న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఎన్సీఆర్ పరిధిలో డిస్పోజబుల్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా పచారీ సరుకుల్లో వినియోగించే ప్లాస్టిక్, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకాన్ని బ్యాన్ చేసింది. ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. వ్యర్థాల తగ్గింపు, వ్యర్థాల వినియోగం కోసం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎన్సీటీ సహా ఇతర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఢిల్లీలో ఆందోళనకరంగా మారుతున్న వాయుకాలుష్యం, కప్పివేస్తున్న పొగమంచు పరిస్థితులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిపట్ల ఇటీవల ఎన్ జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
జనవరి 1నుంచి ప్లాస్టిక్ కప్పుల నిషేధం
Published Sat, Dec 3 2016 10:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
Advertisement
Advertisement