‘‘మతం మార్చారు.. సెక్స్‌ బానిసగా అమ్మాలనుకున్నారు’’ | Forcefully converted, held as sex slave in Saudi | Sakshi
Sakshi News home page

‘‘మతం మార్చారు.. సెక్స్‌ బానిసగా అమ్మాలనుకున్నారు’’

Published Sat, Nov 11 2017 11:29 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

Forcefully converted, held as sex slave in Saudi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఐఎస్‌ఐఎస్‌ బీజాలు ప్రమాదకరంగా తయారయ్యాయని చెప్పడానికి ఇదొక సజీవ నిదర్శనం. లవ్‌ జీహాద్‌ పేరుతో కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. సౌదీ అరేబియా తీసుకెళ్లి.. అక్కడ నుంచి ఐఎస్‌ ఉగ్రవాదులకు సెక్స్‌ బానిసగా అమ్మే ప్రయత్నం చేసిన ఒక నరరూపరాక్షసుడి నిజ స్వరూపం ఇది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి.

నన్ను మోసపూరిత వివాహం చేసుకుని, ఆపై మత మార్పిడి చేసి.. సెక్స్‌ స్లేవ్‌గా నన్ను విక్రయించే ప్రయత్నం చేశాడు.. నాకు న్యాయం చేయండంటూ 25 ఏళ్ల యువతి కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నన్ను బలవంత పెట్టి ఇస్లాకు మార్చారని ఆమె కోర్టుకు తెలిపింది. కేరళకు చెందిన యువతి.. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో పెరిగింది. అదే సమయంలో అక్కడ పరిచయమైన ఒక వ్యక్తి దొంగ ఆధార్‌ కార్డు, మోసపూరిత వివరాలతో పెళ్లి చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లయిన తరువాత అతను ముస్లిం అని, అతని పేరు ముహమ్మద్‌ రియాజ్‌ అని తెలిసిందని యువతి తెలిపింది.  వివాహం తరువాత తన నగ్న ఫొటోలు, వీడియోలు తీసి.. సౌదీ అరేబియా రావాలని, లేకుంటే వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించినట్లు ఆమె తెలిపింది.

సౌదీ అరేబియా చేరుకున్నానక బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు.. వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్‌నాయక్‌ ప్రసంగాలు, వీడియోలు చూడాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని ఆమె కోర్టుకు తెలిపారు.
నన్ను సౌదీ అరేబియా నుంచి సిరియా తీసుకెళ్లి అక్కడ ఐఎస్‌ ఉగ్రవాదులకు సెక్స్‌ బానిసగా అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసుకుని భయంతో వణికిపోయినట్లు యువతి చెప్పారు. సౌదీ అరేబియాలో అనుకోకుండా తనకు ఇంటర్‌నెట్‌ లభించడంతో తల్లిదండ్రులతో మాట్లాడడం.. వారి సాయంతో అక్కడనుంచి సురక్షితంగా అహ్మదాబాద్‌ చేరుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం నాకున్న భయానికి కేరళలో అడుగుపెట్టాలంటే వణుకుపుడుతోందని ఆమె కోర్టుకు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement