండేది. దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారం రీజనల్ అధికారి స్థాయిలో జరిగేది. కంపెనీల నుంచి అందే డీజిల్ ఎంతో నాణ్యంగా ఉండేది. బస్సులకు మైలేజీ కూడా బాగా వస్తుండేది. సంబంధిత ట్యాంకర్లు ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి బయల్దేరే ముందు లాక్ చేసిన కీని అక్కడే ఉంచుకునేవారు. మరో కీ డిపోలకు అందించేవారు. దీంతో మార్గమధ్యంలో ఎటువంటి కల్తీకీ ఆస్కారముండేది కాదు. కార్పొరేషన్ ఈ విధానాన్ని గతేడాది ఆపేసింది. 2013 జవనరి నుంచి కొత్త విధానంతో డీజిల్ కొనుగోలు జరుగుతోంది. కొత్త విధానం ఎలాగంటే సంబంధిత డిపోలు ఆయా పరిధిలోని లో కొటేషన్ బంకు యజమానుల నుంచి డీజిల్‌ను పొందవచ్చు. ఈ కంపెనీలను ఎంపిక కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో డెప్యూటి చీఫ్ మెకానిక్ ఇంజినీర్, డెప్యూటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, సంబంధిత డిపో మేనేజర్ సభ్యులుగా ఉంటారు. వీరు లో కొటేషన్ బిడ్డర్లను ఎంపిక చేస్తారు. వీరికి నిర్ణీత సమయమంటూ ఉండదు. మరో లో కొటేషన్ వచ్చిందంటే ఆ యజమాని నుంచి డీజిల్‌ను కొనుగోలు చేయవచ్చు. కొత్త విధానంతో మొదటికే మోసం లో కొటేషన్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్న బంకు యజమానులు ఆర్టీసీ డీఎంలకు ట్యాంకర్ తాళాలను ఇవ్వడం లేదు. దీంతో మార్గమధ్యంలో తమ బంకుల వద్ద ఈ డీజిల్‌ను కల్తీ చేసినా కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. కొందరు బంకు యజమానులు ఈ ట్యాంకర్లలో కిరోసిన్ కల్తీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. వీరు డిప్స్టిక్కులతో తనిఖీ చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ యజమానులు కంపెనీ నుంచి నేరుగా ట్యాంకర్లను కొనుగోలు చేసి డిపోలకు పంపిణీ చేస్తున్నారు. కొటేషన్‌తో కాంట్రాక్టు దక్కించుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ మాత్రం టంచనుగా అం దుతోంది. మామూలుగా ఫిల్లింగ్ స్టేషన్లో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 823 సాంద్రతతో డీజిల్ నింపుతారు. ఆపై ట్యాంకర్ డిపోకు చేరాక సంబంధిత అధికారులు డిప్‌స్టిక్ ద్వారా పరిశీలించి సాంద్రతలో మూడు పా యింట్లు తగ్గినా డీజిల్‌ను వెనక్కి పంపాల్సి ఉంది. సం బంధిత ప్రైవేటు బంకు యజమానికి ఆర్టీసీ కారణంగా మంచి లాభాలొస్తుండడంతో డిపో అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలకు రూ.21 లక్షల నష్టం కొత్త విధానంతో ఆర్టీసీకి నెలకు రూ.21 లక్షల నష్టం వాటిల్లుతోంది. సంబంధిత బంకు యజమానులు కంపెనీల నుంచి లీటర్ డీజిల్‌ను రూ.63.03 పైసలకు పొంది సంబంధిత డిపోలకు రూ.63.63 పైసలకు సరఫరా చేస్తున్నారు. ఆర్టీసీకి 60 పైసలు తగ్గింపు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లీటరుకు బంకు యజమానికి 1.20 పైసలు సబ్సిడీ అందుతోంది. ఇందులో 60 పైసలు తగ్గింపు పోయినా మరో 60 పైసలు లీటరుకు మిగిలినట్టే. ఆ లెక్కన రోజుకు 1.26 లక్షల లీటర్లకు రూ.75,600 బంకు యజమానులకు మిగులుతోంది. ఒక నెలకైతే రూ.22.68 లక్షలు చేరుతోంది. ఫలితంగా ఆర్టీసీ ప్రతి నెలా రూ.22.68 లక్షలు నష్టపోయినట్టే. -
మోసాల ప్యా‘కింగ్’లు
ఆయిల్ కంపెనీల దగా తూకంలో చేతివాటం దోపిడీకి గురవుతున్న వినియోగదారులు మొక్కుబడి తనిఖీలతో సరి రోజు రోజుకీ పెరుగుతున్న నూనె ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంటే ప్యాకింగుల్లో దగా చేస్తూ ఆయిల్ కంపెనీలు నిట్ట నిలువునా దోచుకుంటున్నాయి. లీటరు ప్యాకెట్‌కు 80 నుంచి 120 గ్రాములు తక్కువగా ఉంటోంది. ఇలా ఆయిల్ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నా... సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తుండడంతో ఈ దోపిడీకి అంతులేకుండా పోతోంది. సాక్షి, సిటీబ్యూరో: వంట నూనె తూకం తప్పుతోంది. ప్యాకింగ్‌తో పాటు లూజ్ ఆయిల్ తూకంలో సైతం ఆయిల్ కంపెనీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రెండు చేతులా సొమ్ము చేసుకుంటూ వినియోగదారులను దోచుకుంటున్నాయి. ఆయిల్ కంపెనీలు వివిధ బ్రాండ్ల పేరుతో లీటర్, ఐదు, పది, పదిహేను లీటర్ల నూనె ప్యాకెట్లు, డబ్బాలను విక్రయిస్తున్నాయి. ప్యాకింగ్‌లో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉంటోంది. లూజ్ ఆయిల్ కొనుగోళ్లలో సైతం కంపెనీలు చేటివాటం ప్రదర్శిస్తూ తూనికలు కొలతల శాఖకు అడ్డంగా దొరికిపోతున్నా అక్రమార్కులపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఫలితంగా తూకంలో మోసం.. దగా యథేచ్ఛగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లో ఉన్న రీఫైండ్ ఆయిల్ కంపెనీలు వినియోగదారులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినపిస్తున్నాయి. సగటు వినియోగదారులతో పాటు లూస్ ఆయిల్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు సైతం నిలుపు దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయం తెలిసినా సంబంధిత అధికారులు మొక్కుబడి తనిఖీలకే పరిమితం కావడం విస్మయానికి గురిచేస్తోంది. వినియోగదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఒత్తిడి తేస్తే తప్ప అధికారులు స్పందించిన దాఖలాలు కానరావడం లేదు. అయినా నామమాత్రపు తనిఖీలతోనే సరిపుచ్చుకుంటున్నారు. మొక్కుబడి కేసులతో అధికారులు చేతులు దులుపుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది. మోసం ఇలా... మహానగర శివార్లలో సుమారు 25 వరకు ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు నగరానికి చెందిన సుమారు 120 మంది ఆయిల్ కాంట్రాక్టర్ల నుంచి నిత్యం సుమారు 300 ట్యాంకర్ల వరకు లూజ్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తాయి. వాటిని రీఫైండ్ చేసి ఆకర్షణీయ ప్యాకింగ్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రతి నెల నగరంలో సుమారు 86 లక్షల లీటర్లకు పైగానే వంటనూనె అమ్ముడుపోతుంది. ప్రతి ప్యాకింగ్‌లో కనీసం 90 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు తక్కువగా తూకం ఉండడం నిత్యకృత్యంగా మారింది. సగటున 100 గ్రాముల చొప్పున తక్కువ తూకంలెక్కిస్తే నెలకు 8.60 లక్షల లీటర్లు దోపిడీకి గురవుతున్నట్లు అంచనా. దాని విలువను ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరను బట్టి లెక్కిస్తే నెలకు రూ. 68.80 లక్షలు, ఏడాదికి రూ. 8.25 కోట్లమేర మోసం జరుగుతోంది. లూజ్ ఆయిల్లో.... ఆయిల్ కంపెనీల చేతివాటంతో లూజ్ ఆయిల్ కాంట్రాక్టర్లు సైతం నిలువునా దోపిడీకి గురవుతున్నారు. ఒక్కొక్క కంపెనీ రోజూ 10 నుంచి 20 ట్యాంకర్ల లోడ్ వరకు లూజ్ వంట నూనెను కొనుగోలు చేస్తుంటాయి. ఒక్కొక్క ట్యాంకర్లో సుమారు 16 వేల కిలో (16 టన్నులు)ల వంటనూనె లోడ్ అవుతుంది. కంపెనీకి ఆయిల్ లోడ్ రాగానే వేబ్రిడ్జిపై ట్యాంకర్‌ను తూకం వేసి అందులో 50 కిలోల తక్కువ తూకాన్ని మార్జిన్‌గా పరిగణించి మిగితా బరువును బట్టి లెక్క కట్టి కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లిస్తాయి. ట్యాంకర్లలో ఆయిల్ నింపుకొని ఎలాంటి లీకేజీ లేకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నప్పటికీ వేబ్రిడ్జిల వద్ద తూకం వేస్తే 100 కిలోలు తక్కువ రావడం నిత్యకృత్యమైంది. అందులో 50 కిలోలు తూకం మార్జిన్ కిందకు తీసేసినా మిగితా 50 కిలోల ధరను కాంట్రాక్టర్లు నష్టంగా భరించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఆయిల్ ట్యాంకర్ల కాంట్రాక్టర్లు తూనికలు కొలతల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. -
లక్షమందికి గ్యాస్ బంద్
విజయవాడ : వినియోగదారులపై కొత్త ‘బండ’ పడింది. గ్యాస్ సరఫరాలో కొత్త నిబంధనలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలు జారీచేసిన నూతన మార్గదర్శకాలవల్ల జిల్లాలో లక్ష మంది వినియోగదారులకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఒకే డోర్ నంబర్లో ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్న వేర్వేరు కుటుంబాల వారికి గ్యాస్ ఇచ్చేదిలేదని ఏజెన్సీలు వినియోగదారులకు నోటీసులు జారీచేస్తుండటంతో నగరంలోని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. వివరాలోకి వెళ్తే...చమురు కంపెనీలు తాజాగా జారీచేసిన ఉత్తర్వులను గ్యాస్ ఎజెన్సీలు అమలు చేస్తున్నాయి. ఒకే అడ్రస్-వేర్వేరు పేర్లు... ఒకే పేరు-సేమ్ అడ్రస్‌తో ఉన్న గ్యాస్ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా బంద్ చేశారు. అంటే ఒకే ఇంట్లో నాలుగైదు పోర్షన్లలో వుండే వారు ఒకే డోర్ నంబర్‌తో గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఆ విధంగా ఒకే అడ్రస్‌లో నాలుగైదు కనెక్షన్లు నాలుగైదు పేర్లతో ఉన్న వినియోగదారులకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. అదే విధంగా ఒకే పేరుతో, ఒకే అడ్రస్‌తో వివిధ కంపెనీల కనక్షన్లు వినియోగించే వారికి కూడా సరఫరా నిలిపివేశారు. జిల్లాలో ఐఓసి, బీపీసీ, హిందుస్తాన్ పెట్రోలియంకు చెందిన 77గ్యాస్ ఏజె న్సీలు ఉండగా, విజయవాడ నగరంలో 21 వరకూ ఉన్నాయి. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ నుంచి సుమారు 1500 చొప్పున, జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీలలో లక్ష కనెక్షన్లు ఉన్నాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అన్ని గ్యాస్ ఏజెన్సీలు లక్షమంది వినియోగదారులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం హిందుస్తాన్ పెట్రోలియంకు చెందిన ఏజెన్సీలు మాత్రమే నోటీసులు జారీచేసి సరఫరాను నిలిపివేశాయి. మిగిలిన రెండు కంపెనీలు కూడా త్వరలోనే నోటీసులు జారీచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఓకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ పోర్షన్లు ఉన్న వారు, అపార్టుమెంటు వాసులు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా నోటీసులు జారీ చేస్తుండడంతో వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే... ఒకే డోర్ నంబర్లో వేర్వేరు పోర్షన్లు ఉంటే వాటిని ఎ, బి, సి, డి అని, అపార్టుమెంటు వారు అయితే ఎఫ్-1, ఎఫ్-2 అని డోర్ నంబర్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద కేవైసీ ఫారం పూర్తిచేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇచ్చిన వారికి గ్యాస్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ఒకే పేరుతో వివిధ కంపెనీల కనక్షన్లు వున్న వాటిని గుర్తించి సరఫరా నిలిపివేస్తున్నారు. -
వారి యవ్వారమంతా గుట్టే..
- చమురు సంస్థల కార్యకలాపాల తీరు - ప్రమాదాల నివారణలో నిర్లక్ష్యం - ఏమైనా జరిగితే.. అధికారులదే బాధ్యత అమలాపురం : ‘కోట్లు మాకు... పాట్లు మీకు’ అన్నట్టుగా ఉంది చమురు సంస్థల తీరు. చమురు, సహజ వాయువులను వెలికితీసి తరలించుకుపోయి జేబులు నింపుకొంటున్న ఆ సంస్థలు.. ఏ చిన్న ప్రమాదం జరిగినా బాధ్యతంతా స్థాని క ప్రభుత్వ అధికారులపైకి వేసి పలాయన మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రమాదాలను ఎదుర్కోవడంలోనే కాదు, ప్రమాదాల నివారణలో కూడా స్థానికాధికారులకు, చమురు సంస్థలకు మధ్య సమన్వయం కొరవడింది. ప్రమాదం జరిగితే చమురు సంస్థల పలాయానం కేజీ బేసిన్ పరిధిలో బ్లోఅవుట్లు, పైపులైన్ల లీకేజీలు వంటి సంఘటనలు జరిగినప్పుడు చమురు సంస్థలు పలాయనమంత్రం జపిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళితే బాధితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోందని తప్పించుకుని, ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై వదిలేస్తున్నారు. నగరం లో గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు గెయిల్ సంస్థే కాకుం డా గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్), మినీ ఆయిల్ రిఫైనరీ నిర్వహిస్తున్న ఓఎన్జీసీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కనీసం అగ్నిమాపక శకటాలు కూడా పంపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితు లు తమపై దాడి చేస్తారన్న భయంతో గెయిల్ ఉద్యోగులు బయటకు అడుగు పెట్టలేదు. దీంతో మంటలను అదుపు చేయాల్సిన బాధ్యత స్థానిక అగ్నిమాపక శాఖపై పడింది. వారు రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నుంచి వచ్చేసరికే పెనునష్టం జరిగిపోయింది. నిర్వహణపై సమన్వయం లేదు ఓఎన్జీసీతో పాటు ఇతర సంస్థలకు చెందిన గ్యాస్, చము రు పైపులైన్లు కోనసీమలో విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణపై చమురు సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వీటి పనితీరు, భద్రత విషయంలో స్థానికాధికారులు, చమురు సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంది. అయితే చమురు సంస్థలు ఒంటెద్దు పోకడలకు పోతున్నాయి. రెవెన్యూ, పోలీసు, ఫైర్, పంచాయతీ శాఖల అధికారులను సమన్వయం చేసి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత చమురు సంస్థలపై ఉన్నా.. అలాంటి దాఖలాలు లేవు. పైపులైన్ల భద్రతపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు ప్రతీ రెండు నెలలకు ఓసారి సమీక్ష చేయాల్సి ఉన్నా, ఒక్కసారి కూడా జరగలేదు. పైపులైన్ల వెంటే నివాస గృహాలు ‘గ్యాస్ పైపులైన్లకు 18 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. ఇక్కడ పైపులైన్ల చుట్టూ ఇళ్లను చూస్తే ఆశ్చర్యమేస్తోంది’ అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పీ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం నగరంలో ఆయన పర్యటించినప్పుడు పైపులైన్లపైనే ఇళ్ల నిర్మాణం జరగడాన్ని చూసి విస్తుపోయారు. గ్యాస్ పైపులైన్ ప్రాంతాల్లో ‘నో కన్స్ట్రక్షన్ జోన్’ ఎంతవరకు విస్తరించి ఉందనే దానిపై చమురు సంస్థల నుంచి సరైన సమచారం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
-
సిలిం‘డర్’
పండగ వేళ పెరిగిన డిమాండ్ లక్షన్నరపైనే పెండింగ్ కాల్స్ బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా దొరుకుతున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: పండగ వేళ నగరవాసికి వంట గ్యాస్ గుబులు పట్టుకుంది. బుక్ చేసి వారం రోజులు గడుస్తున్నా గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. వంటగ్యాస్ కొరత వెంటాడుతుండటంతో సంక్రాంతి ఉత్సాహం నీరుగారుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పరిధిలో వంట గ్యాస్ కోసం పది రోజుల్లోనే లక్షన్నరకు పైగా కాల్స్ పెండింగ్‌లో పడిపోయాయి. స్టాఫ్‌వేర్ లోపం కారణంగా ఆయిల్ కంపెనీల నుంచి సిలిండర్ల సరఫరా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. దీంతో గత వారం వ్యవధిలో వంట గ్యాస్ కాల్స్ పెరిగి డిమాండ్ ఒకేసారి రెండితలైంది. మహానగరం పరిధిలో హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీ) కంపెనీల డీలర్ల వద్ద వేలాది పెండింగ్ కాల్స్ మగ్గుతున్నాయి. అయితే ఏజెన్సీల వద్ద లేవంటున్న గ్యాస్ బండలు బ్లాక్ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండటం విశేషం. సింగిల్ సిలిండర్‌తో పరేషాన్ హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం 28.21 లక్షల ఎల్పీజీ వినియోగదారులు ఉం డగా.. అందులో 40 శాతం వరకు సింగిల్ సిలిండర్ కనె క్షన్లే. వంటగ్యాస్ కొరతతో సింగిల్ సిలిండర్ వినియోగదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోనీ బ్లాక్‌లో కొందామంటే అధికమొత్తం వెచ్చించలేని దుస్థితి. ఈ నేపథ్యంలో పిండివంటలు కాదు కదా కనీసం వంట చేద్దామన్నా ఎటూ పాలుపోని పరిస్థితి. ఫలితంగా మొత్తం కనెక్షన్‌దారుల్లో లక్షన్నర మంది వినియోగదారులు బుకింగ్ చేసుకొని గ్యాస్ బండ కోసం వేచిచూస్తున్నారు. వీరిలోనూ ఐవోసీ వినియోగదారులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎల్పీజీ గ్యాస్ నిబంధనలను ఏజెన్సీలు ప్రస్తుతం గాలికి వదిలేశాయి. గతంలో గ్యాస్ బండ డెలివరీ అయిన తర్వాత మరో గ్యాస్‌బండ బుక్ చేసుకునేందుకు 21 రోజులు వ్యవధి ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ సబ్సిడీ సిలిండర్లపై పరిమితి విధించినందువల్ల 21 రోజుల వ్యవధిలో డెలివరీ నిబంధనను ఎత్తేశారు. ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసిన 24 గంటల్లో డెలివరీ చేయాల్సి ఉంది. ఎందుకంటే వినియోగదారుల పరిమితికి లోబడి సబ్సిడీ సిలిండర్ల సరఫరా ఉంటుంది. మిగితా సిలిండర్లను వారు నాన్సబ్సిడీపై కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డీబీటీ అమలవుతున్న కారణంగా సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నా.. సిలిండర్‌ను మాత్రం వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు బుక్ చేసిన 24 గంటల్లోనే గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ చేస్తున్నాయి. గత తొమ్మిది మాసాల నుంచి ఇదే పరంపర కొనసాగుతున్నా.. మధ్యమధ్యలో పెండింగ్ కాల్స్ తప్పడం లేదు. తాజాగా పండగ వేళ గ్యాస్ డెలివరీనత్తలకు నడక నేర్పిస్తున్నట్లుంది. కొరత కృత్రిమమేనా?: డొమెస్టిక్ వంటగ్యాస్ వినియోదారులకు సబ్సిడీపై ఈ ఏడాది మార్చి వరకు తొమ్మిది సిలెండర్లు మాత్రమే సరఫరా కానున్న విషయం తెలిసిందే. ఏడాది అంటే ఆర్థిక సంవత్సరాన్ని (ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మార్చి 31 వరకు) ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గడిచిన తొమ్మిది మాసాల్లో ప్రతి వినియోగదారుడు కనీసం ఆరు నుంచి ఎనిమిది సిలెండర్ల వరకు వినియోగించి ఉంటారన్నది అంచనా. ఫలితంగా కొందరు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండటంతో చేతివాటం కూడా ప్రదర్శిస్తూ కృతిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
‘గ్యాస్’ దోపిడీ
తూకంలో చేతివాటం = ఆయిల్ కంపెనీల మాయాజాలం = బాట్లింగ్ యూనిట్లలోనే మోసపు తంతు =తక్కువ గ్యాస్ నింపి వినియోగదారులకు పంపిణీ = నెలకు రూ.18 కోట్ల మేరకు టోకరా సాక్షి, సిటీబ్యూరో: విజయనగర్‌కాలనీకి చెందిన గృహిణి అనురాధ ఆన్లైన్లో సిలిండర్ బుక్ చేసిన వారానికి గ్యాస్‌బండ వచ్చింది. ముగ్గురు సభ్యుల కుటుంబం.. కానీ 20 రోజులకే గ్యాస్ నిండుకొంది. మరో సిలిండర్ బుక్ చేస్తే, అదీ వచ్చిన 17 రోజులకే ఖాళీ అయింది. మూడోసారి అనుమానం వచ్చి సిలిండర్ ఇంటికి రాగానే తూకం వేశారు. ఉండాల్సిన బరువులో 1.30 కిలోల వరకు తక్కువున్నట్టు తేలింది. అనురాధే కాదు.. మహానగరంలో లక్షలాది మంది ఎల్పీజీ వినియోగదారులు నిత్యం ఇలాగే మోసపోతున్నారు. మహానగరంలో వంటగ్యాస్ వినియోగదారులు నిట్టనిలువునా దోపిడీకి గురవుతున్నారు. నగదు బదిలీ పథకం పుణ్యమా అని ఇప్పటికే గ్యాస్‌బండ ధర చుక్కలు చూపిస్తోంది. ఇక, సిలిండర్‌లో సైతం తక్కువ గ్యాస్ నింపడం తాజా షాక్. సిలిండర్‌లో నిర్ధేశిత బరువు కంటే తక్కువ పరిమాణంలో లిక్విడ్ పెట్రోలి యం గ్యాస్ (ఎల్పీజీ) నింపుతూ సరఫరా చేయడం సర్వసాధారణమైంది. ప్రతి గృహవినియోగ సిలిండర్‌లో కిలో నుంచి రెండు కిలోల వరకు, కమర్షియల్ సిలిండర్‌లో 2-3 కిలోల వరకు తక్కువ గ్యాస్ నింపుతూ పంపిణీ చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ల నుంచే ఇలా తక్కువ తూకంతో రీఫిల్లింగ్ జరుగుతున్నట్లు ఇటీవల తూని కల కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసింది. తక్కువ తూకం వుంటే.. గ్యాస్ ఏజెన్సీ.. ఎల్పీజీ సిలిండర్‌ను బరువు తూచే యంత్రం ద్వారా తూకం వేసి వినియోగదారులకు అందించాలి. వినియోగదారుడు కూడా సిలిండర్‌ను తూకం వేసి తీసుకోవాలి. గృహవినియోగ సిలిండర్ మొత్తం బరువు సుమారు 29.9 కిలోలు ఉంటుంది. అందులో 15.7 కేజీలు సిలిండర్, 14.2 కేజీల వరకు గ్యాస్ బరువు ఉండాలి. సిలిండర్‌ను వేయింగ్ మెషీన్‌పై తూకం వేస్తే మొత్తం బరువు 29.9 కేజీల వరకు ఉండాలి. దీనికంటే తక్కువుంటే మాత్రం తూకంలో మోసం జరిగినట్లు భావించాలి. తక్షణం తూనికల కొలతల శాఖకు ఫిర్యాదు చేయాలి. వాణిజ్య అవసరాల సిలిండర్ పరిమాణం 19 కేజీల మేర ఉండాలి. గ్రేటర్లో 63 కేసులు నమోదు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తూనికల కొలతల శాఖాధికారులు ఇటీవల 63 వరకు కేసులు నమోదు చేశారు. గృహవినియోగ సిలిండర్‌లో 585 గ్రాముల నుంచి 1.09 కిలోల వరకు, కమర్షియల్ సిలిండర్‌లో 1.6 కిలోల నుంచి 2.9 కిలోల వరకు తక్కువగా రీఫిల్లింగ్ చేసి మోసం చేస్తున్న కారణంగా ప్రధాన మూడు ఆయిల్ కంపెనీలతో పాటు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లపై కేసులు నమోదు చేశారు. ఇటీవల చర్లపల్లిలోని ఐవోసీ ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్లో తూనికల కొలతల శాఖాధికారులు తనిఖీలు చేసి ఒక డొమెస్టిక్ సిలిండర్ బరువును పరిశీలించారు. నిర్ధేశిత బరువు కంటే తక్కువ తూగింది. దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేశారు. ఇలా మూడు కంపెనీలపైనా కేసులు నమోదయ్యాయి. తేడాలుంటే ఫిర్యాదు చేయండి ఎల్పీజీ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌ను తూకం వేశాకే తీసుకోవాలి. సిలిండర్ బరువును తీసేసి గ్యాస్ బరువును లెక్కించాలి. తక్కువగా ఉంటే తిరస్కరించాలి. - పీఆర్ఎన్టీ స్వామీ, ప్రాంతీయ ఉప కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ, హైదరాబాద్ గ్యాస్ దోపీడీ నెలకు రూ.18 కోట్ల పైమాటే.. గ్రేటర్లో మొత్తం ఎల్పీజీ గృహవినియోగ కనెక్షన్లు: 26 లక్షలు నిత్యం ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీల రీఫిల్లింగ్ సిలిండర్ల సరఫరా: 80 వేలు గృహావసరాల సిలిండర్ పరిమాణం:14.2 కేజీలు మార్కెట్ ధర ప్రకారం కిలో గ్యాస్ విలువ:రూ.75 గృహవినియోగ సిలిండర్ల తూకంలో సగటున తక్కువ ఉంటున్న పరిమాణం: 1- 2 కేజీలు 80 వేల సిలిండర్లపై రోజుకు వినియోగదారులు నష్టపోతున్న గ్యాస్ విలువ: రూ.60 లక్షలు ఆయిల్ కంపెనీలు నెలకు వేస్తున్న టోకరా విలువ: రూ.18 కోట్లు.