Sea water
-
బోటులోనే మంచినీటి తయారీ
పిఠాపురం: విద్యుత్ అవసరం లేకుండా సౌరశక్తిని ఒడిసిపట్టి తక్కువ ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే సోలార్ డిస్టిలేషన్ పరికరాన్ని ఓ యువతి రూపొందించారు. రోజుల తరబడి సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులు మంచినీటి కోసం పడే ఇబ్బందులను తొలగించేందుకు దీనిని ఆవిష్కరించినట్టు వైఎస్ ప్రసన్న చెప్పారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రసన్న పీహెచ్డీ పరిశోధనలో భాగంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. దీంతో ఎలాంటి మురికి నీటినైనా మంచినీటిగా మార్చుకోవచ్చని చెప్పారు. పరిశోధనలో భాగంగా తాను తయారు చేసిన యంత్రాన్ని ఇటీవల కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రంలో ప్రయోగాత్మకంగా బోటులో అమర్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంట్లో కూడా నీటిశుద్ధి పరికరాలను అమర్చుకోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అనేక నీటిశుద్ధి యంత్రాలు అధిక ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ అవసరం లేకుండా ఎక్కడైనా.. ఎప్పుడైనా నీటిని శుద్ధి చేసుకునే యంత్రాన్ని తయారు చేయాలనే పట్టుదలతో సోలార్ డిస్టిలేషన్ మెషిన్ తయారు చేశానని ప్రసన్న చెప్పారు. సముద్రంలో రోజుల తరబడి చేపల వేట సాగించే మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు వచ్చానన్నారు. ఈ యంత్రం విజయవంతంగా పని చేస్తోందన్నారు. గోమూత్రం నుంచి సైతం..తన ప్రొఫెసర్ సందీప్ ఎస్.దేశ్‌ముఖ్ ప్రోత్సాహంతో దీనిని తయారు చేశానని ప్రసన్న తెలిపారు. ఎక్కడ కావాలన్నా ఈ యంత్రాన్ని అమర్చుకోవచ్చన్నారు. ఒక రోజుకు ఒక కుటుంబానికి అవసరమైనంత నీరు ఇందులో తయారవుతుందని చెప్పారు. ఈ యంత్రం ద్వారా రోజ్ వాటర్, జాస్మిన్ వాటర్, అత్తరు వంటి వాటితో పాటు ఆవు మూత్రాన్ని శుద్ధి చేసి గోమాత ఆర్కా (దీనిని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు) తయారు చేయవచ్చని వివరించారు. గోమూత్రాన్ని ఒకసారి వేస్తే గోమాత ఆర్కా వస్తుందని, మూడుసార్లు వేస్తే పూర్తిగా శుద్ధి జరిగి మంచినీటిగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే ఈ మెషిన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకూ చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఎటువంటి అదనపు ఖర్చు, వృథా లేకుండా రూపొందించిన మొట్టమొదటి చిన్న పరికరం ఇదేనని ఆమె చెప్పారు. -
ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?
ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు. The Good Citizens of Mumbai Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28 — Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
నేరుగా సముద్రంలోనే విమానం ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే
మార్సెయిల్(ఫ్రాన్స్): ఇంజిన్ వైఫల్యం చెందడంతో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. దీంతో, పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు. ‘ఫ్రెజుస్ బీచ్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్‌లో అత్యవసర ల్యాండింగ్ వారికి అపాయం కలుగుతుందని పైలట్ భావించాడు. దీంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్‌లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్ చేశాడు. ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి. అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది. -
ఆ చేపలు ఎగురుతాయి.. 56 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్.. వైరల్ వీడియో
సాక్షి, అమరావతి: ఈ చేపలు నీటిలో ఈదటమే కాదు.. గాలిలో ఎగురుతాయి కూడా. వీటికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి రాత్రి పూట సముద్రం ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి. అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర జలాల్లో కనిపించే ఈ జీవులు ఇటీవల భారత జలాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ చేపల కళ్లు నీటి అడుగు ప్రాంతాలను చూడటంతోపాటు గాలిలోనూ స్పష్టంగా చూడగలిగేలా మారిపోయాయట. ఈ చేపల విశేషాలేంటో మనమూ ఓ లుక్కేద్దాం. నీటిలో ఈదే చేపలు గాల్లో ఎగురుతున్నాయి. నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల టేకాఫ్ స్పీడ్‌తో పైకి దూసుకెళ్తున్నాయి. ఉష్ణమండల సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ‘ఫ్లయింగ్ ఫిష్’లు చేపల్లోనే అరుదైన జాతులుగా గుర్తింపు పొందాయి. ప్రపంచంలో దాదాపు 40 రకాల ఎగిరే చేపలు ఉన్నాయి. ఈ సముద్ర చేపల కుటుంబాన్ని ఎక్సోకోటిడే అని పిలుస్తారు. లాటిన్ భాషలో ఎక్స్ అంటే ‘బయట’ అని ‘కొయిటోస్‘ అంటే మంచం అని అంటారు. ఇవి రాత్రి పూట సముద్రపు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి కాబట్టే వీటిని లాటిన్లో అలా పిలుస్తారట. రెండు.. నాలుగు రెక్కలతో.. సాధారణ చేపలు నీటి నుంచి ఎగిరి దూకుతుంటాయి. వాటి దూరం కూడా మహా అయితే అడుగు వరకే ఉంటుంది. కానీ.. ఫ్లయింగ్ ఫిష్ శరీరానికి ఇరువైపులా పొడవాటి, వెడల్పాటి పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇందులో ‘టూ వింగర్స్’ అనే చేపకు రెండు పెద్ద పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ‘ఫోర్ వింగర్స్’గా పిలిచే చేపలకు రెండు పొడవాటి పెక్టోరల్ రెక్కలతో పాటు రెండు పెల్విక్ (చిన్న) రెక్కలు ఉంటాయి. వీటి సాయంతోనే ఇవి గాల్లో సులభంగా ఎగరగలుగుతుంది. వీటి వెన్నుపూస నిర్మాణం చూస్తే పడవ చుక్కానిలా కనిపిస్తుంది. ఇవి పక్షుల స్థాయిలో ఎగరలేవు కానీ.. దాదాపు 200 మీటర్ల వరకు ఎగరగలవు. పక్షలు రెక్కలు పైకీ, కిందకి ఆడించినట్టు ఇవి రెక్కలను ఊపలేవు. నీటినుంచి పైకి వచ్చిన వేగాన్ని బట్టి వాటి రెక్కలను విచ్చుకుని మాత్రమే కొంత దూరం ఎగురుతాయి. పెద్ద చేపల నుంచి తప్పించుకునేందుకే.. ఈ అసాధారణ చేపలు 6 నుంచి 20 అంగుళాలు పొడవు ఉంటాయి. రెండు అంగుళాల పొడవు ఉన్నప్పుడే ఎగరడం ప్రారంభిస్తాయి. డాల్ఫిన్లు, వేగంగా ఈదే ఇతర పెద్ద చేపలకు ఆహారం కాకుండా తప్పించుకోవడానికి ఇవి ఎగిరే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి కళ్లు నీటి అడుగున మాత్రమే కాకుండా గాలిలో కూడా స్పష్టంగా చూడగలిగేలా మార్పు చెందాయి. ఇవి చిన్నచిన్న చేపలను, పాచిని తీని జీవిస్తాయి. ఇవి సెకనుకు దాదాపు మీటరు వేగంతో ఉపరితలం వైపు ఈదుతాయి. చెన్నయ్ తీరంలోనూ సందడి ఇవి ఉష్ణమండల, సమశీతోష్ణ సముద్ర జాతులకు చెందిన చేపలు. అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల వీటి గమనం బంగాళాఖాతంలోనూ కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్, జపాన్, వియత్నాం, ఇండోనేషియా, తైవాన్, చైనా, వెనిజులా, బార్బడోస్ జలాల్లో ఎగిరే చేపలు ఉన్నాయి. మాల్దీవులు, చెన్నయ్ తీరాల్లోనూ ఇవి తరచూ కనిపిస్తున్నాయి. 400 మీటర్లు ఎగిరి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఓ ఫ్లయింగ్ ఫిష్ 30 కిలోమీటర్ల వేగంతో 45 సెకన్ల పాటు గాల్లో ఎగిరింది. ఇది 2008లో జపాన్‌లోని కగోషిమాలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న ఓ చిత్ర బృందం కెమెరాకు చిక్కింది. ఇది దాదాపు 1,312 అడుగుల మేర ఎగిరినట్టుగా నమోదైంది. సాధారణంగా ఫ్లయింగ్ ఫిష్‌లు 655 అడుగుల వరకు, నీటి ఉపరితలం నుంచి 26 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. నీటిలోకి తిరిగి దూకినప్పుడు కూడా వేగంగా ఈత కొట్టడం ప్రారంభిస్తాయి. ఇవి అలసి పోకుండా వరుసగా 12 సార్లు గాల్లో ఎగరగలవు. చదవండి: మిసెస్ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని పట్టిన వెంటనే తినేయాలట కరేబియన్ ద్వీప దేశాలైన బార్బడోస్, ట్రినిడాడ్, టొబాగోలకు ఈ చేపలే వాణిజ్య పరంగా కీలకంగా ఉన్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఫ్లయింగ్ ఫిష్ మాంసం గట్టిగా లేత, తెలుపు రంగులో ఉంటుంది. దీనిని కాల్చి, వేయించి, ఆవిరితో వండుకుని తింటారు. ఎగిరే చేపలను పట్టుకున్న వెంటనే తినేయాలట. ఇవి ఎక్కువ దూరం రవాణా చేయడానికి సరిపడవు. ఇతర సముద్ర జీవుల మాదిరిగానే ఇవి కూడా కాంతికి ఆకర్షితం అవుతాయి. అందుకే మత్స్యకారులు లైట్ల వెలుతురులో రాత్రిపూట వేట కొనసాగిస్తారు. -
పరిశ్రమలకు సముద్రపు నీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా సముద్రపు నీటిని శుద్ధిచేసి మంచినీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయడానికి రూ.400 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. పైడి భీమవరం ప్రాంతంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరబిందో వంటి 26కుపైగా ఫార్మా, రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ పరిశ్రమలకు అవసరమైన నీటికోసం అత్యధికంగా భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. తీరప్రాంతంలోని పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం మెంటాడ వద్ద సుమారు 50 ఎకరాల్లో దీన్ని నెలకొల్పనున్నారు. తొలిదశలో రోజుకు 35 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసే విధంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న కాలంలో దీన్ని వంద మిలియన్ లీటర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఐఐసీ శ్రీకాకుళం జోనల్ మేనేజర్ యతిరాజులు తెలిపారు. ఇక్కడ శుద్ధిచేసిన నీటిని పైప్లైన్ల ద్వారా పైడి భీమవరం పారిశ్రామికవాడ, దాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు అందించనున్నారు. దీనివల్ల భూగర్భ జలాల వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్లో భాగస్వామ్యం కోసం ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానిస్తోంది. బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీవోవో), బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్సఫర్ (బీవోవోటీ) విధానంలో ఆహ్వానిస్తున్న ఈ టెండర్లలో పాల్గొనడానికి ఈ నెల 13 చివరితేదీ. నాలుగుపైసలకే లీటరు నీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అతిచౌకగా నీటిని అందించే డీశాలినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2019 ఆగస్టులో ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఉన్న హెచ్2ఐడీ డీశాలినేషన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఇజ్రాయిల్‌కు చెందిన కొంతమంది ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి డీశాలినేషన్‌లో ఐడీఈ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చు తక్కువ అవుతుందని తెలిపారు. కేవలం నాలుగు పైసలకే లీటరు నీటిని ఉత్పత్తిచేసే అవకాశం డీశాలినేషన్‌లో ఉండటంతో తీరంలో పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్న పైడి భీమవరంలోని రసాయన పరిశ్రమలకు డీశాలినేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారాన్ని చూపిస్తోంది. -
పరిశ్రమలకు సముద్ర జలాలు
సాక్షి, అమరావతి: మంచి నీటిని ఆదా చేయడంలో భాగంగా పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన సముద్ర జలాలను అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డిశాలినేషన్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి నీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధి చేసిన జలాల పంపిణీపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సైకిల్ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలని, తద్వారా రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేయొచ్చని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా ఆ నీటిని పరిశ్రమలకు అందించే ఆలోచన చేయాలన్నారు. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యతను ఏపీఐఐసీ చేపట్టాలని, ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఏపీఐఐసీదే బాధ్యత ► పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదే. పకడ్బందీగా డీశాలినేషన్ చేసి, పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అవసరమైన మేరకు నాణ్యమైన నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► సాగు కోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా, డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏరకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి.. ఎక్కడెక్కడిæ నుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు.. ఆ నీటికి బదులుగా డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా నీరు ఇవ్వగలుగుతాం? అన్న అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధం చేయాలి. ► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సముద్రపు నీరు మంచి నీరుగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని శుద్ధి (డీశాలినేషన్) చేసి వినియోగించుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. లెదర్ పార్కులో ఏర్పాటు చేసే యూనిట్లకు నీటి వినియోగం అధికంగా ఉండటంతో ఒక్క చుక్క నీటిని కూడా భూగర్భజలాల నుంచి వినియోగించకుండా పూర్తిగా సముద్రపు నీటినే వినియోగించే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 536.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా లెదర్ క్లస్టర్‌కు రోజుకు 10.5 మిలియనలీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం రోజుకు 90 మిలియన్ లీటర్లకు పైగా సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేయగా వచ్చిన మంచినీటిని వినియోగించి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తారు. తొలిదశలో 386.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ క్లస్టర్‌కు రోజుకు 3.5 మిలియన్ లీటర్ల నీరు అవసరవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 30.5 మిలియన్ లీటర్ల సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని, దీనికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని కృష్ణపట్నం లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. నాలుగు పైసలకే లీటరు నీరు అందుబాటులోకి డీశాలినేషన్ విధానంలో పరిశ్రమలకు కారుచౌకగా నాలుగు పైసలకే లీటరు నీరు అందించవచ్చని, తీరప్రాంతంలో ఏర్పాటు చేసే యూనిట్లకు ఈ విధానంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని 2019 ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇజ్రాయేల్ పర్యటన సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో డీశాలినేషన్ విధానంలో సముద్రపు నీటిని వినియోగించుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేలా ఇజ్రాయేల్‌కు చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు డీశాలినేషన్ ద్వారా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం సముద్రపు నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పరిశ్రమలశాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం తెలిపారు. ఇందులో భాగంగా తొలుత కృష్ణపట్నం లెదర్ పార్క్‌లో డీశాలినేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
నిర్లవణీకరణకు కొత్త మార్గం!
సముద్రపు నీటిని పూర్తిస్థాయిలో మంచినీటిగా మార్చగలిగితే భూమ్మీద నీటి కొరతన్నది అస్సలు ఉండదు. అయితే వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయి నిర్లవణీకరణ అన్నది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వినూత్న పరికరం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వాడుకుంటూ ఈ పరికరం సముద్రపు నీటిలోని లవణాలను తొలగించడం.. తద్వారా మంచినీటిని తయారు చేయడం విశేషం. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఎంత ఉత్పత్తి అవుతుందో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ వేడి కూడా పుడుతూంటుంది. ఈ వేడి కారణంగా కాలక్రమంలో సోలార్ ప్యానెల్స్ విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతూంటుంది కూడా. సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు సోలార్ ప్యానెల్స్ అడుగుభాగంలో పలు పొరలు ఏర్పాటు చేసి ఉపయోగించారు. గొట్టాలతో కూడిన ఈ పొరల గుండా ఉప్పునీరు ప్రయాణించినప్పుడు సోలార్ ప్యానెల్స్ తాలూకూ వేడి కారణంగా వేడిగా మారతాయి. ఇలా పుట్టిన ఆవిరి పలుచటి త్వచం ద్వారా ఇంకో పొరలోకి చేరుతుంది. అక్కడ ఘనీభవించి మంచినీరుగా మారుతుంది. ఈ ఏర్పాటు కారణంగా సోలార్ ప్యానెల్స్ చల్లగా ఉంటూ విద్యుదుత్పత్తిలో నష్టం జరగదని.. అదే సమయంలో ప్యానెల్స్‌ను శుభ్రం చేసుకునేందుకు లేదా పంటలు పండించుకునేందుకు అవసరమైన మంచినీరు అందుబాటులోకి వస్తుందని సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సముద్రపు తాబేలు మనుగడ ప్రశ్నార్థకం
సముద్రపు తాబేలుగా పిలిచే అలివ్‌రిడ్లీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ అలివ్‌రిడ్లీ తాబేళ్లు కడలి కలుషితం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నాయి. సముద్రంలో ఆక్వా రసాయనాలు అధికంగా కలుస్తుండడంతో ఈ తాబేళ్లు మృతిచెందుతున్నట్లు తెలుస్తోంది. సాక్షి, వాకాడు: వాకాడు మండల పరిధిలోని కొండూరుపాళెం, శ్రీనివాసపురం, వైట్‌కుప్పం, పూడి కుప్పం, నవాబుపేట సముద్ర తీరంలో 2013 నుంచి వన్యప్రాణి విభాగం సూళ్లూరుపేట, ట్రీ పౌండేషన్ చెన్నై ఆధ్వర్యంలో అలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి వాటి పిల్లలను సముద్రంలోకి వదులుతున్నారు. అయితే మానవుడి స్వార్థ ప్రయోజనాల కారణంగా పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలను సముద్రంలోకి వదిలిపెట్టడం వల్ల తాబేళ్లు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. సముద్ర తీరంలో రొయ్యల హేచరీలు, రొయ్యల చెరువులు వెలసి వాటి నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు. దీని కారణంగా కడలి విషపూరితమైన వ్యర్థాలతో నిండిపోతోంది. తద్వారా తాబేళ్లు జీర్ణశక్తిని కోల్పోయి ఊపిరాడక రోజుకి పదుల సంఖ్యలో మృతిచెందుతున్నాయి. అలాగే నిబంధనలను అతిక్రమించి చెన్నైకు చెందిన మరబోట్లు ఈ ప్రాంతంలో వేట చేయడం వల్ల తాబేళ్లు వాటికి తగిలి మృత్యువాత పడుతున్నాయి. సహజంగా మెరైన్ యాక్ట్ 1999 ప్రకారం మరబోట్లు తీరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో చేపల వేట చేయాలి. నిబంధనలను ఉల్లంగించి వేట చేయడం వల్ల గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చే తాబేళ్లు బోట్ల కింద చనిపోతున్నాయి. అలివ్‌రిడ్లీతో ప్రయోజనం అలివ్‌రిడ్లీ తాబేళ్లు సముద్ర జలాల్లోని పాచి, మొక్కలు వివిధ వ్యర్థ పదార్థాలను తింటూ సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించి పోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో ఈ తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. అలివ్‌రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఒక రకమైన జెల్‌ను విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. అనేక ఉపయోగాలు ఉన్న ఈ అలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణ నేడు గాల్లో దీపంలా మారింది. తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వాకాడు మండల తీరప్రాంత గ్రామాల్లో తాబేళ్ల పెంపకానికి ప్రత్యేక నిధులతో హేచరీలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం అధికారులు ప్రతి ఏడాది అధిక మొత్తంలో గుడ్లను సేకరించి హేచరీల ద్వారా పిల్లలను ఉత్పత్తి చేసి సముద్రంలో విడిచి పెడుతున్నారు. వైట్‌కుప్ప సముద్ర తీరంలో మృతిచెందిన పెద్దసైజు అలివ్‌రిడ్లీ తాబేలు ఇప్పటివరకు 29,784 గుడ్లను సేకరించి వాటి ద్వారా పిల్లలను ఉత్పత్తి చేసి 19,102 వరకు పిల్లలను సముద్రంలోకి వదిలారు. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సముద్ర తీరంలో ప్రత్యేక గుంతల్లో గుడ్లను పొదుగుతారు. ఇవి దాదాపు 45 నుంచి 60 రోజుల లోపు పిల్లలుగా తయారవుతాయి. తాబేళ్ల అభివృద్ధికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. అందులో ట్రీ ఫౌండేషన్, బయోవర్సీటీ కంజర్వేషన్ ఫౌండేషన్ సంస్థలు వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. అలివ్‌రిడ్లీ తాబేలు 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, సుమారు 45 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గం నుంచి వెళతాయో అవి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. తాబేళ్లను చంపినా, వాటి గుడ్లను తిన్నా, ధ్వంసం చేసినా వన్యప్రాణి చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంలో నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తాబేళ్ల సంరక్షణ మన కర్తవ్యం పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం వల్ల, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. తాబేళ్లను తిన్నా, చంపినా, వీటి ఆవాసాలను నాశనం చేసిన వారు శిక్షార్హులు. వణ్యప్రాణి చట్టం 1972 ప్రకారం ఈ జాతిని షెడ్యూల్–1 లో పొందుపరిచి ప్రత్యేక రక్షణ కల్పించడం జరిగింది. – గాయం శ్రీనివాసులు, వన్యప్రాణి బీట్ ఆఫీసర్ -
విశాఖకు ఉప్పుద్రవం!
నగరానికి ప్రకృతి అమర్చిన నగలా భాసిల్లుతోంది అతి పొడవైన సాగరతీరం. విశాఖ ఎదుగుదలకు పారిశ్రామికంగా, పర్యాటకంగా దోహదం చేస్తోంది. కానీ ఇదే సాగర తీరం భవిష్యత్తులో నగరానికి పెను ఉపద్రవంగా పరిణమించనుందా?.. ఈ ప్రశ్నకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.అదేమిటీ.. సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న విశాఖ సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా సురక్షితంగా ఉంటుందని కదా ఇప్పటి వరకు ధైర్యంగా ఉంటున్నాం.. అని అంటారా!..అది కరెక్టే గానీ.. భవిష్యత్తులో కమ్ముకొచ్చే ముప్పు మరో రూపంలో ఉంటుందన్నది నిపుణుల హెచ్చరిక.. సాగర జలాలు చాపకింద నీరులా నగర పరిధిలోని భూగర్భంలోకి చొచ్చుకొచ్చి పాతాళగంగను ఉప్పుతో నింపేస్తున్నాయి. దీని వల్ల మరికొన్నేళ్లలో నగరం తీవ్రమైన తాగునీటి ఎద్దడితో తల్లడిల్లిపోనుందని అంటున్నారు. అదెలా అంటే.. భూగర్భ జలమట్టాలు పుష్కలంగా ఉంటే నగరానికి ఆనుకొని ఉన్న సాగర జలాలను రాకుండా అడ్డుకుంటాయి. కానీ గత కొన్నేళ్లుగా అరకొర వర్షాలు, నగర పరిధిలోని భూమిలో సుద్ద మట్టి వల్ల నీరు భూమిలోకి ఇంకకపోవడం వంటి పరిస్థితులతో భూగర్భం వట్టిపోతోంది. ఆ ఖాళీ స్థలాల్లోకి సాగరజలాలు చొచ్చుకొస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాల్లో ఉప్పు నీరు కలిసిపోతోంది. మొత్తం భూగర్భ నీటివనరులను ఉప్పుమయం చేసేస్తోంది. ఇప్పటికే సాగరతీరాన్ని ఆనుకొని ఉన్న పలు ప్రాం తాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భాన్ని రీచార్జ్ చేసే చర్యలను ముమ్మరం చేయకపోతే భవిష్యత్తులో నగరం మొత్తం ఉప్పునీటి కయ్యగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఉప్పునీటి కయ్యగా విశాఖ నగరం ► అక్షరాలా మనిషి స్వయంకృతం ► ఆందోళన కలిగిస్తున్న పరిణామం ► రాబోయే కాలంలో నీరు పూర్తిగా నిరుపయోగం ► ఇంకుడుగుంతలే పరిష్కారం ముప్పులు ఎన్నో విధాలు.. వాటిలో ఉప్పు ముప్పు విశాఖను భయపెడుతోంది. చాపకింద నీరన్నది అక్షరాలా విశాఖను ఉప‘ద్రవం’లా కలవరపెడుతోంది. దీనిని ఉప్పుద్రవం అనాలేమో. ఎందుకంటే నగరంలో భూగర్భ జలాల పరిమాణం తగ్గిపోతూ ఉంటే.. ఆ స్థానాన్ని సముద్రం నుంచి లవణ జలాలు ఆక్రమిస్తూ ఉండడంతో నగరం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం వెంటాడుతోంది. సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖనగరం.. నవ్యాంధ్రకు ఆర్థిక రాజధాని...ఉత్తరాంధ్ర ముఖద్వారం....23 లక్షలకు పైగా జనాభా కలిగి.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ప్రతిరోజు నాలుగైదులక్షల ఫ్లోటింగ్ జనాభాతో నిత్యం కిటికట లాడే పారిశ్రామిక రాజధాని.. ఉక్కునగరంగా... సాగరనగరంగా.. స్మార్ట్ సిటీగా ఎన్నో విశిష్టతలు కల్గిన ఈ మహానగరానికి పెనుముప్పు పొంచి ఉంది.భవిష్యత్తులో విశాఖ నగరాన్నే ఖాళీ చేయాల్సిన పరిస్థితులు దాపురించబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగరం..బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న సాగరనగరం.ఇప్పుడు ఆ సాగరమే విశాఖకు శాపంగా మారనుంది. ఈ నగరానికి ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ స్థాయిలో నీటి ఇక్కట్లు ఎదురవలేదు. కారణం ఈ నగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడమే. సాధారణంగా సాగరం పక్కనే ఉండే నగరాలు, ప్రాంతాల్లోని ఉప్పునీటి శాతం ఎక్కువగా ఉండడం వలన ఆ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు వాడేందుకు ఏమాత్రం ఉపయోగపడవు. కానీ విశాఖనగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడం.. సముద్ర నీరు నగర భూగర్భపొరల్లోకి చొచ్చుకొచ్చేపరిస్థితులు లేకపోవడం వలన ఇన్నాళ్లు గ్రౌండ్ వాటర్ కోసం పెద్దగా ఇబ్బందిపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. వేసవిలో 15–20 రోజులు కాస్త భూగర్భ జలాలు అడుగంటినా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ సమీప భవిష్యత్తులో విశాఖ నగరం మహాముప్పును ఎదుర్కోబో తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంజరు భూముల్లా రిజర్వాయర్లు నగర దాహాన్ని తీర్చే ఒయాసిస్సులా ఉండే ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లు వేసవి ప్రారంభంలోనే ఎండిపోయి బంజరు భూములను తలపిస్తున్నాయి. రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలు అక్రమ కట్టడాలు, ఆక్రమణలతో నిండిపోయాయి. మిగిలిన రిజర్వాయర్లు సైతం ఏళ్లతరబడి పేరుకుపోయిన సిల్ట్ వల్ల వాటి 60 శాతానికి పైగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయి నగరానికి తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలా కొనసాగిస్తే మరో పదేళ్లలో చుక్కనీరు దొరకని పరిస్థితి నెలకొంది.రాబోయే గడ్డు పరిస్థితి నుంచి విశాఖ బయటపడాలంటే నగరంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన జీవనశైలిని అవలంబించాలని నిపుణులు అంటున్నారు. ఉపరితల నీటి వనరులతో పాటు భూగర్భ నీటి సమతుల్యత, శాస్త్రీయ పర్యవేక్షణ, నీటి యాజమాన్యం ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం ఎప్పటికప్పుడు శాస్త్రీయమైన నీటి యాజమాన్య విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు. రిజర్వాయర్లలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడం... క్యాచ్మెంట్ ఏరియాల్లో ఆక్రమణలు తొలగించడం.యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున ఇంకుడు గుంతలు నిర్మించడం.. నీటిని పొదుపుగా వాడుకోవడమే మన ముందున్న మార్గాలని స్పష్టం చేస్తున్నారు. చొచ్చుకొస్తున్న సముద్రపునీరు విశాఖలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా మాయమై..చాపకింద నీరులా సముద్రపు ఉప్పనీరు చొచ్చుకొస్తుండడమే అసలు సమస్య. ఇప్పటికే ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, అప్పూగర్, కురుపాం టూంబ్స్, సాగర్‌నగర్ భీమిలిలలోని పలు ప్రాంతాల్లో భూగర్భ అంతర్భాగంలోకి సముద్రపునీరు ఊహ కందని రీతిలో చొచ్చుకొచ్చినట్టు పరిశోధనల్లో తేలిందని నిపుణులు అంటున్నారు. నగరంలో లెక్కాపత్రం లేకుండా ఇష్టమొచ్చినట్టుగా బోర్లు వేయడం.. మోతాదుకు మించి భూగర్భ జలాలు విపరీతంగా వాడేస్తూ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు అడ్డూ అదుపూ లేకుండా లక్షల గ్యాలెన్ల నీటిని తోడేస్తున్నారు. ఇలా తోడేసిన నీటిని రీచార్జ్ చేసేందుకు వీలుగా ఆ స్థాయిలో తగినంత వర్షపాతం లేకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతోంది.ఒకవేళ వర్షం కురిసిన ప్పటికీ నగరమంతా కాంక్రీట్ జంగిల్ కావడంతో నీరుభూమిలోకి ఇంకకుండా నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. నగరంలో చాలా ప్రాంతం ఎత్తయిన కొండలపైనే ఉంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నగరమంతా మడతభూములపైనే ఉంది. నగర విస్తీర్ణంలో చాలా వరకు సుద్దరాయి కావడంతో వర్షపునీరు భూమి పొరల్లోకి వెళ్లకుండా సముద్రంలోకి పంపించేస్తుంది. తగ్గుతున్న భూసారం నగర భూమిపొరల్లో మంచినీరు పుష్కలంగా ఉన్నంత కాలం సముద్రపు నీరుని నగరంవైపు రానీయ కుండా వెనక్కి నెడుతుంది.భూగర్భ జలాలు ఏమాత్రం అడుగంటినా భూమి పొరల్లోకి ఖాళీ ప్రదేశంలోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది. ఒక్కసారి సముద్రపు నీరు చొచ్చుకొస్తే ఆ తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా ఉప్పునీటితోనే నిండిపోతుంది. భూ అంతర్భాగంలో ఉప్పునీరు చేరడం వలన ఆ నేల సారాన్ని కోల్పోతుంది. ఆ ప్రాంతంలోని భవనాలు, కట్టడాలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 23లక్షల నగర జనాభాతో పాటు ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ఉత్తరాంధ్ర, ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి వచ్చే మరో నాలుగైదు లక్షల మంది అవసరాలు తీర్చే స్థాయిలో తాగునీటి వనరుల్లేవు. దీంతో అన్ని అవసరాలకు భూగర్భ జలాలపై ఆధార పడాల్సిన పరిస్థితి. భారీ అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ సముదాయాలు పెరిగి పోవడంతో ఒకే ప్రాంతంలో లెక్కకు మించి బోర్లు తవ్వి నిరంతరాయంగా భూగర్భ జలాలు తోడేస్తుండడంతో చుట్టుప్రక్కల కిలోమీటర్ల మేర చుక్కనీరు దొరకని దుస్థితి కన్పిస్తోంది. వర్షపు నీరు ఇంకే ప్రాంతాల గుర్తింపు.. ఉద్దానం కిడ్నీ వ్యాధి మూలకారణాలపై ఆరేళ్లుగా పరిశోధన చేసి ప్రభుత్వానికి పరిష్కారమార్గాలను చూపిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోజ్ నలనాగుల ‘ఉప్పుద్రవ’ సమస్యపై లోతైన పరిశోధన చేశారు. మొట్టమొదటిసారిగా కాంటూర్ మ్యాపింగ్ విశ్లేషణలతో నగరంలో 200కు పైగా వర్షపునీరు ఇంకే ప్రాంతాలను గుర్తించారు. ఈ పరిజ్ఞానంతో వర్షం నీరు ఎక్కడ నుంచి ఎక్కడకు, ఎం త ప్రవహిస్తోందో స్పష్టంగా తెలుసు కోవచ్చు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. నీరు ఒక ద గ్గరకు చేరే గృహసముదాయ ప్రాంతాలను గుర్తించి.. భూగర్భ నీటి యాజమాన్య పద్ధతుల్ని చేపటొ ్టచ్చు. నగరంలో ఇలా కాంటూర్ మ్యాపింగ్ ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ వలన నగర నీటి భద్రతను పెంచగలమని ప్రొఫెసర్ మనోజ్ చెబుతున్నారు.అవసరమైతే రోడ్డు కూడలిలో.. రోడ్డు మధ్యలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించుకోవచ్చంటున్నారు. ఏడాది పొడవునా ఇంకుడు గుంతల నిర్వహణ, పర్యవేక్షణను జీవీఎంసీ చేపట్టాలని సూచిస్తున్నారు. కఠిన నిబంధనలు అవసరం నగరంలో లెక్కకు మించి వేస్తున్న బోర్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో బోర్లు ఎన్ని ఉన్నాయో.. వాటి ద్వారా రోజూ ఎంత పరిమాణంలో భూగర్భ జలాలను తోడుతున్నారో.. గణాంకాలు సేకరించి వాటి వినియోగంపై నియంత్రణ విధించాలి. నగరంలో ఎన్ని బోర్లు ఉన్నాయో జీవీఎంసీ దగ్గర కూడా పూర్తి లెక్కలు లేవు. కనీస సమాచారం కూడా లేకుండా రిగ్‌లు వేసేస్తున్నారు. ఈ పరిస్థితి లేకుండా బోర్ల తవ్వకాలపై కచ్చితమైన నియమ నిబంధనలు విధించాలి. సిటీ పరిధిలో బోర్లున్న ప్రతి ఒక్కరూ వర్షపునీటిని సంరక్షించి భూగర్భ జలాలు రీచార్జి చేసేట్టు నిబంధనలు విధించాలి. ఇందుకు ఎన్నో సులువైన పద్ధతులున్నాయి. డాబా పైన పడే వర్షపు నీటికి కిందకు తెచ్చే గొట్టాల మధ్య మామూలు ఫిల్టర్లను అమర్చుకుంటే.. ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగించకోవచ్చు. మిగిలిన నీటిని బోరు కనెక్షన్‌కు ఇస్తే అది నేరుగా భూగర్భంలోకి వెళ్తుంది. – కేఎస్ శాస్త్రి, డెప్యుటీ డైరెక్టర్, భూగర్భ జలవనరుల శాఖ మినీ రిజర్వాయర్లు ముఖ్యం నగరంలో ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది. ఏయూ, రైల్వే, పోర్టు ఏరియాల్లో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న చెరువులు మాదిరిగా మినీ రిజర్వాయర్లు నిర్మించాలి. వర్షపు నీటిని దాంట్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు చేయాలి. తద్వారా ఆ నీటిని నగర వాసులు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా భూగర్భపొరల్లోకి చేరి భూగర్భ జలాలు పెరిగేందుకు కూడా ఈ రిజర్వాయర్లు దోహదపడతాయి. – శీలబోయిన సత్యనారాయణ, రిటైర్డ్ సీఈ, నీటిపారుదల శాఖ -
5 పైసలకే లీటరు మంచినీళ్లు
సాక్షి, భోపాల్ : కేవలం 5 పైసలకే లీటర్ తాగునీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాడీ మహోత్సవం ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘సముద్ర జలాలను తాగునీరుగా మార్చి తక్కువ ధరకే ప్రజలకు అందిస్తాం. తమిళనాడులోని ట్యూటికోరన్‌లో ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు నది జలాల పంపిణీపై పోరాడుతుంటాయి. కానీ ఎవ్వరు కూడా భారత్ నుంచి పాకిస్తాన్‌కు తరలిపోతున్న నది జలాల గురించి మాట్లాడర’ని ఆయన అన్నారు. -
132 ఏళ్ల ‘సీసా సందేశం’
2003లో విడుదలైన శివమణి సినిమాలో హీరోయిన్ అసిన్ సముద్రం మధ్యలో అపాయంలో ఉన్నప్పుడు కాగితంపై ఓ సందేశం రాసి, దానిని గాజు సీసాలో పెట్టి పడవలో నుంచే నీళ్లలోకి విసిరేస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ‘బాటిల్ సందేశం’ మరో హీరోయిన్ రక్షితకు బీచ్‌లో దొరికి కథకు కీలకంగా మారుతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో అలాంటి జిన్ ‘సీసా సందేశం’ లభించింది. అయితే ఇది ప్రేమ సందేశం మాత్రం కాదు. కాగితంపై వివరాలు రాసి జిన్ బాటిల్లో పెట్టి సముద్రంలోకి విసిరిన సందేశం ఇటీవల ఓ మహిళకు దొరికింది. సినిమాలోలాగా కాకుండా ఇది ఏకంగా 132 ఏళ్ల క్రితం నాటిది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత పాత ‘బాటిల్ సందేశం’ అయ్యింది. ఇంతకీ ఆ జిన్ సీసాలోని పేపర్లో ఏముంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.. పూర్వం ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జలాల ప్రవాహాలు, అలల వేగాన్ని లెక్కించి నౌకలు సులువుగా ప్రయాణం సాగించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త సముద్ర మార్గాలను కనుక్కునేవారు. ఇందుకోసం వారు 69 ఏళ్లపాటు పరిశోధనలు చేశారు. ఇంతకీ జలాల ప్రవాహాన్ని లెక్కించడానికి వాళ్లు ఏం చేసే వారంటే.. బాటిళ్లలో తేదీతో సహా సందేశాలు రాసిపెట్టి పడవలు, ఓడల నుంచి సముద్రం మధ్యలోకి విసిరేవారు. ఆ తర్వాత ఈ బాటిళ్లు ఎవరికి దొరుకుతాయో వారు ఆ సీసాలో ఉన్న కాగితాన్ని హాంబర్గ్‌లోని జర్మనీ నౌకల విభాగానికి లేదా దగ్గర్లోని జర్మనీ రాయబార కార్యాలయానికి అందించాలి. ఆ బాటిల్ సముద్రంలో విసిరిన తర్వాత ఎన్నాళ్లకు తీరానికి వచ్చిందనేదాన్ని అంచనా వేసి సముద్ర జలాల వేగాన్ని, అలల దిశను కనుగొనేవారు. 19వ శతాబ్దంలో ఇలాంటి కొన్ని వేల సీసాలను సముద్రాల్లోకి విసరగా వాటిలో దాదాపు పది శాతం (660) సందేశాలు మాత్రమే తిరిగొచ్చాయి. చివరిగా 1934లో ఇలాంటి బాటిల్ డెన్మార్క్‌లో దొరికింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళకు అక్కడి బీచ్‌లో ‘సీసా సందేశం’ దొరికింది. జర్మనీకి చెందిన పౌలా నౌక నుంచి 1886 జూన్ 12వ తేదీన హిందూమహా సముద్రంలో ఫలానా అక్షాంశాలు, రేఖాంశాల ప్రదేశంలో ఈ బాటిల్‌ను నీళ్లలోకి విసిరేస్తున్నట్లు ఆ సందేశంలో రాసి ఉంది. -
సముద్రపు నీటితో విద్యుత్
టోక్యో: సముద్రపు నీటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు తోడ్పడే సరికొత్త టెక్నాలజీని జపాన్‌లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సూర్యరశ్మి సహాయంతో సముద్రపు నీటిని హైడ్రోజన్ పెరాక్సైడ్(ఏ2ై2)గా మార్చగలిగే ‘ఫొటో ఎలక్ట్రో కెమికల్ సెల్’ను రూపొందించారు. ఈ సెల్ సౌరశక్తిని గ్రహించినప్పుడు సముద్రపు నీటిలోని క్లోరిన్ సహాయంతో ఉత్తేజితమై... రసాయన చర్యలు జరుపుతుంది. దీంతో నీటిలో కొంత భాగం హైడ్రోజన్ పెరాక్సైడ్‌గా మారుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఫ్యూయల్ సెల్లో వినియోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అయితే ఇంకా ఇది ప్రాథమిక దశలోనే ఉందని, మరింతగా మెరుగుపరిచి ఎక్కువ స్థాయిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షునిచి ఫుకుజుమి తెలిపారు. -
ఎడారిని తలపిస్తున్న కొల్లేరు
బీటలు వారిన చిత్తడి నేల వలసపక్షులకు నీటి కొరత సముద్రపు ఉప్పునీరు కొల్లేరుకు మాయమైన పచ్చదనం కైకలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. విడిది కోసం వలస వచ్చే అతిథి పక్షులు నీటికోసం,ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. ఒక్క కృష్ణాజిల్లా నుంచే వివిధ డ్రెయిన్ల ద్వారా 35 వేల 590 క్యూసెక్కుల నీరు కొల్లేరులో కలుస్తుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి. అలమటిస్తున్న అతిథి పక్షులు కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, అస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవి స్తున్నాయి. ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కా లం. కొల్లేరులో నీరు లేకపోవడంతో పక్షులకు వేట కరువైంది. కరువు పరిస్థితులు పక్షుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పక్షుల విహార చెరువులో పూర్తిస్థాయిలో నీరు నింపలేదు. సముద్రపు నీరు కొల్లేరులోకి... కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంటపొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కృష్ణాజిల్లా కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు పాడయ్యాయి. కొల్లేరుకు చేరే నీరు పెద ఎడ్లగాడి, చినఎడ్లగాడి కాలువలకు చేరుతుంది. అక్కడ నుంచి ఉప్పుటేరులో కలసి 40 కిలోమీటర్ల దూరంలోని కృత్తివెన్ను వద్ద సముద్రంలో కలుస్తోంది. రెగ్యులేటర్ నిర్మించి నీరు నిల్వ చేయాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉప్పునీరు చేరడంతో కొల్లేరులో చేపజాతులు అంతరించిపోతున్నాయి. కొల్లేరు ప్రమాదంలో పడింది కృష్ణా డెల్టా కరువు పరిస్థితులు కొల్లేరుపై తీవ్ర ప్రభావం చూపాయి. అభయారణ్యంలో అక్రమ చేపల చెరువులకు కొల్లేరు నీరు తరలిస్తున్నారు. సముద్రం నుంచి ఉప్పునీరు కొల్లేరుకు చేరుతోంది. ఈ నీటి కారణంగా చేపలు మృత్యువాతపడుతున్నాయి. సముద్రపు నీరు చేరడంతో రెండు జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట పొలాలు చౌడు భూములుగా మారాయి. - యెర్నేని నాగేంద్రనాథ్, కొల్లేరు సరస్సు పునరుద్ధరణ సమితి అధ్యక్షుడు రెగ్యులేటర్ నిర్మించండి కొల్లేరు ఆపరేషన్‌కు సహకరిస్తే రెగ్యులేటర్‌ను బహుమతిగా అందిస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. రెగ్యులేటర్ నిర్మిస్తే కొల్లేరులో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటిలో ఫింగర్ లింగ్స్ (2 అంగుళాల చేప పిల్లలు)ను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. ప్రభుత్వం త్వరగా రెగ్యులేటర్‌ను నిర్మించాలి. - బలే ఏసురాజు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ ప్రధాన కార్యదర్శి -
ఇవీ గ్రీన్హౌస్లే...
నేల విడిచి వ్యవసాయం చేయడంపై ప్రపంచమంతా పెరిగిపోతోందనేందుకు నిదర్శనమీ రెండు చిత్రాలు. అంతకంతకూ పెరిగిపోతున్న అవసరాలు, తగ్గట్టుగా పెరగని వ్యవసాయ ఉత్పత్తుల మధ్య సమతౌల్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగం కూడా. మొదటి చిత్రంలో ఉన్నది నీటిపై తేలియాడే గ్రీన్హౌస్. స్టుడియో మొబైల్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ చేసింది. దాదాపు 750 చదరపు అడుగుల విస్తీర్ణముండే ఈ నిర్మాణం 96 ప్లాస్టిక్ డ్రమ్ములపై నిర్మించారు. పైకప్పులోని సోలార్ స్టిల్ ద్వారా నీరు అక్కడికక్కడే ఉత్పత్తి అవుతుంది. మొక్కలకు ఉపయోగపడుతుంది. సముద్రపు నీరు లేదా కలుషిత నీటి నుంచి కూడా స్వచ్ఛమైన నీటిని తయారు చేసుకునేందుకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. తగిన పోషకాలు అందిస్తూ నేల అవసరం లేకుండా ప్లాస్టిక్ తొట్టెల్లో (ఈరకమైన వ్యవసాయాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు) మొక్కలు పండిస్తారు. ఇక రెండో చిత్రం... యునెటైడ్ కింగ్డమ్కు చెందిన కేట్ హాఫ్మన్, టామ్ వెబ్‌స్టర్ అనే ఇద్దరు ఔత్సాహికులు వాడేసిన షిప్పింగ్ కంటెయినర్‌తో చేసిన వినూత్న ప్రయోగమిది. కంటెయినర్ పైభాగంలో పారదర్శకమైన గ్రీన్హౌస్ ఏర్పాటు చేసి మొక్కలు, తొట్టెల్లో చేపలూ పెంచుతున్నారు. చేపల వ్యర్థాలు మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతోంది. దాదాపు 400 మొక్కలు పెంచుతూ వచ్చిన పంటను అక్కడికక్కడే అమ్మేస్తున్నారు. ఐడియా భలే! -
దీవులను కొందామా?
ఇల్లు, కారు.. కొనమన్నంత సులువుగా... ఏకంగా దీవినే కొనమంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా! మీరు చదివింది నిజమే! ఇల్లు, కారు ఇతర వస్తువులు కొన్నట్లుగానే డబ్బులుంటే ఏకంగా దీవులనే కొనుగోలు చేయవచ్చు. లేదంటే కొన్నాళ్ల వరకు వాటిని లీజుకు తీసుకోవచ్చు. ఇంకా కాదనుకుంటే ఆయా దీవులలోని నచ్చిన విల్లాను ఎంపిక చేసుకొని, సొంతం చేసుకోవచ్చు. తక్కువ కాలానికి అద్దెకు దొరికే విల్లా సదుపాయాలు కూడా దీవులలో ఎన్నో ఉన్నాయి. అలాంటి దీవుల కథాకమామీషు... - వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు అనేక చిన్నా పెద్దా దీవులు సొంతంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా యూరప్ దీవులలోనూ, మాల్దీవులలోనూ మాల్యా రిసార్ట్స్ నడుపుతున్నారు. - ఖతార్ రాజు షేక్ అహ్మద్ ఖలీప్ అలీకి సొంతంగా రెండు దీవులున్నాయి. హాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వర్జిన్ దీవుల సముదాయంలోని నెకర్ ఐలాండ్‌ను సొంతం చేసుకున్నాడు. మనకు అండమాన్, నికోబార్ దీవులు తెలుసు. మాల్దీవులు, కరేబియన్ దీవుల గురించి వినే వున్నాం. చుట్టూ నీళ్లు, మధ్యలో అందమైన ప్రకృతికి నెలవుగా తీరుగా ఉండే భూమి.. తీరాన ఇసుకతిన్నెలు, బారులు తీరినట్టుగా ఉండే పామ్ చెట్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి దీవులు పెట్టింది పేరు. అలాంటి చోటకు కొత్త దంపతులైతే హనీమూన్‌కి వెళతారు. ఇంకొందరు విశ్రాంతి కోసం వెళతారు. మరికొందరు దీవుల చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశోధించడానికి వెళతారు. ఎవరెందుకు వెళ్లినా దీవులు ఎప్పుడూ కనువిందు చేస్తూ వెనక్కి తిరిగి వెళ్లనివ్వకుండా ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటి చోట కొన్ని రోజులపాటు ఆనందానుభూతులను సొంతం చేసుకొని, వదిలి రావాలంటే మనసొప్పదు. అలాగని మనది కాని చోట ఎన్నాళ్లని ఉంటాంలే అని సర్దుబాటూ అవసరం లేదు. మీకు నచ్చిన దీవిని కొనేసుకుంటే ఎన్నాళ్లైనా అక్కడే ఉండిపోవచ్చు. అవసరం లేదనుకుంటే అద్దెలకు ఇచ్చుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు కొనసాగించవచ్చు. కొన్నవాటిని తిరిగి అమ్మకానికి పెట్టవచ్చు. ఏదైనా ఒక దీవిని కొనాలనే ఆలోచన మీకుంటే చాలు ప్రపంచ స్థిరాస్తుల విపణిలో అందమైన దీవులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సంపన్న వర్గాలు విలాసవంతమైన జీవనం కోసం దీవులను కొనుగోలు చేస్తుంటారు. ఆహ్లాదం కోసం కొనుగోళ్లు... అనేకమంది శ్రీమంతులు ఇప్పుడు దీవుల మీద దృష్టిసారిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మనసుకు నచ్చినట్టుగా గడపడం కోసం విలాసవంతులు దీవులను ఎంచుకుంటున్నారు. కొందరు తమ స్థోమతను బట్టి కొన్నేళ్లపాటు అద్దెకు తీసుకుంటే, దీవులు నచ్చితే ఎంత మొత్తమైనా పెట్టుబడిగా పెట్టి కొనుగోలు చేసి, పూర్తిగా తమ సొంతం చేసుకునేవారు కొందరుంటారు. అమెరికాలోని సంగీత దిగ్గజాలు ఫెయిత్ హిల్, టిమ్ మెక్గ్రోకి ఇలాగే బహమాస్‌లోని ఎక్స్‌మాస్ దీవిని కొనుగోలు చేశారు. దీంట్లో వీరు ఇటీవలే 15,000 చదరపు అడుగులలో అధునాతనమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆకర్షణీయమైన పెట్టుబడి... చిన్న చిన్న దీవులు పెద్ద ఆదాయానికి మార్గాలవుతున్నాయి. ఆకర్షణీయమైన పెట్టుబడిగా పలువురిని ఆకర్షిస్తున్నాయి. ద్వీపాలను కొనుగోలు చేసేవారిలో నూటికి 98 శాతం వ్యాపార దృక్కోణంలోనే చూస్తారు. ఇతర ఆస్తులపై పెట్టుబడి పెట్టినట్టుగానే దీవుల మీదా పెట్టుబడి పెడతారు. తమ సొంతం చేసుకున్న దీవులలో అద్భుతమైన వేసవి విడుదులు, హోటళ్లు నిర్మించి, వాటిని విహారయాత్రకు వచ్చేవారికి అద్దెలకు ఇస్తారు. ఇది లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ప్రముఖ వ్యాపారవేత్తలు ఏయే దీవులు టూరిస్టులను ఆకర్షించే విధంగా ఉన్నాయో శోధిస్తారు. ఉత్తమం అనదగ్గ వాటిని వేలం పాటల ద్వారా తమ సొంతం చేసుకునే వేటలో ఉంటారు. అయితే మరికొంత మంది దీంట్లో కూడా వైవిధ్యాన్ని చూపుతున్నారు. లండన్‌కి చెందిన ప్రపంచప్రసిద్ధ వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్ పీటర్ బియార్డ్ మాత్రం తన పెంపుడు చిరుత పిల్లల కోసం కిందటేడాది కోటికి పైగా డాలర్లు వెచ్చించి మరీ యూరప్‌లో ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. ఇండో కెనడియన్ బిలియనీర్ అయిన బాబ్ ధిల్లన్ కైతే ఏకంగా 2,300 ఎకరాలు గల మాసివ్ దీవి ఉంది. మధ్య అమెరికాలో ఉన్న ఈ దీవి పగడపు దిబ్బలలో ప్రపంచంలోనే విస్తీర్ణంలో రెండవదిగా పేరుగాంచింది. అభివృద్ధి వైపు పరిశీలన... కొన్ని దీవులు 2 నుంచి 12 ఎకరాలలోనే ఉంటాయి. వీటిని అతి చిన్న ద్వీపాలుగా పిలుస్తారు. 12 - 24 ఎకరాలలో ఉండేవి మధ్యస్థం. వీటిని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. 24 నుంచి 37 ఎకరాల వరకు ఉండేవి పెద్ద దీవులు. 37 నుంచి 50కి ఎకరాలకు పైగా ఉన్న దీవులలో పెద్ద భవనాలు, విల్లాలకు అనుకూలంగా ఇక్కడి భూమి ఉంటుంది. ఇలాంటి చోట అద్దెలకు, లీజులకు భవనాలు ఉంటాయి. వీటితో పాటు దీవి స్థలాకృతి, ఓడలకు వేసే లంగరుకు అనుకూలత, చుట్టుపక్కల పేరెన్నికగన్న బీచ్‌లు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. నాట్ ఫర్ సేల్... మన దేశంలో అండమాన్, నికోబార్ దీవులు ఉన్నాయి. బంగాళఖాతంలో తళతళ మెరిసేటి దృశ్యాలతో అత్యంత సుందరంగా ఉండే పగడపు దిబ్బలు ఉన్నాయి. భారతదేశ ప్రధాన భూభాగంలో తూర్పున 700 కి.మీ పొడవునా వ్యాపించి ఉన్న ఈ దీవులు నీలిరంగులో స్వచ్ఛంగా కనిపించే నీటితో, ఇసుక తిన్నెలతో కనువిందుచేస్తాయి. ఇవి మన కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి వీటి కొనుగోళ్లకు, అమ్మకాలకు అనుమతించరు. అయితే వీటిలో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. ప్రైవేట్ దీవులు సముద్రపు నీటిలో భూభాగానికి దూరంగా ఉంటాయి. ఇవి వ్యక్తి లేదా సంస్థల చేతుల్లో ఉంటాయి. కొన్ని దీవులు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. గడచిన రెండేళ్లలో దీవుల కొనుగోళ్లు అమ్మకాలలో వృద్ధి రేటు రెట్టింపు అవుతూ వస్తోంది. వీటిని కొనుగోళ్లకు పెట్టినప్పుడు సొంతం చేసుకునేవీలుంటుంది. దీవుల అమ్మకాలు, కొనుగోళ్లలో ‘ప్రైవేట్ ఐల్యాండ్ ఆన్లైన్ డాట్ కామ్’ పేరెన్నిక గన్నది. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. - కూర్పు: ఎన్.ఆర్. -
అన్వేషణం: సాగర గర్భాన సుందర నిర్మాణం
సబ్ మెరైన్ (జలాంతర్గామి)ని కనిపెట్టినప్పుడు అందరూ చాలా వింతగా చూశారు. ఇది సముద్రం అడుగుకు వెళ్తుందా, అలల మధ్య విహరిస్తుందా, సాగర గర్భాన ఉన్న వింతల్ని చూసే అవకాశం కల్పిస్తుందా అంటూ ఆశ్చర్యపోయారంతా. కానీ అంతకు మించిన వింత, అంతకంటే అద్భుతమైన వింత ఒకటి దుబాయ్‌లో ఉంది. అదే... హైడ్రోపోలిస్. సముద్రపు అడుగున అందంగా కట్టిన స్టార్ హోటల్ ఇది. దాదాపు 550 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి కట్టిన హైడ్రోపోలిస్ హోటల్ గురించి మాటల్లో వినాలనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే... దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే వినడం కంటే చూడటమే కరెక్ట్. నీటి అడుగున జెల్లీఫిష్ ఆకారంలో కట్టారు దీన్ని. ఈ హోటల్ పైకప్పు మాత్రమే నీటిపైన కనిపిస్తుంది. మిగతా హోటలంతా నీటి అడుగునే ఉంటుంది. ఈ లగ్జరీ హోటల్లో మొత్తం 220 సూట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ బుడగల ఆకారంలో నిర్మించారు. జోషిమ్ హాసర్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఈ హోటల్లో... ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండే అన్ని సదుపాయాలూ ఉంటాయి. ప్రపంచంలోని అన్ని రుచులనూ అందించే రెస్టారెంట్, స్పా, థియేటర్, బాల్రూమ్, బార్ తదితర ఏర్పాట్లన్నీ ఉన్నాయి. మొత్తం అద్దాలతో నిర్మించడం వల్ల చుట్టూ ఉన్న సముద్రం నీలిరంగులో కనిపించి మురిపిస్తూ ఉంటుంది. అలల మధ్యన జరజర సాగిపోయే చేపలు, బుడుంగున మునిగే పీతలు, పలురకాల సముద్ర జీవులు, వింత వింత మొక్కలను చూస్తూ గడపడం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఇంతకీ నీటి అడుగున ఉంటే, ఈ హోటల్లోకి ఎలా వెళ్తాం అనే సందేహం వచ్చిందా? కచ్చితంగా వస్తుంది. ఈ హోటల్లోకి వెళ్లడం కోసం ఎంతో ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. సముద్రపు ఒడ్డునుంచి హోటల్ వరకూ ఓ రైలు మార్గాన్ని వేయడం జరిగింది. శబ్దం చేయని ఓ అందమైన రైలు సందర్శకులను, టూరిస్టులను అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. ఏమాత్రం శబ్దం చేయని విధంగా ఈ రైలును ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే వెంటనే వెళ్లి అక్కడ బసచేసి, ఆ అందాలను ఆస్వాదించాలని, ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని ఎవరికైనా అనిపించక మానదు. అయితే అక్కడ బస కాస్త కాస్ట్లీనే. ఒక్క రాత్రి ఉండటానికి 5,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో... మూడు లక్షల ముప్ఫై వేలన్న మాట! ఇది పూయాలంటే... శతాబ్దం ముగియాలి! ఏ మొక్క అయినా ఎప్పుడు పూస్తుంది? ఒకటి వేసవిలో పూస్తుంది. ఇంకోటి వసంతమాసంలో పూస్తుంది. ఒక్కో రకం ఏడాదికోసారి పూస్తుంది. ఇంకో రకం సంవత్సరానికి రెండు మూడు సార్లు పూస్తుంది. కానీ ‘క్వీన్ ఆఫ్ ఆండిస్’ అనే మొక్క ఎన్నేళ్లకోసారి పూస్తుందో తెలుసా? సుమారు వందేళ్లకోసారి! క్వీన్ ఆఫ్ ఆండిస్ మొక్కలు పెరూ, బొలీవియా దేశాల్లోని ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మాత్రమే మొలుస్తాయి. వీటికి కొమ్మలు, ఆకులు అంటూ ఉండవు. మొత్తం కాండంలాగా పొడవుగా... 33 అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతాయి. ఈ మొక్కలకు పైనుంచి కింద దాకా ముళ్లుంటాయి. ఈ ముళ్ల మధ్యలోకి పొరపాటున చెయ్యిగానీ పెట్టామా... ముక్కలుగా తెగిపోవాల్సిందే తప్ప బయటకు తీసుకోలేం. చాలాసార్లు పక్షులు వీటిలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతాయి. అయితే ఈ ముళ్లకు చివర్ల అందమైన పూలు పూస్తాయి. ఒకేసారి మూడు నాలుగు వేల పూలు విచ్చుకుని ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ ఇవి ఎనభై నుంచి వంద సంవత్సరాలకొకసారి మాత్రమే పూస్తాయి. అదే విశేషం!