నెల్లూరు జిల్లా తడ పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు బుధవారం ఉదయం చేపట్టిన చర్యలను వ్యాపారస్తులు అడ్డుకున్నారు.
తడ(నెల్లూరు): నెల్లూరు జిల్లా తడ పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు బుధవారం ఉదయం చేపట్టిన చర్యలను వ్యాపారస్తులు అడ్డుకున్నారు. జాతీయ రహదారి పక్కనే స్థలాలను ఆక్రమించి కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు, స్థానిక పంచాయతీ కార్యాలయ సిబ్బందితో కలసి బుధవారం ఉదయం పోలీసుల సమక్షంలో ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేశారు.
తమకు ముందస్తు హెచ్చరిక లేకుండా, ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా ఆక్రమణలు తొలగించడం అన్యాయమని వారు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రెండు రోజుల్లోగా స్థలాలను ఖాళీ చేయాలని, లేకుంటే తామే తొలగిస్తామని సూళ్లూరుపేట సీఐ విజయకృష్ణ వారికి తెలిపారు.