Converted
-
పాక్‌లో పదేళ్ల చిన్నారి అపహరణ.. మతమార్పిడి.. 50 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి
కరాచీ: పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ) అధ్యక్షుడు శివకట్చి తెలిపిన వివరాల ప్రకారం సంఘర్ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అవినీతికి అలవాటు పడిన పోలీసు సిబ్బంది సహకారంతో ఈ వివాహం జరిగిదనే ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయవాది సహకారంతో కోర్టులో కేసు వేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసిందని శివకట్చి తెలిపారు.గ్రామంలోని తమ ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మిర్పుర్ఖాస్కు చెందిన గులామ్ ముహమ్మద్ అపహరించి, సిర్హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారని శివకచ్చి చెప్పారు. తరువాత ఆ బాలికకు బలవంతంగా మత మార్పిడి చేయించి షాహిద్ తల్పూర్ అనే వ్యక్తితో వివాహం జరిపించారని తెలిపారు. అయితే ఆ ప్రాంత న్యాయ అధికారుల చొరవతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారని శివకచ్చి తెలిపారు.ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి -
పాక్‌లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
పాక్‌లో హిందూ బాలికపై దారుణం
కరాచీ : పాకిస్తాన్‌లోని హిందువులపై అకృత్యాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌లో గ్రామంలో నివాసముంటున్న ఒక హిందూ బాలికను ముగ్గురు సాయుధులైన ముస్లింలు అపహరించారు. అనంతరం బలవంతపు మత మార్పిడి చేసి.. వివాహం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లోని డాన్ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఈ ఘటనపై బాలిక తండ్రి హీరో మేఘవార్.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాన్ తెలిపింది. రెండు రోజులు కిందట ముగ్గురు సాయుధలైన వ్యక్తులు తమ ఇంటిలోని ప్రవేశించి.. అందరినీ బంధించినట్లు మేఘవార్ చెప్పారు. అనంతరం మైనర్ కుమార్తె (14 సంవత్సరాలు)ను వారు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక నేతలను, పోలీసులను సంప్రదించినా ఎవరినుంచి స్పందన రాలేదని ఆయన చెప్పారు. చివరగా నసీర్ లుంజో అంనే వ్యక్తి.. తమ కుమార్తెను బలవంతపు మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు తెలిసిందని అన్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. మేఘవార్ సింథ్ ఎస్ఎస్పీ అధికారిని కలిశారు. ఈ ఘటనపై వెంటనే ఆయన స్పందించి.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు.. బాలికను వెతికించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా.. బాలిక మతమార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్ ఒకటి పోలీసులకు అందిందని తెలిసింది. దీనిపై మేఘవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పెళ్లిని వ్యతిరేకిస్తూ సింధ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సింధ్ హైకోర్టు జనవరి17న విచారించనుంది. -
‘‘మతం మార్చారు.. సెక్స్ బానిసగా అమ్మాలనుకున్నారు’’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఐఎస్ఐఎస్ బీజాలు ప్రమాదకరంగా తయారయ్యాయని చెప్పడానికి ఇదొక సజీవ నిదర్శనం. లవ్ జీహాద్ పేరుతో కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. సౌదీ అరేబియా తీసుకెళ్లి.. అక్కడ నుంచి ఐఎస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసగా అమ్మే ప్రయత్నం చేసిన ఒక నరరూపరాక్షసుడి నిజ స్వరూపం ఇది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. నన్ను మోసపూరిత వివాహం చేసుకుని, ఆపై మత మార్పిడి చేసి.. సెక్స్ స్లేవ్‌గా నన్ను విక్రయించే ప్రయత్నం చేశాడు.. నాకు న్యాయం చేయండంటూ 25 ఏళ్ల యువతి కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నన్ను బలవంత పెట్టి ఇస్లాకు మార్చారని ఆమె కోర్టుకు తెలిపింది. కేరళకు చెందిన యువతి.. గుజరాత్‌లోని జామ్ నగర్లో పెరిగింది. అదే సమయంలో అక్కడ పరిచయమైన ఒక వ్యక్తి దొంగ ఆధార్ కార్డు, మోసపూరిత వివరాలతో పెళ్లి చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లయిన తరువాత అతను ముస్లిం అని, అతని పేరు ముహమ్మద్ రియాజ్ అని తెలిసిందని యువతి తెలిపింది. వివాహం తరువాత తన నగ్న ఫొటోలు, వీడియోలు తీసి.. సౌదీ అరేబియా రావాలని, లేకుంటే వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు ఆమె తెలిపింది. సౌదీ అరేబియా చేరుకున్నానక బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు.. వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్‌నాయక్ ప్రసంగాలు, వీడియోలు చూడాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని ఆమె కోర్టుకు తెలిపారు. నన్ను సౌదీ అరేబియా నుంచి సిరియా తీసుకెళ్లి అక్కడ ఐఎస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసగా అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసుకుని భయంతో వణికిపోయినట్లు యువతి చెప్పారు. సౌదీ అరేబియాలో అనుకోకుండా తనకు ఇంటర్నెట్ లభించడంతో తల్లిదండ్రులతో మాట్లాడడం.. వారి సాయంతో అక్కడనుంచి సురక్షితంగా అహ్మదాబాద్ చేరుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం నాకున్న భయానికి కేరళలో అడుగుపెట్టాలంటే వణుకుపుడుతోందని ఆమె కోర్టుకు తెలిపారు. -
స్కూల్‌ను బార్ క్లబ్‌గా మార్చిన వైనం
-
మీ నాన్న పేరేంటి.. ఇక్కడెందుకున్నావ్?
మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో హిందూ యువ వాహిని కార్యకర్తలు రెచ్చిపోయారు. శాస్త్రినగర్ ప్రాంతంలో మంగళవారం ఇంట్లోకి చొరబడి ఓ జంటపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. అతడితో పాటు ఉన్న యువతికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘మేము ఇంట్లోకి వెళ్లసరికి వీరిద్దరూ రాజీ మార్గంలో కనిపించారు. అద్దెకు తీసుకున్న ఈ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుస్తోంద’ని హిందూ యువ వాహిని సభ్యుడు నాగేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నీ పేరేంటి? మీ నాన్న పేరు చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ పేర్లు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి. మత మార్పిడి చేసుకుంటున్నారా?’ అంటూ వారిద్దరినీ హిందూ యువ వాహిని సభ్యులు ప్రశ్నించారు. తర్వాత వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారని నిర్ధారణ కావడంతో విడిచిపెట్టినట్టు మీరట్ నగర పోలీసు కమిషనర్ అలోక్ ప్రియదర్శిని తర్వాత తెలిపారు. హిందూ యువ వాహిని సంస్థను 2002లో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంస్థకు ఆయన దూరంగా ఉంటున్నారు. -
బంగారంగా మారిన నగదెంతో తెలుసా?
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన అనంతరం నల్లధనాన్ని తెల్లగా మార్చడం కోసం బ్లాక్‌మనీ హోల్డర్స్ ఒక్కసారిగా బంగారం దుకాణాలకు పరిగెత్తిన సంగతి తెలిసిందే. ఇదే అవకాశంగా తీసుకుని బంగారం వర్తకులు మనీ లాండిరింగ్ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంగారం వర్తకులపై కొరడా ఝళిపించడం ప్రారంభించింది. దేశరాజధాని పరిధిలోని బంగారం వర్తకులపై ఐటీ డిపార్ట్మెంట్ తాజాగా జరిపిన దాడుల్లో లెక్కల్లో తేలని రూ.250 కోట్ల బంగారం విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాక పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ జరిపిన దాడుల్లో దేశరాజధానిలో రూ.400 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో తేలని బులియన్ విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. కరోల్ బాగ్, చాందినీ చౌక్ ప్రాంతాల్లోని నలుగురు బులియన్ డీలర్స్ను శుక్రవారం ఐటీ డిపార్ట్మెంట్ విచారించింది. ఈ విచారణలో గత కొన్ని వారాల్లో రూ.250 కోట్లకు పైగా రద్దయిన నగదును మార్చిపెట్టినట్టు తెలిసింది. ఈ వర్తకులకు సంబంధించిన 12 దుకాణాలు, 8 నివాస ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఇంకా దాడులు నిర్వహిస్తోంది. మొదటగా రూ.250 కోట్ల రద్దయిన నోట్లను వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా బంగారంలోకి మార్చినట్టు గుర్తించామని ఓ సీనియర్ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఈ నలుగురి ట్రేడర్ల దుకాణాలు పాత ఢిల్లీ పరిధిలోని కుచ మహాజని ప్రాంతంలో ఉన్నాయని, మరికొన్ని దుకాణాలు కరోల్ బాగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి బ్యాంకు అకౌంట్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దయిన అనంతరం మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వార్తలతో కుచ మహాజని బులియన్ డీలర్స్‌పై మొదటి రైడ్ నిర్వహించామని, ఆ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా గోల్డ్ బార్స్‌ను వీరు విక్రయించినట్టు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. అప్పుడే మనీ లాండరింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయంలో ఈడీ ఇప్పటికే ఇద్దరు బ్యాంకు మేనేజర్లను, ఇద్దరు మధ్యవర్తులను అరెస్టు చేసింది. -
”మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలి”