తూర్పుగోదావరి(పిఠాపురం): తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈఘటన మండల కేంద్రంలోని 216 నంబరు జాతీయ రహదారిపై ఆటోలో ఇద్దరు వ్యక్తులు మూడు బస్తాల్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అనంతరం ఆటోను కూడ సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.