
మక్కాలో ఆత్మాహుతి దాడి
మక్కా: సౌదీ అరేబియాలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం మక్కా మసీదులో దాడులకు పాల్పడేందుకు సిద్ధమైన ఉగ్రవాదులపై పోలీసులు దాడి చేశారు.
ఈ ఘటనలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు పోలీసులతో సహా 11 మందికి గాయాలయ్యాయి. దాడికి యత్నించిన మహిళతో సహా ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి కుట్ర చేశారని పోలీసులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.