న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాలు పర్వత ప్రాంతాలు మొదలుకొని నుండి మైదాన ప్రాంతాల్లో ఉండేవారి వరకూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు మూసుకుపోయాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎడతెగని వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఈ రోజు కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా 10 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ అధ్వాన్నంగా మారడంతో ఎక్కడైనా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.
వర్షం కారణంగా ఘజియాబాద్‌లోనిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇంటి పైకప్పు కూలిపోయింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు అందులోనే సమాధి అయ్యారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సాధారణంగా పగటిపూట మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం కురియనుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 117 రహదారులపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. శనివారం సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఓ మోస్తరు వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment