packing
-
జోలోప్యాక్వైపు బాలీవుడ్ చూపు
న్యూఢిల్లీ: పర్యావరణహిత(సస్టెయినబుల్) డిస్పోజబుల్ ప్యాకింగ్ సంస్థ జోలోప్యాక్ ఇండియాలో పెట్టుబడులకు పలువురు బాలీవుడ్ అగ్రహీరోలు ఆసక్తి చూపుతున్నారు. సెలబ్రిటీ నటులు ఆమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ పబ్లిక్ ఇష్యూకంటే ముందుగా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా రోజీ బ్లూ ఇండియా యజమాని రసెల్ మెహతా, ఆకాశ్ అంబానీ మామ సైతం కంపెనీలో మైనారిటీ వాటాలను సొంతం చేసుకున్నారు. అయితే ఎవరెంత ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడికాలేదు. సంస్థ ప్రీఐపీవో రౌండ్లో వాటాలు కొనుగోలు చేసిన జాబితాలో రివర్స్టోన్ క్యాపిటల్‌కు చెందిన దేవనాథన్ గోవిందరాజన్, మినర్వా వెంచర్స్ ఫండ్, నెక్ట్సా ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, ఎన్వీఎస్ కార్పొరేట్ కన్సల్టెన్సీ సరీ్వసెస్, ఓపస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సరోద్ రియలీ్ట, ఫిరోజ్ ఫామ్స్ అండ్ హోల్డింగ్స్, వినే ఈక్విటీ మార్కెట్ ఎల్ఎల్పీ చేరాయి. కంపెనీ వివరాలివీ.. పుణేకు చెందిన జోలోప్యాక్ ఇండియా ఆర్గానిక్ డిస్పోజబుల్ చాకులు(కట్లెరీ), ఐస్‌క్రీమ్ స్టిక్స్, స్పూన్లు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. కంపెనీ ఇప్పటికే పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 52.86 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. గతేడాది(2023–24) కంపెనీ ఆదాయం రూ. 12 కోట్ల నుంచి రెండున్నర రెట్లు జంప్‌చేసి రూ. 31.5 కోట్లకు చేరింది. నికర లాభం సైతం రూ. 3.5 కోట్ల నుంచి రూ. 6.4 కోట్లకు ఎగసింది. -
ఫుడ్ ప్యాకేజింగ్.. వంటింట్లో ఈ సీలర్ ఉండాల్సిందే
ఈ రోజుల్లో పిండి, నూక దగ్గర నుంచి నట్స్, స్నాక్స్ వరకు అన్నీ ప్యాకెట్స్‌లోనే దొరుకుతున్నాయి. ఒకసారి కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత.. మరోసారి వాడేలోపు పాడవకుండా, పురుగు పట్టకుండా.. మెత్తబడకుండా ఈ సీలర్ను ఇంట్లో పెట్టుకోవాల్సిందే. ఇది చార్జింగ్‌తో నడుస్తుంది. అల్యూమినియం ఫాయిల్ హీట్ సీలింగ్ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ స్నాక్ బ్యాగ్‌లు, వాక్యూమ్ ఫుడ్ స్టోరేజ్ బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ బ్యాగ్‌లు ఇలా చాలా వాటికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో మినీ చాకు కూడా ఉంటుంది. దాని సాయంతో కవర్ని కట్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెటిక్తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్ బెల్ట్ కూడా ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు. ధర కూడా తక్కువే. ఈ సీలర్ ధర12 డాలర్లు (రూ.997) . -
AICPDF: ఎఫ్ఎంసీజీ.. అన్నేసి ప్యాక్‌లు వద్దు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టడం వల్ల ప్రస్తుత నెట్‌వర్క్‌పై అదనపు భారం పడినట్టు పంపిణీదారులు పేర్కొంటున్నారు. ప్యాకింగ్ సైజులను నాలుగు ప్రధాన కేటగిరీలుగా ప్రామాణీకరించాలని కోరుతున్నారు. ఆరంభ ప్యాక్, చిన్న ప్యాక్, మధ్యస్థ ప్యాక్, పెద్ద ప్యాక్ ఇలా నాలుగు విభాగాలుగా ఉండాలని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) డిమాండ్ చేసింది. గ్రామీణ మార్కెట్లలో విక్రయాలు పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టాయి. దీంతో ధరల పరంగా వినియోగదారుల్లో అయోమయం ఏర్పడినట్టు, స్టాక్ నిర్వహణ పరంగా సవాళ్లు ఎదురవుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ తెలిపింది. ఒకే ధరలో పరిమాణం పరంగా వ్యత్యాసం ఉంటుండడం వినియోగదారుల్లో అయోమయాన్ని కలిగిస్తున్నట్టు ఏఐసీపీడీఎఫ్ ప్రెసిడెంట్ ధైర్యíÙల్ పాటిల్ చెప్పారు. నిల్వ వసతులు పరిమితంగా ఉన్నప్పుడు కంపెనీలు తీసుకొచ్చే ఇన్నేసి రకాల సైజుల ఉత్పత్తులను నిర్వహించడం పెద్ద సవాలుగా పేర్కొన్నారు. దీంతో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను నాలుగు ప్రామాణిక ప్యాక్ సైజులు కింద వర్గీకరించాలని కేంద్ర ప్రజా పంపిణీ శాఖకు ఏఐసీపీడీఎఫ్ సూచించింది. ‘‘ప్రామాణిక ప్యాకేజింగ్ సైజులకు ఉత్పత్తులను క్రమబద్ధీకరించడం వల్ల నిర్వహణ సులభతరం అవుతుంది. రిటైలర్లకు సంక్లిష్టతలు తగ్గుతాయి. వినియోగదారుల్లో అయోమయాన్ని పోగొట్టొచ్చు’’అని పేర్కొంది. ఒకవైపు మార్కెట్ విస్తరణతోపాటు, మ రోవైపు ఉత్పత్తుల పంపిణీ నెట్వర్క్ సాఫీగా నడిచేందుకు వీలుగా ప్యాకింగ్ సైజులు ఉండాలని అభిప్రాయపడింది. కంపెనీలు ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు తాము ప్రోత్సాహం ఇస్తామని, మరింత వ్యవస్థీకృత, వినియోగదారు అనుకూల మార్కెట్ కోసం కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఏఐసీపీడీఎఫ్ అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల డీలర్లు, పంపిణీదారులు, స్టాకిస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. -
రామయ్య తలంబ్రాలు గంటకు 1,500 ప్యాకెట్లు
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. భద్రాచలంలో కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు పంచడంతోపాటు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేవారికి సరఫరా చేసేందుకు దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు తలంబ్రాలు అందించేందుకు వీలుగా ప్రత్యే క యంత్రాల ద్వారా వాటిని ప్యాకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తలంబ్రాల తయారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రామయ్య కల్యాణ తలంబ్రాలు కావాల నుకునేవారు మీసేవ కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ల ఇబ్బందికి చెక్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏటా శ్రీసీతా రాముల కల్యాణ మహోత్స వాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారాములకు సమర్పించే ముత్యా ల తలంబ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకెళితే మంచి జరు గుతుందన్న భావనతో చాలా మంది భక్తులు తీసుకుంటుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగానే ముత్యాల తలంబ్రాలను అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండి కల్యాణోత్సవానికి హాజరు కాలేని వారితోపాటు బంధువులు, స్నేహితులకు అందజేసేందుకు కావాలను కునే భక్తుల కోసం దేవస్థానం రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తోంది. గతంలో ఈ తలంబ్రాలను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో ప్యాకింగ్ చేయించేవారు. దీనితో చాలా సమయం పట్టడంతోపాటు ఆ ప్యాకెట్లు రవాణాలో చిరిగిపోయేవి. ఈ క్రమంలోనే వేగంగా ప్యాకింగ్ చేయడం, రవాణాలో దెబ్బతినకుండా ఉండేలా దేవస్థానం అధికారులు ప్యాకింగ్ యంత్రాలపై దృష్టిపెట్టారు. దాతల చేయూతతో యంత్రాలు.. ముత్యాల తలంబ్రాలు, పులిహోర ప్రసా దం ప్యాకింగ్ యంత్రాల కోసం దేవస్థానం అధికారులు దాతలను సంప్రదించారు. తిరుపతి ఖాదీబండార్కు చెందిన కుమార్ కిట్టు యాజమాన్యం రూ.1.40 లక్షలతో తలంబ్రాల ప్యాకింగ్ యంత్రాన్ని, శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.50 లక్షల విలువైన ప్యాకింగ్ కవర్లను సమకూ ర్చాయి. ఇక రూ.1.45 లక్షల విలువైన పులిహోర ప్రసాదం ప్యాకింగ్ యంత్రాన్ని తులసి ఆస్పత్రి యజమాన్యం ఏజేఆర్ సేవా సంస్థ పేరుతో సమకూర్చింది. గంటకు 1,500 ప్యాకెట్లు యంత్రంలో తలంబ్రాల నడుమ ముత్యాలు ఉంచి ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్యాకెట్లు తయారై బయటికి వస్తాయి. ఈ యంత్రం ద్వారా నిమిషానికి 25 చొప్పున గంటకు 1,500 ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి. రోజూ సుమారు 20 వేల వరకు ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. పులిహోర ప్యాకింగ్ యంత్రం ద్వారా గంటకు 1,400 వరకు ప్యాకెట్లు సిద్ధ మవుతున్నాయి. ఇటీవలి వరకు రోజువారీగా విక్ర యించే ప్రసాదాన్ని ప్యాక్ చేయాలంటే కార్మికులకు ఒకపూటంతా పట్టేదని.. ఇప్పుడు 2 గంటల్లోనే పని పూ ర్తవుతోందని అధికారులు చెప్పారు. పోస్టల్ శాఖ, ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను భక్తులకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్‌తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్‌కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్‌కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్‌రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
చేపల పట్టుబడి.. మెలకువలతో అధిక రాబడి
కైకలూరు: ఏపీలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొల్లేరు పరీవాహక ప్రాంత నియోజకవర్గాలన్నీ ఒకే గూటికి చేరాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు 320 లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. చేప ఉత్పత్తులలో మేలైన విధానాలు అవలభించకపోతే 30 శాతం నష్టపోయే అవకాశం ఉంది. చేపలను పట్టిన తర్వాత మెత్తబడటం, పొలుసులు ఊడటం, మొప్పలు పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని ప్యాకింగ్ చేయకూడదు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెట్లో చేపలకు మంచి ధర దక్కుతుంది. చెరువుల్లో చేపలను సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేయడం ఎంత ముఖ్యమో పట్టుబడి తర్వాత కూడా తాజా చేపలను మార్కెటింగ్ చేసి అధిక ధర దక్కించుకోవడమూ అంతే కీలకం. నీటి నుంచి చేపలను బయటకు తీసిన తర్వాత వాటి శ్వాసక్రియ ఆగిపోతుంది. ఆ వెంటనే జీవ రసాయన, సూక్షజీవుల చర్య మొదలవుతుంది. మాంసం సహజగుణం కోల్పోకుండా ప్యాకింగ్ చేసే వరకు చేపల రైతులు కొన్ని మెలకువలు పాటించాలని కలిదిండి మత్స్యశాఖ అభివృద్థి అధికారి సీహెచ్ గణపతి సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే.. పట్టుబడికి ముందు ఈ జాగ్రత్తలు అవసరం ∙రైతులు మార్కెట్లో చేపల ధరలను ముందే తెలుసుకోవాలి ∙చెరువుగట్టు వద్దే తూకం జరిగేలా వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి ∙పట్టుబడి ముందు రోజు చెరువులో చేపలకు మేతలను నిలుపుదల చేయాలి ∙చిన్న చెరువు అయితే ఒక్క రోజులో పట్టుబడి ముగిసేలా చూడాలి. ∙చెరువులో నీరు తోడటానికి డీజిల్ ఇంజిన్లను సిద్ధం చేసుకోవాలి ∙కూలీలను, ఐస్ ప్యాకింగ్ చేసే వారిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి ∙ప్యాకింగ్‌కు ఐస్ ఎంత కావాలో ముందుగానే అంచనా వేయాలి పట్టుబడి సమయంలో.. ∙ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున పట్టుబడి చేయాలి ∙చెరువులో నీటిమట్టం మూడో వంతుకు వచ్చిన తర్వాత లాగుడు వలలతో చేపలను పట్టాలి ∙నీరు బయటకుపోయే తూముకు సంచి కట్టాలి ∙పట్టుబడి చేసేటప్పుడు నీటిని ఎక్కువగా బురద చేయకూడదు ∙చేపల పట్టుబడికి రసాయనాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు ∙చేపలు ఎగరకుండా ట్రేలను ఉపయోగించాలి ∙చేపలను బయటకు తీసిన వెంటనే తూకం వేసే ప్రదేశానికి తరలించాలి పట్టుబడి తర్వాత.. ∙పట్టుబడి చేసిన చేపలను మంచినీటిలో శుభ్రపర్చాలి ∙నేలపై పరిచిన ప్లాస్టిక్ సంచి మీద మాత్రమే చేపలను వదలాలి ∙దెబ్బలు తగలకుండా, మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙తూకం, రవాణా ప్రదేశం ఒకే చోట ఉండేలా చూడాలి ∙పరిశుభ్రమైన మంచినీటితో తయారు చేసిన ఐస్‌ను వాడాలి ∙రవాణా సమయాన్ని బట్టి 1:1 నిష్పత్తిలో ఐస్ ఉపయోగించాలి ∙మోతాదుకు మించి ఎక్కువ వరసలో చేపలను ట్రేలలో ఉంచకూడదు ∙ప్లాస్టిక్ ట్రేలలో చేపలను ప్యాకింగ్ చేసినప్పుడు అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పాటు చేయాలి ∙మిషన్ ఆడించి పొడిగా చేసిన ఐస్‌ను మాత్రమే ప్యాకింగ్‌కు ఉపయోగించాలి గ్రేడింగ్ ఇలా.. ∙చేపల పట్టుబడి తర్వాత గ్రేడింగ్ ఎంతో కీలకం ∙మెత్తబడిన చేపలు, గ్రహణం మొర్రి, వంకర తిరిగిన చేపలు, జన (గుడ్లు)ను గుర్తించాలి ∙ఆరోగ్యంగా లేని చేపలను విడిగా ప్యాకింగ్ చేయాలి ∙చేపలను ప్లాస్టిక్ ట్రేలు, థర్మకోల్ బాక్సుల్లోనే ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసిన సమయంలో మెత్తబడిన చేపలను విడిచేటప్పుడు మిగిలిన చేపలతో కలవకుండా చూడాలి ∙చేపల సైజులను గుర్తించి విడివిడిగా ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా శుభ్రత పాటించాలి చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! -
సరికొత్తగా తిరుపతి లడ్డూ ప్యాకింగ్: టీటీడీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ / కుషాయిగూడ: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇకపై పర్యావరణ అనుకూలమైన సంచీల్లో లభించనుంది. నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పట్టే ప్లాస్టిక్ స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ రామ్‌మనోహర్‌బాబు వెల్లడించారు. ప్రమాదకర సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, నాగార్జున విశ్వవిద్యాలయం, డీఆర్డీవోతో కలసి హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎకొలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎకొలాస్టిక్)ను చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలసి శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్‌మనోహర్‌బాబు మాట్లాడుతూ దైనందిన జీవితంలో విడదీయరాని భాగం గా మారిన ప్లాస్టిక్... భూమి, నేల, నీరు, జలచరా లకు ప్రమాదంగా పరిణమించిందన్నారు. ప్లాస్టిక్ బదులుగా వాడి పడేసిన కొన్ని నెలలకే సురక్షితం గా, సంపూర్ణంగా నాశనమయ్యే ఎకొలాస్టిక్ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ను వాడటం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు. డీఆర్డీవో శాస్త్రవేత్త కె. వీరబ్రహ్మం, నాగార్జున వర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల ఫలితంగా ఈ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ ఆవిష్కరణ జరిగినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలోగా దేశవ్యాప్తంగా వాడిపారేసే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న నిర్ణయం నేపథ్యంలో ఇలాంటి ఉత్పత్తుల అవసరం చాలా ఉందన్నారు. -
కాలం చెల్లిన సరకులకు కొత్త ప్యాకింగ్
మర్రిపాలెం(విశాఖ ఉత్తర): కాలం చెల్లిన సరకులను కొత్తగా ప్యాకింగ్ చేసి సంక్షేమ శాఖ వసతి గృహాలకు సరఫరా చేస్తున్న కల్తీరాయుళ్ల గుట్టు విజిలెన్స్ దాడుల్లో బట్టబయలైంది. మాధవధార ప్రాంతంలో సూర్యకుమారి ఏజెన్సీస్ పేరుతో సరకులను గోదాంలో నిల్వ ఉంచారు. ఇక్కడ కాలం చెల్లిన ఉత్పత్తులు నిల్వలుగా ఉన్నట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఏజెన్సీకి చెందిన మాధవధార, శివాజీపాలెం, మధురవాడ ప్రాంతాల్లోని గోదాంలలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. గోధుమ పిండి ప్యాకెట్లు, డెయిరీ ఉత్పత్తులు, ఎనర్జీ డ్రింక్స్‌ను కాలం చెల్లినవిగా గుర్తించారు. ఏజెన్సీ నిర్వాహకుడు ప్రభాకర్ నుంచి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన ఎస్పీ కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఆహార పదార్థాలు కాలం చెల్లిన తర్వాత వాటిని వినియోగంలోకి లేకుండా దహనం చేయాల్సి ఉంది. అయితే వాటిని ఓ ముఠా తిరిగి ప్యాకింగ్ చేసి ఎం.ప్రెష్ బ్రాండ్‌తో నాణ్యత లేని సరుకును మార్కెట్లో అమ్మకాలకు సిద్ధం చేస్తోంది. మాధవధారలోని సూర్యకుమారి ఏజెన్సీలో ఈ సరకు నిల్వ ఉందని విజిలెన్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో శుక్రవారం అధికారులు దాడులు నిర్వహించారు. సరకు ఎక్కడెక్కడికి పంపించారో ఎస్పీ కోటేశ్వరరావు, బృంద సభ్యులు ఆరా తీసి.. శివాజీపాలెం, మధురవాడ ప్రాంతాల్లోని గోదాంలపై దాడులు చేశారు. శివాజీపాలెంలో వెంకటేశ్వర ట్రేడర్‌లో ఎం.ఫ్రెష్ పేరిట 60 బస్తాల గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ట్రేడర్ యజమానులు మాట్లాడుతూ సూర్యకుమారి ఏజెన్సీ నుంచి సరకులు తీసుకుంటున్నామని అధికారులకు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు సరకు పంపిణీ చేసేందుకు సూర్యకుమారి ఏజన్సీ కాంట్రాక్ట్ తీసుకుందని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రజలకు నాణ్యత లేని సరకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ సి.ఎం.నాయుడు, సీఐ మల్లికార్జునరావు, కమర్షియల్ టాక్స్ అధికారి రేవతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
చాక్లెట్లతో పర్యావరణానికి హాని!
లండన్: మనం ఎంతో ఇష్టపడే చాక్లెట్ల వల్ల పర్యావరణానికి అపారమైన హాని కలుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన పరిశోధకులు చాక్లెట్ల తయారీలో వాడే పదార్థాలు, తయారీ విధానం, ప్యాకింగ్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇందులో బ్రిటన్‌లోని చాక్లెట్ల పరిశ్రమ ఏటా 20 లక్షల టన్నుల గ్రీన్ హౌన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చాక్లెట్లు, ప్యాకింగ్ వాడే ముడి పదార్థాల వల్ల ఎక్కువ హాని కలుగుతోందని గుర్తించారు. -
52 ఏళ్ల తర్వాత ఖాళీచేస్తున్నాడు
న్యూఢిల్లీ: గుజరాత్లో ఓ వ్యక్తి 52 ఏళ్లుగా కోర్టు ఆదేశాలను పెడచెవినపెడుతూ తాను కిరాయికి ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం లేదు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆయనకు చీవాట్లు పెట్టి ఆ ఇంటిని యజమానికి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. కిరాయిదారుడు నెలలోపు ఖాళీచేయాలని, లేదంటే ఆయన సామాన్లు బయట పడేయాలని పోలీసులకు హుకుం జారీచేసింది. బీఎం పటేల్ అనే వ్యక్తి ఎంకే బ్యారట్‌కు తన ఇంటిని అద్దెకిచ్చారు. ఆ ఇంటిని మరో వ్యక్తికి అద్దెకిచ్చిన పటేల్..బ్యారట్‌ను ఖాళీ చేయించాలనుకున్నాడు. 1965లో ఇందుకు అనుకూలంగా స్థానిక కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ బ్యారట్ పిటిషన్ దాఖలుచేసి కేసులో తదుపరి చర్యలు చేపట్టకుండా ఇంతకాలం అడ్డుకున్నారు. గతేడాది గుజరాత్ హైకోర్టు కూడా ఖాళీచేయాల్సిందేనని బ్యారట్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ సుప్రీంకోర్టు చేరిన ఆయనకి గట్టి దెబ్బే తగిలింది. గురువారం ఈ కేసు విచారణకు రాగా అసలు విషయం తెలిసి జడ్జీలు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ షాక్‌కు గురయ్యారు. 52 ఏళ్లుగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న బ్యారట్‌ను తీవ్రంగా మందలించారు. నెలలోపు ఖాళీచేయాలని ఆయన తరఫు లాయర్‌కు స్పష్టం చేశారు. -
15 రకాల వస్తువులతో ప్యాకింగ్
సిద్ధం చేస్తున్న డ్వాక్రా మహిళలు డీఆర్డీఏ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద తక్కువ ధరకే విక్రయం హనుమాన్‌పాలెం(కొల్లిపర) : కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానానికి అవసరమైన వస్తువులను మండలంలోని హనుమాన్‌పాలెం గ్రామంలో ప్యాకింగ్ చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద పిండ ప్రదానాలకు అవసరమైన వస్తువులను భక్తులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అవసరమైన వస్తువులను చక్కగా ప్యాకింగ్ చేసే బాధ్యతను అధికారులు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. క్రమంలో హనుమాన్‌పాలెం గ్రామానికి చెందిన ఆసంటి రత్నకుమారికి 20 వేల ప్యాకెట్ల తయారీ బాధ్యతను అప్పగించారు. ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న సుగాలీకాలనీకి చెందిన మహిళలతో ప్యాకింగ్ పని చేయిస్తున్నారు. మొత్తం 15 రకాల వస్తువులతో 20 వేల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ 25 మంది మహిళలు మూడు రోజులుగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. వీరికి కొందరు పురుషులు కూడా సాయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల వస్తువుల ప్యాకింగ్‌ను పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రత్నకుమారి చెప్పారు. ప్యాకెట్లో ఉండే వస్తువుల వివరాలు.. పసుపు, కంకుమ, హారతి కర్పూరం, సాంబ్రానీ కడ్డీలు, గంథం, ఇస్తరాకులు, బెల్లం, నూములు, బియ్యంపిండి, బియ్యం, వక్కలు, తమలపాకులు, అరటికాయ, అవునెయ్యి, అవుపాలు. వీటన్నింటిని విడివిడిగా ప్యాకింగ్ చేయడంతోపాటు అన్ని కలపి ఒక సంచిలో ప్యాకింగ్ చేస్తున్నారు. -
ప్రకృతి... ప్యాకింగ్!
హ్యూమర్ ప్లస్ ప్రాడక్ట్ ఎంత బాగున్నా ప్యాకింగ్ మరింత బాగుండాలి. లేకపోతే ఆ ఉత్పాదనకు తగినంత క్రేజ్ రాదు. అందుకే లోపల ఉండే అసలు వస్తువు కంటే, పైన ఉండే ప్యాకింగ్ బాగుండేలా శ్రద్ధ తీసుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. ఈ ప్యాకింగ్ గుట్టుమట్లన్నింటినీ ప్రకృతినుంచే అవి నేర్చుకున్నాయని పండిపోయిన బిజినెస్ పండితులు చెప్పే మాట. తొక్కలోది ప్యాకింగ్ ఏముందండీ... లోపలి సరుకు బాగుండాలని కొందరు అంటుంటారు. కానీ కమలాపండు చూడండి. తొక్క చాలా అందంగా ఉండేలా కమలాలను కమనీయంగా ప్యాక్ చేసి ఉంచుతుంది ప్రకృతి. అందుకే కొన్ని సార్లు ప్యాకింగ్ చూసి టెంప్ట్ అయి, పండు తింటారు కొందరు. సదరు ప్యాకింగ్‌తో మోసపోయి పళ్లుకరచుకుంటారు. పైన ప్యాకింగ్ చూస్తే పక్వానికి వచ్చినదానిలా అనిపిస్తుంది. కానీ లోపల పండు రుచిచూస్తే అది పుల్లగా ఉంటుంది. అందుకే ప్రకృతిలోనూ కొన్ని ప్యాకింగ్‌లు పైకి ఎఫెక్టివ్‌గా కనిపిస్తూ, లోపల డిఫెక్టివ్‌గా ఉండవచ్చు. ఆరెంజ్ విషయంలోనూ కమలాలాంటి అరేంజ్మెంటే జరిగిపోయింది. అదే కుటుంబానికి చెందినదే అయినా కమలాపండు కంటే బత్తాయి ప్యాకింగ్ కాస్త టైట్‌గా ఉంటుంది. కమలాలతో పోలిస్తే దీని ప్యాకింగ్ అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదనేనేమో తినడం కంటే రసం తీసుకుని తాగేస్తూ ఉంటారు మనుషులు. ఇక అరటిపండు ప్యాకింగ్‌ను అలవోకగా విప్పేయవచ్చు కాబట్టే తోపుడుబండ్లలో వాటి అమ్మకమే ఎక్కువ. కోన్ ఐస్‌క్రీమ్‌ల విషయానికి వద్దాం. లోపల నింపిన బటర్‌స్కాచ్, వెనిల్లా వంటి ఫ్లేవర్కూ పైనున్న కరకరలాడే బిస్కెట్కోన్ ఒక ప్యాకింగ్ అనుకుందాం. ద్రాక్షపండులాగే సదరు కోన్నూ ప్యాకింగ్‌తో సహా తినేయవచ్చు. ఇలా తొక్కతో పాటూ తినేసే సౌలభ్యం విషయంలో ద్రాక్షకు ఆపిల్ జోడీగా వస్తుంది. తోడుగా ఉంటుంది. ఇక పుచ్చకాయ వంటి ప్యాకింగ్‌లను అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదు. అందుకే ముక్కలు ముక్కలు చేసేసి, మధ్యలోని గుజ్జు తినేసి, పండుపైనున్న ప్యాకింగ్‌ను పారేస్తూ ఉంటారు. అయితే ఎర్రటి గుజ్జు ఉన్న అసలు ప్రాడక్ట్‌తో పాటు పైన ప్యాకింగ్‌లోని తెల్లభాగానికీ కాస్త మహత్యాన్ని ఇచ్చిందట ప్రకృతి. కేవలం రుచిగా ఉండే అసలుతో పాటు ప్యాకింగ్‌లోని కొసరు కూడా తింటే ఆరోగ్యం అంటుంటారు విజ్ఞులు. పనసకాయ విషయంలో ప్యాకింగ్ విప్పాలంటే దానికి కత్తిలాంటి నైపుణ్యం కూడా కావాలంటారు పెద్దలు. కొబ్బరికాయను చాలా ఎత్తుమీద ఉండేలా చూసింది కాబట్టి... గభాల్న అంతెత్తునుంచి కింద పడిపోతే కొబ్బరికి దెబ్బతగలకుండా లోపల పీచూ, టెంక వంటి వాటితో పకడ్బందీ ప్యాకింగ్ చేసింది ప్రకృతిమాత. ఇక కూరగాయల్లో బెండ, దొండ, వంకాయ వంటి వాటికి ప్యాకింగ్ ఏదీ లేకుండా అను గ్రహించిందట శాకంబరీదేవత. టొమాటోపైన పల్చటి పొర లాంటిది ఉన్నా దాన్ని గబుక్కున తొలగించడానికి అంతగా వీల్లేకుండా చేసిందట. దాంతో పాటు బీరకాయ, పొట్లకాయ వంటి కొన్ని కూరగాయలకు పైనున్న పలచటి ప్యాక్‌నూ వంటకు ఉపయోగించాల్సిందేనని కూరల అధిదేవతఅయిన శాకంబరీదేవి ఆదేశం అట. అందుకే వాటిని శుభ్రంచేయడానికి కత్తిని ఉపయోగించినా చెక్కుతీసినట్టుగా కాస్త పైపైన అటు ఇటు కదిలిస్తారు అనుభవజ్ఞులు. ప్రకృతి ప్యాకింగ్‌ను మరింత ఆకర్షణీయం చేయడానికీ కార్బైడ్లాంటివి ఉపయోగించడం అంటే... లేని లాభాలతో బ్యాలెన్స్‌షీట్లను అందంగా అలంకరించడం లాంటిదట. పండంటిబిడ్డలా ఆరోగ్యమూ పదికాలాల పాటు కళకళలాడాలంటే కార్పొరేట్ ఉత్పాదనలకూ, కార్బైడ్లకూ కాస్త దూరంగా ఉండాలన్నది పెద్దలు చెబుతున్న మాట. - యాసీన్ -
ఆన్‘లైన్లో’ దొరికిపోతున్నారు!
► మోసగాళ్లను పట్టుకోవటానికి ఈ-కామర్స్ కంపెనీల సొంత ఏర్పాట్లు ► ఫోన్లపై ట్రాకింగ్; ప్యాకింగ్ డెలివరీ ప్రక్రియ రికార్డింగ్ ► ఫ్లిప్‌కార్ట్‌కు టోపీ పెట్టిన హైదరాబాదీల పట్టివేత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; హైదరాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్ ఈ ఏడాది మొదట్లో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ కొన్నాడు. మర్నాడే డెలివరీ అయింది. కానీ తనపు ఫోన్ బదులు కాగితాలు, రబ్బరు వచ్చాయని చెప్పటంతో కంపెనీ డబ్బులు తిరిగిచ్చేసింది. కానీ ఆ ఫోన్ ఐఎంఈఐ నెంబర్‌ను ట్రాక్‌లో పెట్టింది. ఈ మధ్యే ఆ ఫోన్‌ను డెలాయిట్‌లో పనిచేసే మనీష్ శర్మ వాడుతుండగా పట్టుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మనీష్‌ను విచారించగా... తనకు నవీన్, అతుల్ అమ్మినట్లు చెప్పాడు. పోలీసులు వాళ్లిద్దరినీ పట్టుకోగా... ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేశామని అంగీకరించారు. చిత్రమేంటంటే... అతుల్ అమెజాన్ ఉద్యోగి. నవీన్ అమెజాన్ మాజీ ఉద్యోగి. ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ కొన్నాడు. డెలివరీ బాయ్ నుంచి సంతకం పెట్టి మరీ తీసుకున్నాడు. కానీ తనకు ఫోన్ రాలేదని కంపెనీకి ఫిర్యాదు చేశాడు. ఆ కంపెనీ మరో ఉత్పాదనను పంపింది. అదీ రాలేదంటూ తిరిగి ఫిర్యాదు చేశాడు. కంపెనీ మళ్లీ మరో ఉత్పాదనను పంపింది. అప్పుడు కూడా కంపెనీని మోసం చేద్దామనుకున్నాడాయన. కాకపోతే కంపెనీ తన ఏర్పాట్లు తాను చేసుకుంది. డెలివరీ తీసుకుంటున్న వీడియోను రహస్యంగా రికార్డు చేయించింది. మోసం బయటపడటంతో మీ మెయిల్ ఐడీని బ్లాక్ చేస్తున్నామంటూ మెయిల్ పంపింది. ఇదంతా జరిగింది అమెరికాలో. కంపెనీ పేరు అమెజాన్. కఠిన చర్యలు కూడా.. మోసం చేసిన కస్టమర్లపై ఈ-కామర్స్ కంపెనీలు ఏ చర్యలూ తీసుకోవటం లేదని, మెయిల్ ఐడీలను మాత్రమే బ్లాక్ చేస్తున్నాయని అనుకుంటే పొరపాటే. రూ.1.12 లక్షల కోట్ల విలువైన భారత ఈ-కామర్స్ రంగంలో కంపెనీలు ఒకడుగు ముందుకేసి కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ఇందుకు స్మార్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఆ స్థాయిలో ట్రాకింగ్ వ్యవస్థనూ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందినీ నియమించుకున్నాయి. బిగ్ డేటాను ఆధారంగా చేసుకుని మోసగాళ్లను గుర్తిస్తున్నట్టు ఒక కంపెనీ ఉన్నతాధికారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి వెల్లడించారు. తగు ఆధారాలతో మోసగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారాయన. డెలివరీ బాయ్స్‌కు కెమెరాలనూ బిగిస్తున్నట్టు మరో కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని సందర్భాల్లో కంపెనీలు భారీ డిస్కవుంట్లు ప్రకటించినపుడు దాన్ని అమ్ముతున్నవారే కొనుగోలుదార్లలా కూడా మారి భారీగా లాభపడుతున్నారు. తప్పుడు చిరునామాలతో ఆర్డర్లిస్తున్నారు. కొన్నిసార్లు నకిలీ ఉత్పత్తులను అంటగడుతున్న విక్రేతలూ బయటికొస్తున్నారు. ఈ సందర్భాల్లో... వచ్చిన ఫిర్యాదులు, రేటింగ్ ఆధారంగా విక్రేతలను బ్లాక్ లిస్టులో పెడుతునన్నామని సదరు అధికారి తెలియజేశారు. ఉద్యోగుల మోసాలు.. గతేడాదితో పోలిస్తే 2015లో ఉద్యోగుల మోసాలు 25% పెరిగాయి. ఇందులో 70% మంది ఈ-కామర్స్ కంపెనీలకు చెందిన వారేనని ఫోరెన్సిక్ రిస్క్ సొల్యూషన్స్ కంపెనీ క్రోల్ ఇండియా చెబుతోంది. ఈ-కామర్స్ రంగంలో జూనియర్, మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో అట్రిషన్ రేటు నెలకు 15-20%గా టీఎంఐ గ్రూప్ డీజీఎం బి.అపర్ణరెడ్డి తెలిపారు. తాజా ఫ్లిప్‌కార్ట్ కేసులో 11 నెలల తర్వాత మోసగాళ్లను పట్టుకున్నారంటే... కంపెనీలు ఏ స్థాయిలో ‘వేట’ సాగిస్తున్నాయో అర్థంకాక మానదు. ఆన్లైన్ విక్రయాల్లో 40% వాటా మొబైల్స్‌దే కావటంతో... మోసాలు ఎక్కువగా వీటికి సంబంధించే ఉంటున్నాయి. రిటర్న్ పాలసీని అలుసు చేసుకుని... ఉత్పాదన నచ్చకపోయినా, సమస్య తలెత్తినా నెల రోజుల్లో దానిని వెనక్కి తిరిగి ఇచ్చేయవచ్చు. ఈ మేరకు రిటర్న్ పాలసీని ఈ-కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్నాయి. దీనిని కొందరు కస్టమర్లు, విక్రేతలతోపాటు ఈ-కామర్స్ కంపెనీల ఉద్యోగులూ అలుసుగా తీసుకుంటున్నారు. ఉత్పాదనకు బదులు రాళ్లు వచ్చాయంటూ మోసం చేస్తున్నారు. ఇటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలు తమ గిడ్డంగుల్లో అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేసుకున్నాయి. కస్టమర్‌కు వెళ్లే ప్రతి ప్యాక్‌నూ స్కాన్ చేసి అందులో ఉత్పాదన ఉందని నిర్ధారించుకున్నాకే డెలివరీ చేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి చెప్పారు. ఇటువంటి సందర్భాల్లో ఉత్పాదన రాలేదని తప్పుడు ఫిర్యాదు చేస్తే ఇట్టే దొరికిపోతారని మరో కంపెనీ ప్రతినిధి తెలిపారు. -
ప్రతి ముద్దలో కల్తీ
పదేపదే పట్టుబడినా అదే తీరు పోలీసు కాలనీలోనే తయారీ నెయ్యితో పాటు మరో 10 రకాలు పట్టుబడ్డ ప్రధాన నిందితుడు కర్మాగారానికి సీలు వంటిల్లు కల్తీ అవుతోంది.. తినే ప్రతి ముద్దలోనూ అవే జాడలు కనిపిస్తున్నాయి. పప్పులో వాడే నెయ్యి.. కూరలో వాడే పసుపు, మసాలాలు, ధనియాల పొడి.. ఇలా అన్నీ కల్తీ అయితే ఇక మనిషి ఆరోగ్యానికే ముప్పు వాటిల్లే పరిస్థితి. ఒకేసారి కనిపించకపోయినా.. క్రమేణా ఆరోగ్యం క్షీణించటం ఖాయం. తాజాగా విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి, 10 రకాల ఆహార పదార్థాల దినుసుల వ్యవహారంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడ సిటీ : నెయ్యి తయారీకి డాల్డా, రంగు కోసం హానికారక రసాయన మిశ్రమాలు. కారం.. పసుపు.. మసాలా దినుసుల తయారీకి సర్వం సిద్ధం. ఆధునిక యంత్రాలతో అత్యాధునిక ప్యాకింగ్. చూసినవారు పేరొందిన కంపెనీ ఉత్పత్తులుగానే భ్రమించేందుకు నిర్దేశించిన బండిల్స్ కొద్దీ లేబుల్స్. ఇవీ పోలీసులు సోదా చేసిన కల్తీ నెయ్యి గోడౌన్లో కనిపించిన దృశ్యాలు. పట్టుబడిన ప్రధాన నిందితుడు ఆవుల ఫణిని వెంటబెట్టుకొని పటమట సీఐ కె.దామోదర్ మీడియా సమక్షంలో ఇందిరానాయక్ నగర్‌లోని కర్మాగారాన్ని తనిఖీ చేశారు. అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. కల్తీ సరకుల తయారీకి సిద్ధం చేసిన ముడి సరకుతో పాటు ప్యాకింగ్ కోసం నిర్దేశించిన లేబుల్స్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. 60కి పైగా వేర్వేరు పేర్లతో కూడిన ఉత్పత్తుల తయారీకి అక్కడ ఏర్పాట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసు కుటుంబాలు నివాసం ఉండే కాలనీలోనే గుట్టుగా సాగుతున్న కల్తీ ఉత్పత్తులు నగర వాసులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడంతస్తుల విశాల భవనంలో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేసి ఆవుల ఫణికుమార్ కల్తీ దందా నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ప్రజాప్రతినిధులు దాడి చేసి కల్తీ బాగోతాన్ని వెలికితీయడంతో పోలీసు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో కల్తీ నెయ్యి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిన రోజుల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఇదీ జరిగింది : గుంటూరుకు చెందిన ఆవుల ఫణీంద్ర కుమార్ అలియాస్ ఫణి తన బావ అనిల్ కుమార్‌తో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ప్రారంభంలో పాతబస్తీలోని ప్రియా గోల్డ్ సంస్థలో గుమాస్తాలుగా పని చేశారు. అనతి కాలంలోనే వ్యాపార మెలకువలను తెలుసుకొని నకిలీ కల్తీ నెయ్యికి శ్రీకారం చుట్టారు. నగర శివారు ప్రాంతమైన అజిత్‌సింగ్‌నగర్ ఇందిరా నాయక్ నగర్లో స్థలం కొనుగోలు చేసి కల్తీ నెయ్యి తయారీ ప్రారంభించాడు. శ్రీ దుర్గా ఫుడ్ ప్రొడక్ట్స్ పేరిట లెసైన్స్ తీసుకొని నిర్వహిస్తున్న కల్తీ వ్యాపారంపై 2012లో నున్న పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిర్వహించగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీంతో స్వస్థలమైన గుంటూరును కేంద్రంగా చేసుకొని కల్తీ మసాలా దినుసుల వ్యాపారం ప్రారంభించి మరోసారి పోలీసులకు చిక్కాడు. రెండు నెలల క్రితం పాత ప్రాంతంలోనే పట్టుబడినా, మరోసారి నెక్కలం గొల్లగూడెంలో నెయ్యి తయారుచేస్తూ ఈ నెల 13న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కటం గమనార్హం. బలమైన నెట్వర్క్ : గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పాటు ఒడిశా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరించుకున్నాడు. దాదాపు 150 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కల్తీ దందా చేస్తున్నాడు. నెలకు రూ.25 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మార్కెట్లో అసలు నెయ్యి కిలో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంది. దీనిపై మార్జిన్ కూడా పెద్దగా ఉండదు. వీరు తయారుచేసి విక్రయిస్తున్న నెయ్యి కిలో రూ.150కి మాత్రమే సరఫరా చేస్తుండటం గమనార్హం. సహకరించిన వారిపైనా కేసులు : నకిలీ నెయ్యి తయారీ చేసిన వ్యక్తులతో పాటు ఇందుకు సహకరించిన వారిపై కూడా కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 30 మంది డీలర్ల జాబితాను పోలీసులు సేకరించారు. పరారీలోని నిందితులతో పాటు వీరి అరెస్టుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. పదే పదే పట్టుబడినా కల్తీ వ్యాపారం కొనసాగిస్తున్న ఆవుల ఫణీంద్రపై రౌడీషీటు తెరిచే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. కల్తీ కాదు.. కాపీరైట్ ఉల్లంఘనే : ఫణీంద్ర తాను కల్తీ నెయ్యి, ఇతర ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న మాట అవాస్తవమని ప్రధాన నిందితుడు ఆవుల ఫణి చెబుతున్నాడు. అరెస్టు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాపీ రైట్ కోసం దరఖాస్తు చేశానని, ఇంకా అనుమతులు రాలేదని తెలిపాడు. -
చేసంచిని కవర్ చేయొద్దు..!
మా పక్కింటావిడ రోజూ పూజకు పువ్వులు కొంటుంది. నిజానికి ఆ పూలు హోమ్ డెలివరీలో ఇంటికే వస్తాయి. రోజూ పూలబ్బాయి అరుపు వినపడగానే ఆవిడ బాల్కనీ నుంచి ఆ రోజుకు కావాల్సిన పువ్వులు ఆర్డర్ ఇస్తుంది. టకటకా పూలను తూకం వేసి కవర్లో కట్టి గుమ్మం వరకు వెళ్లి అందిస్తాడు ఆ అబ్బాయి. ఇది ప్రతి రోజూ మారని రొటీన్. కొన్నేళ్లుగా సాగుతోంది. రోజూ పువ్వులొస్తాయి.. రోజూ వాటిని మోసుకొస్తూ ఓ ప్లాస్టిక్ కవరొస్తుంది. కింద నుంచి పై వరకూ వచ్చే భాగ్యానికి మళ్లీ ప్లాస్టిక్ సంచీ ఎందుకు అని ఆవిడకు తట్టదు. నాలుగణాలు ఎక్కువైనా బేరం పోవద్దని ఆ పూలబ్బి తిప్పలు. ఈ మధ్యలో నాలాంటి థర్డ్ పార్టీ ఎవరైనా కల్పించుకుంటే ఇద్దరికీ గిట్టదు. ఏడాదికి 365 కవర్లతో నేను చూసిన ఐదేళ్లలో ఆవిడ కవర్ల సంపద 1,825. ఇలాంటి ఇళ్లు మన హైదరాబాద్‌లో ఎన్ని ఉన్నాయ్, అన్ని కవర్లూ ఎక్కడికి చేరుతున్నాయ్.. ఆలోచించండి. కేవలం ఈ ఒక్క సందర్భంలోనే కాదు అనాలోచితంగా, అప్రయత్నంగా మనం కవర్ల ఉచ్చులో చిక్కుకుపోయాం. చిన్నపాటి అవసరాలకు చేతి సంచినో, బుట్టనో వాడటం అనే సంస్కృతిని మర్చిపోయాం. మానస సంచిరరే.. మార్కెట్‌కి వెళ్తూ తప్పనిసరిగా సంచి పట్టుకెళ్లే రోజుల నుంచి డబ్బులు కూడా అక్కర్లేకుండా వట్టి చేతులతో.. జేబులో కార్డుతో వెళ్తున్నాం.. కవర్లతో తిరిగొస్తున్నాం. అయితే ప్రభుత్వం 40 మైక్రాన్ల మందం పాలిథిన్ కవర్లు వాడాలని రెగ్యులేషన్ పెట్టాక, కవర్లకు దుకాణదారులు చార్జి చేయడం మొదలుపెట్టాక.. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు తిరిగి చేతి సంచి వైపు చూస్తున్నారు. ఎంత మనం సంచి పట్టుకెళ్లినా గ్రాసరీ షాపులో ఉప్పులు, పప్పులన్నీ ప్లాస్టిక్ ప్యాకింగుల్లోనే కొలువుదీరుతున్నాయి. ఎంత వద్దన్నా.. మన వెంట పాలిథిన్ వస్తూనే ఉంది. అందుకని మనవంతు కొంత తగ్గించే అవకాశం ఎందుకు వదులుకోవాలి. ప్యాకింగ్‌కు వాడే మెటీరియల్ కొంత వరకూ రీసైక్లింగ్‌కి వీలు పడుతుంది. కానీ చిన్నని, పల్చని పాలిథిన్ సంచుల్లో పది శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. అక్కడ కనుక మన వంతు బాధ్యతగా మనం వాడకం తగ్గిస్తే చాలా పెద్ద మార్పు తేవచ్చు. రీసైక్లింగ్‌కు ప్యాక్అప్ చిన్నప్పుడు కిరాణాకొట్లో పచారీలు కొంటే న్యూస్పేపర్లో పొట్లం కట్టి దారంతో చుట్టి మన బుట్టలో పెట్టేవారు. ఆ ప్యాకింగ్ అంటే ఎంత అబ్బురంగా అనిపించేదో. ఎంత ప్రయత్నించినా.. అలా ప్యాకింగ్ చేయడం కుదిరేది కాదు. ఇప్పుడు ఆ కిరాణం తగ్గింది. సూపర్ షాపింగ్ సంప్రదాయం వచ్చేసింది. అన్ని వస్తువులు కనబడేలా పారదర్శక పాలిథిన్‌లలో ప్యాకింగ్ చేస్తున్నారు. టైమ్, కన్వీనియన్స్ రెండూ కలిసొస్తాయి సరే, కానీ ఈ మధ్యలో పర్యావరణ స్పృహ తప్పిపోతోంది. పాల బాటి ళ్ల రోజులు పోయి.. ప్యాకెట్లు వచ్చిన కొత్తల్లో ఆ పాల ప్యాకెట్లను దాచి పాతపేపర్లు కొనేవారికి అమ్మి డబ్బులు తీసుకునే అలవాటు ఉండేది. దానిపై వచ్చే ఆదాయం చులకనగా అనిపించి మెల్లగా ఆ సంప్రదాయాన్నీ మానేశాం. అది డబ్బులతో కొలవలేని గొప్ప కల్చర్. మనకు రీసైక్లింగ్ గురించి తెలియని రోజుల్లోనే మన బాధ్యతను చక్కగా నిర్వర్తించాం. మన ప్లాస్టిక్‌ని, పేపర్ని, ఇనుమును, గాజును వేరు చేసి మనమే స్వయంగా స్క్రాప్‌కి పంపించే వాళ్లం. ఇప్పుడు పర్యావరణం గురించి అవగాహన ఉంది కానీ, కార్యాచరణ మాత్రం మారిపోయింది. పాల ప్యాకెట్లు పోగేసి రీసైకిల్ చేసే ఇళ్లేవి..? పోనీ అమ్ముకోకపోయినా.. కనీసం మన వంతు బాధ్యతగా రీసైకిల్ చేద్దాం అన్న కల్చర్ మనం నేర్చుకోవాలి. బ్యాగుబాగు.. ప్రతి దానికీ ప్యాకింగ్ అలవాటు చేసుకున్నాం. ఒకప్పుడు బిగ్షాపర్ బ్యాగులైనా ఉండేవి. ఇప్పుడు అవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయట. పోనీ మారిన ఫ్యాషన్‌కు తగ్గట్టు కొత్త సంచులను డిజైన్ చేసుకోవచ్చుగా..! అసలు ఆలోచన అటు వెళ్తేగా, వాటి అవసరం గుర్తిస్తేనే కదా కొత్త డిజైన్లు వచ్చేవి. కొత్త వింత కావొచ్చు.. కొన్ని పాత పద్ధతులను కొత్తగా నేర్చుకుందాం. బజారుకు వెళ్లినప్పుడు చేతి సంచితోనే వెళ్దాం. మనవల్ల తయారైన చెత్తకు రీసైకిల్ దారి చూపిద్దాం. ఐ లవ్ హైదరాబాద్. -
మాయదారి మందులు!
పేరు, రంగు, రుచి, వాసన, ప్యాకింగ్... ఇవన్నీ చూడడానికి అచ్చం ఔషధాలుగానే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా వైద్యులు.. ఈ బాటిళ్లలో ద్రవపదార్థం తాగాలంటూ, ఈ గోలీలు మింగాలంటూ రోగులకు ప్రిస్కిప్షన్స్ రాస్తుంటారు. 200 రకాలుగా ఉన్న ఈ బాటిళ్లు, బిళ్లలు మెడికల్ షాపుల్లో తప్ప... ఎక్కడా దొరకవు. ప్రమాణాల ప్రకారం ఇవి ఔషధాలు కావు... కేవలం ఆహార పదార్థాలు. విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నా.. ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా నాణ్యత లేని పదార్థాలను మెడికల్ షాపుల నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఒక్కసారి రోగం వస్తే వైద్య సేవల కింద సామాన్యుల జీవితాలు అతలాకుతలం అవుతుండడంతో ఔషధాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ చట్టం కింద 384 మందులు ఉన్నాయి. ఈ మందులన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు సాగించాలి. దీంతో ఈ చట్టం పరిధి నుంచి తప్పించుకునేందుకు పలువురు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్-2006 చట్టం పరిధిలో లెసైన్సులు తెచ్చుకుంటున్నారు. ఈ ముసుగులో బలవర్థక ఆహారం పేరుతో కొన్ని ఔషధ కంపెనీలు మందులు తయారు చేస్తూ ఇష్టారీతిగా ధరలు నిర్ణయిస్తూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాయి. ఒంటికి బలాన్ని చేకూర్చే ఆహారం అనే పేరుతో సిరప్, టానిక్, ట్యాబెట్ల అమ్మకాలను యథేచ్చగా సాగిస్తున్నాయి. ఇలా తయారైన సిరప్లు, మల్టీ విటమిన్లు మార్కెట్లో మెడికల్ షాపుల్లో జోరుగా అమ్ముడవుతున్నాయి. కానీ.. ఔషధ ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు, ధరల నియంత్రణను పట్టించుకోవడం లేదు. మామూళ్లు అందుతుండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఔషధాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒక్కరికీ అనుమతి లేదు... నిబంధనల ప్రకారం ఫుడ్ సెఫ్టీ చట్టం లెసైన్స్‌తో తయారైన మందులు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే తప్పని సరిగా ఫుడ్ లెసైన్స్ తీసుకోవాలి. ఈ మేరకు 2013లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో భాగంగారిజిస్ట్రేషన్కు రూ.100, లెసైన్స్‌కు రూ. 2 వేలుగా నిర్ధారించింది. మన జిల్లాలో 2,100 మెడికల్ షాపులు ఉన్నాయి. ఆస్పత్రులకు అనుబంధంగా మరో 500పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క షాప్‌కూ ఆహార పదార్థాలు అమ్మే అనుమతి లేదు. అయినప్పటికీ ఈ ఉత్పత్తుల అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఫుడ్ సెఫ్టీ లెసైన్స్‌తో ఈ పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటి నాణ్యత, ప్రమణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఫుడ్ ఇన్స్పెక్టర్లది. జిల్లాలో ఒక్కసారి కూడా ఇలాంటి ఉత్పత్తులను వారు పట్టించుకున్న పరిస్థితి లేదు. అటాచ్డ్ షాపుల్లో అధికం... ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం అజామాయిషీ ఉండడంతో వీటి ధరలు నిర్ధారించిన మేరకు ఉంటున్నాయి. దీంతో డాక్టర్లు, మెడికల్ షాపు యజమానులకు కమీషన్లు తక్కువగా వస్తున్నాయి. ఆహార పదార్థాల పేరుతో అమ్ముడయ్యే ఔషధాల ధరల నియంత్రణ లేదు. ఇదే అదునుగా ఫుడ్ లెసైన్స్‌తో అమ్మకాలు సాగిస్తున్న ఔషధాల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. అధిక ధరలు నిర్ణయిస్తున్నారు. వచ్చే లాభా ల్లో డాక్టర్లకు ఎక్కువ శాతం వాటాలు ఇస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ షాపు లు కేంద్రంగా ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతోం ది. ఇక్కడికి వచ్చే రోగులు అదే ఆస్పత్రిలో మందు లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో రోగులకు ఈ ఉత్పత్తులను ఎక్కువగా అంటగడుతున్నారు. -
బియ్యం అక్రమ నిల్వలపై దాడులు
245 బస్తాల బియ్యం ప్రభుత్వ గోదాముకు తరలింపు బండకిందపల్లెలో ఘటన సోమల: మండలంలోని బండకిందపల్లెలో బుధవారం తహశీల్దార్ నరసింహులు, ఎస్ఐ చిన్న రెడ్డెప్పలు అక్రమ బియ్యం వ్యాపారంపై దాడులు చేశారు. బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 245 బస్తాల బియ్యాన్ని సదుం వద్ద ఉన్న ప్రభుత్వ గోదాముకు తరలించారు. బండకిందపల్లె వద్ద ఉన్న ఓ రైతు ఇంటిలో అక్రమ బియ్యం నిల్వలు ఉన్నాయని ఎస్ఐ చిన్నరెడ్డెప్పకు రహస్య సమాచారం అందింది. దీంతో ఆయన సిబ్బంది తో కలసి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 245 బస్తాల బి య్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులను విచారించగా రాయచోటికి చెందిన ఓవ్యక్తి కొంతకాలంగా అక్రమబియ్యం వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అతనికి చెందిన 50 కేజీల బరువున్న బస్తాల నుంచి బియ్యం వేరుచేసి, వాటికి ఆయిల్ కలిపి 21, 22 కేజీల బరువుతో ప్యాకింగ్ చేస్తున్నట్టు తెలిపారు. బియ్యం నిల్వలకు సంబంధించిన రికార్డులను చూపమని ఎస్ఐ కోరగా వారు ఎలాంటి రిక్డాలు లేవని సమాధానం చెప్పారు. దీంతో తహశీల్దార్ నరసింహులుకు ఎస్ఐ సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి ఆర్ఐ మహేశ్వరితో కలసి ఆయన చేరుకున్నారు. పంచనామా నిర్వహించి 50 కేజీల బరువున్న 70 బస్తా లు, 22 కేజీల బరువున్న 49 బస్తాలు, 21 కేజీల బరువుగల 126 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ అక్రమ బియ్యం వ్యాపారం మూడు నెలలుగా జరుగుతోందని, నిత్యం కల్లూరుకు టెంపోల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీనిపై తహశీల్దార్‌ను వివరణ కోరగా 245 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ గోదాముకు తరలించామని తెలిపారు. విషయం ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ ప్రభావతమ్మ, వీఆర్ఏ పురుషోత్తం పాల్గొన్నారు. -
మోసాల ప్యా‘కింగ్’లు
ఆయిల్ కంపెనీల దగా తూకంలో చేతివాటం దోపిడీకి గురవుతున్న వినియోగదారులు మొక్కుబడి తనిఖీలతో సరి రోజు రోజుకీ పెరుగుతున్న నూనె ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంటే ప్యాకింగుల్లో దగా చేస్తూ ఆయిల్ కంపెనీలు నిట్ట నిలువునా దోచుకుంటున్నాయి. లీటరు ప్యాకెట్‌కు 80 నుంచి 120 గ్రాములు తక్కువగా ఉంటోంది. ఇలా ఆయిల్ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నా... సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తుండడంతో ఈ దోపిడీకి అంతులేకుండా పోతోంది. సాక్షి, సిటీబ్యూరో: వంట నూనె తూకం తప్పుతోంది. ప్యాకింగ్‌తో పాటు లూజ్ ఆయిల్ తూకంలో సైతం ఆయిల్ కంపెనీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రెండు చేతులా సొమ్ము చేసుకుంటూ వినియోగదారులను దోచుకుంటున్నాయి. ఆయిల్ కంపెనీలు వివిధ బ్రాండ్ల పేరుతో లీటర్, ఐదు, పది, పదిహేను లీటర్ల నూనె ప్యాకెట్లు, డబ్బాలను విక్రయిస్తున్నాయి. ప్యాకింగ్‌లో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉంటోంది. లూజ్ ఆయిల్ కొనుగోళ్లలో సైతం కంపెనీలు చేటివాటం ప్రదర్శిస్తూ తూనికలు కొలతల శాఖకు అడ్డంగా దొరికిపోతున్నా అక్రమార్కులపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఫలితంగా తూకంలో మోసం.. దగా యథేచ్ఛగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లో ఉన్న రీఫైండ్ ఆయిల్ కంపెనీలు వినియోగదారులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినపిస్తున్నాయి. సగటు వినియోగదారులతో పాటు లూస్ ఆయిల్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు సైతం నిలుపు దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయం తెలిసినా సంబంధిత అధికారులు మొక్కుబడి తనిఖీలకే పరిమితం కావడం విస్మయానికి గురిచేస్తోంది. వినియోగదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఒత్తిడి తేస్తే తప్ప అధికారులు స్పందించిన దాఖలాలు కానరావడం లేదు. అయినా నామమాత్రపు తనిఖీలతోనే సరిపుచ్చుకుంటున్నారు. మొక్కుబడి కేసులతో అధికారులు చేతులు దులుపుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది. మోసం ఇలా... మహానగర శివార్లలో సుమారు 25 వరకు ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు నగరానికి చెందిన సుమారు 120 మంది ఆయిల్ కాంట్రాక్టర్ల నుంచి నిత్యం సుమారు 300 ట్యాంకర్ల వరకు లూజ్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తాయి. వాటిని రీఫైండ్ చేసి ఆకర్షణీయ ప్యాకింగ్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రతి నెల నగరంలో సుమారు 86 లక్షల లీటర్లకు పైగానే వంటనూనె అమ్ముడుపోతుంది. ప్రతి ప్యాకింగ్‌లో కనీసం 90 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు తక్కువగా తూకం ఉండడం నిత్యకృత్యంగా మారింది. సగటున 100 గ్రాముల చొప్పున తక్కువ తూకంలెక్కిస్తే నెలకు 8.60 లక్షల లీటర్లు దోపిడీకి గురవుతున్నట్లు అంచనా. దాని విలువను ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరను బట్టి లెక్కిస్తే నెలకు రూ. 68.80 లక్షలు, ఏడాదికి రూ. 8.25 కోట్లమేర మోసం జరుగుతోంది. లూజ్ ఆయిల్లో.... ఆయిల్ కంపెనీల చేతివాటంతో లూజ్ ఆయిల్ కాంట్రాక్టర్లు సైతం నిలువునా దోపిడీకి గురవుతున్నారు. ఒక్కొక్క కంపెనీ రోజూ 10 నుంచి 20 ట్యాంకర్ల లోడ్ వరకు లూజ్ వంట నూనెను కొనుగోలు చేస్తుంటాయి. ఒక్కొక్క ట్యాంకర్లో సుమారు 16 వేల కిలో (16 టన్నులు)ల వంటనూనె లోడ్ అవుతుంది. కంపెనీకి ఆయిల్ లోడ్ రాగానే వేబ్రిడ్జిపై ట్యాంకర్‌ను తూకం వేసి అందులో 50 కిలోల తక్కువ తూకాన్ని మార్జిన్‌గా పరిగణించి మిగితా బరువును బట్టి లెక్క కట్టి కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లిస్తాయి. ట్యాంకర్లలో ఆయిల్ నింపుకొని ఎలాంటి లీకేజీ లేకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నప్పటికీ వేబ్రిడ్జిల వద్ద తూకం వేస్తే 100 కిలోలు తక్కువ రావడం నిత్యకృత్యమైంది. అందులో 50 కిలోలు తూకం మార్జిన్ కిందకు తీసేసినా మిగితా 50 కిలోల ధరను కాంట్రాక్టర్లు నష్టంగా భరించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఆయిల్ ట్యాంకర్ల కాంట్రాక్టర్లు తూనికలు కొలతల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. -
కంపెనీ సంచులు.. నకిలీ విత్తులు
సాక్షి, కర్నూలు: నకిలీ పత్తి విత్తనాలకు జిల్లా అడ్డాగా మారుతోంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిఘా పెరగడంతో అక్రమార్కులు మూడు రాష్ట్రాల సరిహద్దు కేంద్రమైన కర్నూలుకు మకాం మార్చారు. అసలుకు ఏమాత్రం తీసిపోని ప్యాకింగ్‌తో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కై తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ప్రకాశం, విజయనగరం జిల్లాలకు పార్శిల్ సర్వీసుల్లో పెద్ద ఎత్తున విత్తన రవాణా జరుగుతోంది. గత నెలలో అధికారులు గుంటూరులో పత్తి విత్తనాల ఖాళీ సంచులు, ప్యాకింగ్ సామగ్రి, వివిధ కంపెనీల పేర్లతో కూడిన లేబుళ్లను స్వాధీనం చేసుకోవడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు 3,49,469 హెక్టార్లలో పంటు సాగయ్యాయి. ఇందులో పత్తి సాధారణ సాగు 1,08,983 హెక్టార్లు కావడంతో అక్రమార్కులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతూ వారి ఆశలతో చెలగాటం ఆడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల నుంచి ఆయిల్ తయారీ పేరిట పత్తి విత్తనాలను నకిలీ విత్తన తయారీ ముఠా సేకరిస్తోంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో గుంటూరు, కర్నూలుకు తరలిస్తున్నారు. వ్యవసాయాధికారుల కన్నుగప్పేందుకు మహిళల ద్వారా రవాణా చేయిస్తుండటం గమనార్హం. ఈ విత్తనాలను గుంటూరు, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో గ్రేడింగ్ అనంతరం రంగులు వేసి మార్కెట్లో విక్రయానికి ఉంచుతున్నారు. పముఖ విత్తన కంపెనీలన్నీ గుంటూరు కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తుండటంతో అసలును పోలిన సంచులు, లేబుళ్లతో బురిడీ కొట్టిస్తున్నారు. గుంటూరులో తయారైన ఖాళీ విత్తన సంచులు, సామగ్రి పార్శిల్లో కర్నూలుకు తరలిస్తుండగా.. వీటిలో నకిలీ విత్తనాలు నింపి వ్యాపారం చేస్తున్నారు. కంపెనీ విత్తనాలు తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు ఆకర్శితులై మోసపోతున్నారు. ఇప్పటికైనా జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి నకిలీల పనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నకిలీల నియంత్రణకు చర్యలు నకిలీ బీటీ పత్తి విత్తనాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఈ ఏడాది విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. 10 పైగా కేసులు నమోదయ్యాయి. కర్నూలు నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పత్తి విత్తనాలు రవాణా అవుతున్నందున ప్రత్యేక నిఘా ఉంచాం. ట్రాన్స్‌పోర్టు కంపెనీలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నాం. - జేడీఏ ఠాగూర్‌నాయక్ -
రైతులతో చెలగాటం
ఏడాదిగా నకిలీ విత్తనాల తయారీ రైతుల నుంచి కొన్న విత్తనాలకే రంగుపూసి తిరిగి విక్రయం నకిలీ పత్తి విత్తనాలతో భారీ స్థాయిలో రైతులకు నష్టం బి.కొత్తకోటలో అనుమానంరాని చోట అద్దె ఇల్లు రెండు కేసుల నమోదు బి.కొత్తకోట: నకిలీ విత్తనాలు తయారుచేస్తూ రైతుల జీవితాల్లో చెలగాటమాడాడు. ఏడాదికాలంగా గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రం లోని ఐదు జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తివిత్తనాలను విక్రయించాడు.. కర్ణాటకకు చెందిన ఓ కంపెనీ పేరుతో విక్రయాలు చేస్తూ పత్తిరైతులను నట్టేట ముంచాడు. ఎవరికీ అనుమానం రాకుండా బి.కొత్తకోటలో మకాం వేసి విత్తనాల తయారు చేస్తున్నాడు ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఎస్.లక్ష్మణాచారి. సోమవారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో నకిలీ విత్తనాల వ్యవహారం వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా మండల కేంద్రం వైరాకు చెందిన ఎస్.లక్ష్మణాచారి(30) గతంలో ఆదర్శ సీడ్స్‌లో పనిచేస్తుండేవాడు. కంపెనీ నుంచి ఇతన్ని తొలగించడంతో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. పడమటి ప్రాంతమైన బి.కొత్తకోటను కేంద్రంగా చేసుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించి, స్థానిక శెట్టిపల్లె రోడ్డులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలోని ఓ పూలవ్యాపారికి చెందిన భవనంలో గదిని అద్దెకు తీసుకొన్నాడు. ఇందులో ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం బయటకు పొక్కదు. దీంతో ఇంతకాలం ఈ నకిలీ వ్యవహారం గుర్తించే వీలులేకుండా పోయిందని భావిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాల తయారీ కోసం మొదట పలు ప్రాంతాల్లో రైతులు పండించిన పత్తి విత్తనాలను కొనుగోలు చేసి నిల్వ ఉంచుతాడు. ఈ విత్తనాలకు రంగుపూసి కర్ణాటకలోని గల్బర్గాకు చెందిన అజిత్ పత్తివిత్తనాల కంపెనీపేరుతో ప్యాకెట్లు, లోగోను బెంగళూరులో తయారుచేయిస్తాడు. ఈ విషయం దాడులు చేసిన విజిలెన్స అధికారులు పేర్కొన్నారు. వీటిలో అరకిలో నకిలీ పత్తి విత్తనాలను నింపి రూ.930 చొప్పున విక్రయిస్తున్నట్టు వారు గుర్తించారు. అజిత్ పత్తి విత్తనాల కంపెనీ పేరు, అదే రకమైన ప్యాకింగ్ ఉండడంతో రైతులు నకిలీ విత్తనాలు గుర్తించే వీలులేకుండా పోతోంది. వీటిని కొనుగోలుచేసి పంటసాగుచేసిన పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు వీటిని సరఫరా చేసివుంటారని అనుమానిస్తున్నారు. తెలంగాణ జిల్లాలు, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో లక్ష్మణాచారికి పరిచయాలున్న వారితో రైతులకు విక్రయాలు చేసివుంటారని చెబుతున్నారు. గతంలో పనిచేసిన కంపెనీలోని ఉద్యోగులతో పరిచయాలుంటాయని వారి సహకారం తీసుకొని ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. గదిలో 291 అరకేజీల ప్యాకెట్లు, మరో 291 చిన్నప్యాకెట్లను సాధ్వీనం చేసుకొన్నారు. అలాగే 336 కిలోల పత్తి విత్తనాలు, రంగు సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందని విజిలెన్స్ సీఐలు సూర్యనారాయణ, శ్యామ్‌సుందర్ చెప్పారు. ఈ వ్యవహారంపై బి.కొత్తకోట వ్యవసాయాధికారి జీఎన్.నాగప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. లక్ష్మణాచారిపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. ఇతనిపై రెండు కేసులు నమోదవుతాయని విజిలెన్స్ సీఐ యూ.సూర్యనారాయణ చెప్పారు. -
‘మేటి’ కొప్పాక చక్కెర
రూ.73.55 లక్షలతో సెంట్రీ ఫ్యూగల్ ఏర్పాటు 50 నిమిషాల్లో 1750 కిలోల పంచదార ఉత్పత్తి ప్యాకింగ్‌లోనూ ఆధునిక పరిజ్ఞానం నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం ఏటికొప్పాక చక్కెర కర్మాగారం ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న నాణ్యమైన పంచదార ఉత్పత్తికి అవసరమైన మెషినరీని అంచెలంచెలుగా యాజమాన్యం సమకూరుస్తోంది. ప్యాకింగ్‌లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటుచేశారు. పంచదార దిగుబడిలో నాణ్యత పెంచడంతోపాటు ప్యాకింగ్ వేగవంతానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటుచేశారు. యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: ఏటికొప్పాక ఫ్యాక్టరీలో ఇప్పటివరకు మూడు రకాల పంచదార ఉత్పత్తి అయ్యేది. పాత యంత్రాలతో తయారీతో ఇందులో 20 శాతమే నాణ్యమైనది. మిగిలిన రెండు రకాల్లో నాణ్యత కొరవడి ఫ్యాక్టరీ ఆదాయంపై ప్రభావం కనబడేది. యాజమాన్యం ఆర్థికంగా ఒడిదుకులకు గురయ్యేది. ఇలా మూడు రకాల పంచదార ఉత్పత్తితో ఆదాయం తగ్గడమే కాకుండా పెద్ద సంఖ్యలో కార్మికులు అవసరమయ్యేవారు. ఇప్పుడు రూ.73.55 లక్షలతో సెంట్రీఫ్యూగల్ అనే యంత్రాన్ని కర్మాగారంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా 50 నిమిషాల్లో 1750 కిలోల నాణ్యమైన ఒకేరకం పంచదార ఉత్పత్తి అవుతోంది. అధిక శాతం నాణ్యత ఉన్న (క్రిస్టల్)ఉండడంతో ఫ్యాక్టరీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. సెంట్రీఫ్లీగల్తో ఎటువంటి వృథా లేకుండా ఉత్పత్తి జరుగుతోంది. వృథాకాకుండా క్రమపద్ధతిలో ఉండేందుకు రూ.50 లక్షలతో బిన్ అనే మరో పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంచదారను గోనె సంచిలో పట్టడం దగ్గర నుంచి బస్తాలను కుట్టడం వరకు అత్యంగా వేగంగా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరికరం ఏర్పాటుతో 15 మంది కార్మికులకు బదులు ఒకరిద్దరు సరిపోతున్నారు. ఇది గంటకు 207 బస్తాల పంచదారను నిల్వ చేస్తోంది. ప్యాకింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.