
కారు బోల్తా.. నలుగురికి గాయాలు
బద్వేలు అర్బన్: బద్వేలు మైదుకూరు జాతీయ రహదారిలోని నందిపల్లె సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైనవారిలో ఒకరికి త్వరలోనే పెళ్లి జరగనుండడంతో పత్రికలు పంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ముద్దనూరుకు చెందిన మునెయ్యకు త్వరలో పెళ్లి జరగనుండడంతో బద్వేలు సమీపంలోని డి. అగ్రహారంలో ఉన్న అక్క ఇంటికి వెళ్లి పెళ్లిపత్రిక ఇచ్చారు. అనంతరం పట్టణంలోని వెంకటయ్యనగర్‌లో ఉన్న మరో బంధువుకు పెళ్లిపత్రికలు ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి ముద్దనూరుకు వెళ్తుండగా నందిపల్లె సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తాపడింది. వెంటనే స్థానికులు కారులో ఉన్న మునెయ్యతోపాటు అతడి మేనల్లుడు చైతన్య, అక్కకుమారుడు రాహుల్, కుమార్తె రాశిలను బయటకు తీసి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా తీవ్ర గాయాలైన మునెయ్యను కడప రిమ్స్‌కు తరలించారు.