మోసాల ప్యా‘కింగ్’లు | Oil companies dishonesty | Sakshi
Sakshi News home page

మోసాల ప్యా‘కింగ్’లు

Published Tue, Aug 5 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

మోసాల ప్యా‘కింగ్’లు

మోసాల ప్యా‘కింగ్’లు

  •       ఆయిల్ కంపెనీల దగా
  •      తూకంలో చేతివాటం
  •      దోపిడీకి గురవుతున్న వినియోగదారులు
  •      మొక్కుబడి తనిఖీలతో సరి
  • రోజు రోజుకీ పెరుగుతున్న నూనె ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంటే ప్యాకింగుల్లో దగా చేస్తూ ఆయిల్ కంపెనీలు నిట్ట నిలువునా దోచుకుంటున్నాయి. లీటరు ప్యాకెట్‌కు 80 నుంచి 120 గ్రాములు తక్కువగా ఉంటోంది. ఇలా ఆయిల్ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నా... సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తుండడంతో ఈ దోపిడీకి అంతులేకుండా పోతోంది.
     
    సాక్షి, సిటీబ్యూరో: వంట నూనె తూకం తప్పుతోంది. ప్యాకింగ్‌తో పాటు లూజ్ ఆయిల్ తూకంలో సైతం ఆయిల్ కంపెనీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రెండు చేతులా సొమ్ము చేసుకుంటూ వినియోగదారులను దోచుకుంటున్నాయి. ఆయిల్ కంపెనీలు వివిధ బ్రాండ్ల పేరుతో లీటర్, ఐదు, పది, పదిహేను లీటర్ల నూనె ప్యాకెట్లు, డబ్బాలను విక్రయిస్తున్నాయి.

    ప్యాకింగ్‌లో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉంటోంది. లూజ్ ఆయిల్ కొనుగోళ్లలో సైతం కంపెనీలు చేటివాటం ప్రదర్శిస్తూ తూనికలు కొలతల శాఖకు అడ్డంగా దొరికిపోతున్నా అక్రమార్కులపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఫలితంగా తూకంలో మోసం.. దగా యథేచ్ఛగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లో ఉన్న రీఫైండ్ ఆయిల్ కంపెనీలు వినియోగదారులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినపిస్తున్నాయి. సగటు వినియోగదారులతో పాటు లూస్ ఆయిల్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు సైతం నిలుపు దోపిడీకి గురవుతున్నారు.

    ఈ విషయం తెలిసినా సంబంధిత  అధికారులు మొక్కుబడి తనిఖీలకే పరిమితం కావడం విస్మయానికి గురిచేస్తోంది. వినియోగదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఒత్తిడి తేస్తే తప్ప అధికారులు స్పందించిన దాఖలాలు కానరావడం లేదు. అయినా నామమాత్రపు తనిఖీలతోనే సరిపుచ్చుకుంటున్నారు. మొక్కుబడి కేసులతో అధికారులు చేతులు దులుపుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది.
     
    మోసం ఇలా...

     
    మహానగర శివార్లలో సుమారు 25 వరకు ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు నగరానికి చెందిన సుమారు 120 మంది ఆయిల్ కాంట్రాక్టర్ల నుంచి నిత్యం సుమారు 300 ట్యాంకర్ల వరకు లూజ్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తాయి. వాటిని రీఫైండ్ చేసి ఆకర్షణీయ ప్యాకింగ్‌లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రతి నెల నగరంలో సుమారు 86 లక్షల లీటర్లకు పైగానే వంటనూనె అమ్ముడుపోతుంది. ప్రతి ప్యాకింగ్‌లో కనీసం 90 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు తక్కువగా తూకం ఉండడం నిత్యకృత్యంగా మారింది. సగటున 100 గ్రాముల చొప్పున తక్కువ తూకంలెక్కిస్తే నెలకు 8.60 లక్షల లీటర్లు దోపిడీకి గురవుతున్నట్లు అంచనా. దాని విలువను ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరను బట్టి లెక్కిస్తే నెలకు రూ. 68.80 లక్షలు, ఏడాదికి రూ. 8.25 కోట్లమేర మోసం జరుగుతోంది.
     
    లూజ్ ఆయిల్‌లో....
     
    ఆయిల్ కంపెనీల చేతివాటంతో లూజ్ ఆయిల్ కాంట్రాక్టర్లు సైతం నిలువునా దోపిడీకి గురవుతున్నారు. ఒక్కొక్క కంపెనీ రోజూ 10 నుంచి 20  ట్యాంకర్ల లోడ్ వరకు లూజ్ వంట నూనెను కొనుగోలు చేస్తుంటాయి. ఒక్కొక్క ట్యాంకర్‌లో సుమారు 16 వేల కిలో (16 టన్నులు)ల వంటనూనె లోడ్ అవుతుంది. కంపెనీకి ఆయిల్ లోడ్ రాగానే వేబ్రిడ్జిపై ట్యాంకర్‌ను తూకం వేసి అందులో 50 కిలోల తక్కువ తూకాన్ని మార్జిన్‌గా పరిగణించి మిగితా బరువును బట్టి లెక్క కట్టి కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లిస్తాయి.

    ట్యాంకర్లలో ఆయిల్ నింపుకొని ఎలాంటి లీకేజీ లేకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నప్పటికీ  వేబ్రిడ్జిల వద్ద తూకం వేస్తే 100 కిలోలు తక్కువ రావడం నిత్యకృత్యమైంది. అందులో 50 కిలోలు తూకం మార్జిన్ కిందకు తీసేసినా మిగితా 50 కిలోల ధరను కాంట్రాక్టర్లు నష్టంగా భరించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఆయిల్ ట్యాంకర్ల కాంట్రాక్టర్లు తూనికలు కొలతల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement