
మీ టైమ్ వస్తుంది: ఐఎస్ హెచ్చరిక
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సౌదీ అరేబియాకు హెచ్చరికలు జారీ చేశారు. సౌదీపై దాడులకు పాల్పడుతామంటూ వీడియో సందేశంలో తెలిపారు. ఇరాన్ పార్లమెంట్‌పై బుధవారం జరిగిన దాడి తమపనే అని వెల్లడించిన ఇస్లామిక్ స్టేట్.. 'మీపై దాడికి సమయం వస్తుంది' అంటూ సౌదీని హెచ్చిరించింది.
టెహ్రాన్‌లోని ఇరాన్ పార్లమెంట్‌పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇరాన్ తరువాత టార్గెట్ సౌదీనే అని, అల్లా ఆదేశం మేరకు ఇస్లాం కోసం తాము పోరాడుతున్నామని మాస్క్‌లు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఉన్న వీడియోలో పేర్కొన్నట్లు సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ హెచ్చరికల నేపథ్యంలో విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సౌదీలోని యూఎస్ ఎంబసీ తమ పౌరులకు సూచించింది. ఉగ్రవాదానికి సహకరిస్తోందనే కారణంతో ఖతార్‌పై పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.