132 ఏళ్ల ‘సీసా సందేశం’ | The world's oldest message in a bottle discovered on an Australian beach | Sakshi
Sakshi News home page

132 ఏళ్ల ‘సీసా సందేశం’

Published Wed, Mar 7 2018 1:23 AM | Last Updated on Wed, Mar 7 2018 10:46 AM

The world's oldest message in a bottle discovered on an Australian beach - Sakshi

బీచ్‌లో దొరికిన సీసా

2003లో విడుదలైన శివమణి సినిమాలో హీరోయిన్‌ అసిన్‌ సముద్రం మధ్యలో అపాయంలో ఉన్నప్పుడు కాగితంపై ఓ సందేశం రాసి, దానిని గాజు సీసాలో పెట్టి పడవలో నుంచే నీళ్లలోకి విసిరేస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ‘బాటిల్‌ సందేశం’ మరో హీరోయిన్‌ రక్షితకు బీచ్‌లో దొరికి కథకు కీలకంగా మారుతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో అలాంటి జిన్‌ ‘సీసా సందేశం’ లభించింది. అయితే ఇది ప్రేమ సందేశం మాత్రం కాదు. కాగితంపై వివరాలు రాసి జిన్‌ బాటిల్‌లో పెట్టి సముద్రంలోకి విసిరిన సందేశం ఇటీవల ఓ మహిళకు దొరికింది. సినిమాలోలాగా కాకుండా ఇది ఏకంగా 132 ఏళ్ల క్రితం నాటిది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత పాత ‘బాటిల్‌ సందేశం’ అయ్యింది. ఇంతకీ ఆ జిన్‌ సీసాలోని పేపర్‌లో ఏముంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

పూర్వం ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జలాల ప్రవాహాలు, అలల వేగాన్ని లెక్కించి నౌకలు సులువుగా ప్రయాణం సాగించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త సముద్ర మార్గాలను కనుక్కునేవారు. ఇందుకోసం వారు 69 ఏళ్లపాటు పరిశోధనలు చేశారు. ఇంతకీ జలాల ప్రవాహాన్ని లెక్కించడానికి వాళ్లు ఏం చేసే వారంటే.. బాటిళ్లలో తేదీతో సహా సందేశాలు రాసిపెట్టి పడవలు, ఓడల నుంచి సముద్రం మధ్యలోకి విసిరేవారు. ఆ తర్వాత ఈ బాటిళ్లు ఎవరికి దొరుకుతాయో వారు ఆ సీసాలో ఉన్న కాగితాన్ని హాంబర్గ్‌లోని జర్మనీ నౌకల విభాగానికి లేదా దగ్గర్లోని జర్మనీ రాయబార కార్యాలయానికి అందించాలి.

ఆ బాటిల్‌ సముద్రంలో విసిరిన తర్వాత ఎన్నాళ్లకు తీరానికి వచ్చిందనేదాన్ని అంచనా వేసి సముద్ర జలాల వేగాన్ని, అలల దిశను కనుగొనేవారు. 19వ శతాబ్దంలో ఇలాంటి కొన్ని వేల సీసాలను సముద్రాల్లోకి విసరగా వాటిలో దాదాపు పది శాతం (660) సందేశాలు మాత్రమే తిరిగొచ్చాయి. చివరిగా 1934లో ఇలాంటి బాటిల్‌ డెన్మార్క్‌లో దొరికింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళకు అక్కడి బీచ్‌లో ‘సీసా సందేశం’ దొరికింది. జర్మనీకి చెందిన పౌలా నౌక నుంచి 1886 జూన్‌ 12వ తేదీన హిందూమహా సముద్రంలో ఫలానా అక్షాంశాలు, రేఖాంశాల ప్రదేశంలో ఈ బాటిల్‌ను నీళ్లలోకి విసిరేస్తున్నట్లు ఆ సందేశంలో రాసి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement