ఈ రోజుల్లో పిండి, నూక దగ్గర నుంచి నట్స్, స్నాక్స్ వరకు అన్నీ ప్యాకెట్స్‌లోనే దొరుకుతున్నాయి. ఒకసారి కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత.. మరోసారి వాడేలోపు పాడవకుండా, పురుగు పట్టకుండా.. మెత్తబడకుండా ఈ సీలర్‌ను ఇంట్లో పెట్టుకోవాల్సిందే. ఇది చార్జింగ్‌తో నడుస్తుంది. అల్యూమినియం ఫాయిల్ హీట్ సీలింగ్ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ స్నాక్ బ్యాగ్‌లు, వాక్యూమ్ ఫుడ్ స్టోరేజ్ బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ బ్యాగ్‌లు ఇలా చాలా వాటికి ఇది చక్కగా పనిచేస్తుంది.
ఇందులో మినీ చాకు కూడా ఉంటుంది. దాని సాయంతో కవర్‌ని కట్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెటిక్‌తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్ బెల్ట్ కూడా ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు. ధర కూడా తక్కువే. ఈ సీలర్ ధర12 డాలర్లు (రూ.997) .
Comments
Please login to add a commentAdd a comment