
సౌదీలో భారీ అగ్ని ప్రమాదం
రియాద్: సౌదీ అరేబియా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నజ్రాన్ ప్రావిన్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా భారత్, బంగ్లాదేశ్‌లకు చెందిన వారేనని సమాచారం. వలస కార్మికులంతా ఒక పాత బడిన ఇంట్లో తలదాచుకుంటు జీవనం వెల్లదీస్తున్నారు.
వారంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. దీంతో కిటికీలు కూడా లేని ఆ ఇంట్లో కార్మికులు ఎటు వెళ్లాలో తెలియక, పొగతో ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఊపిరాడక స్పృహకోల్పోయి గాయాలతో పడి ఉన్న మరో ఆరుగురు కార్మికులను సమీపంలో ఆస్పత్రులకు తరలించారు.