disposable plastic
-
జోలోప్యాక్వైపు బాలీవుడ్ చూపు
న్యూఢిల్లీ: పర్యావరణహిత(సస్టెయినబుల్) డిస్పోజబుల్ ప్యాకింగ్ సంస్థ జోలోప్యాక్ ఇండియాలో పెట్టుబడులకు పలువురు బాలీవుడ్ అగ్రహీరోలు ఆసక్తి చూపుతున్నారు. సెలబ్రిటీ నటులు ఆమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ పబ్లిక్ ఇష్యూకంటే ముందుగా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా రోజీ బ్లూ ఇండియా యజమాని రసెల్ మెహతా, ఆకాశ్ అంబానీ మామ సైతం కంపెనీలో మైనారిటీ వాటాలను సొంతం చేసుకున్నారు. అయితే ఎవరెంత ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడికాలేదు. సంస్థ ప్రీఐపీవో రౌండ్లో వాటాలు కొనుగోలు చేసిన జాబితాలో రివర్స్టోన్ క్యాపిటల్‌కు చెందిన దేవనాథన్ గోవిందరాజన్, మినర్వా వెంచర్స్ ఫండ్, నెక్ట్సా ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, ఎన్వీఎస్ కార్పొరేట్ కన్సల్టెన్సీ సరీ్వసెస్, ఓపస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సరోద్ రియలీ్ట, ఫిరోజ్ ఫామ్స్ అండ్ హోల్డింగ్స్, వినే ఈక్విటీ మార్కెట్ ఎల్ఎల్పీ చేరాయి. కంపెనీ వివరాలివీ.. పుణేకు చెందిన జోలోప్యాక్ ఇండియా ఆర్గానిక్ డిస్పోజబుల్ చాకులు(కట్లెరీ), ఐస్‌క్రీమ్ స్టిక్స్, స్పూన్లు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. కంపెనీ ఇప్పటికే పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 52.86 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. గతేడాది(2023–24) కంపెనీ ఆదాయం రూ. 12 కోట్ల నుంచి రెండున్నర రెట్లు జంప్‌చేసి రూ. 31.5 కోట్లకు చేరింది. నికర లాభం సైతం రూ. 3.5 కోట్ల నుంచి రూ. 6.4 కోట్లకు ఎగసింది. -
రైల్వే ప్రయాణికుల కోసం, కేంద్రం కీలక నిర్ణయం
రైల్వే ప్రయాణికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం డిస్పోజబుల్ బెడ్ షీట్లను అందించనుంది. వీటితో పాటు టూత్ పేస్ట్, మాస్క్, బెడ్ షీట్లను అందిస్తుంది. అయితే ఈ సదుపాయం రైల్వే శాఖ ఎంపిక చేసిన ట్రైన్లలో మాత్రమే ఉండనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మూడు రకాల డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్లు రైలులో మూడు రకాల డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్లు అందుబాటులో ఉంటాయి. ఒక కిట్‌లో నాన్ ఓవెన్ పిల్లో (నేసిన దిండు) దాని కవర్,డిస్పోజబుల్ బ్యాగ్, టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ , పెప్పర్ సోప్, టిష్యూ పేపర్లు ఉంటాయి. ఈ కిట్ ధర రూ. 300గా ఉంది. ఒక ప్రయాణికుడు ఒక దుప్పటిని మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటే రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. కాగా కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన రైళ్లలో సంబంధిత శాఖకు చెందిన కార్మికులు రైళ్లలో అమ్ముతారని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్లు ఇవే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్లు ఈ డిస్పోజబుల్ బెడ్ షీట్లు సుదూర ప్రాంతాలకు జర్నీ చేసే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ముంబై - ఢిల్లీలో రాజదాని ఎక్స్ ప్రెస్, ముంబై - ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్, గోల్డెన్ టెంపుల్ మెయిల్, పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ లలో అందుబాటులో ఉంది. బెడ్ షీట్లను సౌకర్యం కల్పించినందుకు గాను కేంద్రం ప్రయాణికుల నుంచి అదనంగా రూ.150వసూలు చేయనుంది. జోన్లను బట్టి ధరలు మారతాయ్ డిస్పోజబుల్ బెడ్ షీట్ కిట్ల ధరలు జోన్లను బట్టి మారవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కిట్‌లో టూత్‌పేస్ట్, శానిటైజర్లు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దుప్పట్లు, దిండ్లు, షీట్లు మాత్రమే అందిస్తున్నారు. చదవండి: ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు -
జనవరి 1నుంచి ప్లాస్టిక్ కప్పుల నిషేధం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఎన్సీఆర్ పరిధిలో డిస్పోజబుల్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా పచారీ సరుకుల్లో వినియోగించే ప్లాస్టిక్, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకాన్ని బ్యాన్ చేసింది. ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. వ్యర్థాల తగ్గింపు, వ్యర్థాల వినియోగం కోసం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎన్సీటీ సహా ఇతర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీలో ఆందోళనకరంగా మారుతున్న వాయుకాలుష్యం, కప్పివేస్తున్న పొగమంచు పరిస్థితులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిపట్ల ఇటీవల ఎన్ జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.