
రియాద్: సౌదీ అరేబియా చమురు దిగ్గజ కంపెనీ ఆరామ్‌కో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ కంపెనీకి జాయింట్ స్టాక్ కంపెనీ హోదాను ఇస్తున్నట్లు తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ హోదా ఈ నెల 1 నుంచే ఈ కంపెనీకి వర్తిస్తుందని అధికారిక గెజెట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
ఈ హోదా కారణంగా వ్యక్తిగత ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీ వాటాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో ఆరామ్‌కో ఐపీఓ రానున్నదని ఆరామ్‌కో సీఈఓ అమిన్ నాసర్ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఇదే కానున్నది. ఈ ఐపీఓలో భాగంగా 5 శాతం వాటా విక్రయం ద్వారా 10, 000 కోట్ల డాలర్లు సమీకరించే అవకాశాలున్నాయి.
రెనో క్విడ్ కొత్త వేరియంట్
Comments
Please login to add a commentAdd a comment