పెట్టుబడులకు పలువురు నటులు
జాబితాలో ఆమీర్ ఖాన్, కరణ్
న్యూఢిల్లీ: పర్యావరణహిత(సస్టెయినబుల్) డిస్పోజబుల్ ప్యాకింగ్ సంస్థ జోలోప్యాక్ ఇండియాలో పెట్టుబడులకు పలువురు బాలీవుడ్ అగ్రహీరోలు ఆసక్తి చూపుతున్నారు. సెలబ్రిటీ నటులు ఆమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ పబ్లిక్ ఇష్యూకంటే ముందుగా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా రోజీ బ్లూ ఇండియా యజమాని రసెల్ మెహతా, ఆకాశ్ అంబానీ మామ సైతం కంపెనీలో మైనారిటీ వాటాలను సొంతం చేసుకున్నారు.
అయితే ఎవరెంత ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడికాలేదు. సంస్థ ప్రీఐపీవో రౌండ్‌లో వాటాలు కొనుగోలు చేసిన జాబితాలో రివర్‌స్టోన్ క్యాపిటల్‌కు చెందిన దేవనాథన్ గోవిందరాజన్, మినర్వా వెంచర్స్ ఫండ్, నెక్ట్సా ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, ఎన్‌వీఎస్ కార్పొరేట్ కన్సల్టెన్సీ సరీ్వసెస్, ఓపస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, సరోద్ రియలీ్ట, ఫిరోజ్ ఫామ్స్ అండ్ హోల్డింగ్స్, వినే ఈక్విటీ మార్కెట్ ఎల్‌ఎల్‌పీ చేరాయి.
కంపెనీ వివరాలివీ..
పుణేకు చెందిన జోలోప్యాక్ ఇండియా ఆర్గానిక్ డిస్పోజబుల్ చాకులు(కట్లెరీ), ఐస్‌క్రీమ్ స్టిక్స్, స్పూన్లు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. కంపెనీ ఇప్పటికే పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 52.86 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. గతేడాది(2023–24) కంపెనీ ఆదాయం రూ. 12 కోట్ల నుంచి రెండున్నర రెట్లు జంప్‌చేసి రూ. 31.5 కోట్లకు చేరింది. నికర లాభం సైతం రూ. 3.5 కోట్ల నుంచి రూ. 6.4 కోట్లకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment