విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండలం లింగాలవలస వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు పెట్రోల్ ట్యాంకర్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలు అంటుకుని ఆయిల్ ట్యాంకర్లు తగులబడుతున్నాయి. అయితే ఘటన జరిగిన ప్రాంతానికి ప్రక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి స్థానికులు భయాందోళన పరుగులు తీస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.