ఉత్తర భారత్‌ను వణించిన భూకంపం.. | Earthquake Tremors In Delhi NCR Areas With Magnitude Of 6.1 - Sakshi
Sakshi News home page

Earthquake In Delhi: ఉత్తర భారత్‌ను వణించిన భూకంపం.. ఢిల్లీ, పంజాబ్‌తో సహా..

Published Thu, Jan 11 2024 3:07 PM | Last Updated on Thu, Jan 11 2024 4:09 PM

Earthquake tremors in Delhi NCR areas - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తర భారతం భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్‌ రీజియన్‌, పంజాబ్‌, ఘజియాబాద్‌ జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో గుర్తించింది పరిశోధన కేంద్రం. భూకంపం తీవ్రతకు జమ్మూకశ్మీర్ పూంచ్‌ సెక్టార్‌లో  కొండచరియలు విరిగిపడ్డాయి.  భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఎవరికి ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement