![New Way For Sea Water Desalination to Drinking Water - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/17/solar.jpg.webp?itok=UaoAnZA0)
సముద్రపు నీటిని పూర్తిస్థాయిలో మంచినీటిగా మార్చగలిగితే భూమ్మీద నీటి కొరతన్నది అస్సలు ఉండదు. అయితే వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయి నిర్లవణీకరణ అన్నది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వినూత్న పరికరం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వాడుకుంటూ ఈ పరికరం సముద్రపు నీటిలోని లవణాలను తొలగించడం.. తద్వారా మంచినీటిని తయారు చేయడం విశేషం. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఎంత ఉత్పత్తి అవుతుందో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ వేడి కూడా పుడుతూంటుంది. ఈ వేడి కారణంగా కాలక్రమంలో సోలార్ ప్యానెల్స్ విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతూంటుంది కూడా. సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు సోలార్ ప్యానెల్స్ అడుగుభాగంలో పలు పొరలు ఏర్పాటు చేసి ఉపయోగించారు. గొట్టాలతో కూడిన ఈ పొరల గుండా ఉప్పునీరు ప్రయాణించినప్పుడు సోలార్ ప్యానెల్స్ తాలూకూ వేడి కారణంగా వేడిగా మారతాయి. ఇలా పుట్టిన ఆవిరి పలుచటి త్వచం ద్వారా ఇంకో పొరలోకి చేరుతుంది. అక్కడ ఘనీభవించి మంచినీరుగా మారుతుంది. ఈ ఏర్పాటు కారణంగా సోలార్ ప్యానెల్స్ చల్లగా ఉంటూ విద్యుదుత్పత్తిలో నష్టం జరగదని.. అదే సమయంలో ప్యానెల్స్‌ను శుభ్రం చేసుకునేందుకు లేదా పంటలు పండించుకునేందుకు అవసరమైన మంచినీరు అందుబాటులోకి వస్తుందని సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment