జిల్లాలో 42వ రోజు కొనసాగిన సమైక్య ఉద్యమం | united andhra movement is still going on .. | Sakshi
Sakshi News home page

జిల్లాలో 42వ రోజు కొనసాగిన సమైక్య ఉద్యమం

Published Wed, Sep 11 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

united andhra movement is still going on ..


 సాక్షి, తిరుపతి:
 వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని జి ల్లావ్యాప్తంగా సమైక్యవాదులు మంగళవారం వినూత్న తరహాలో ఆందోళనలు చేశారు. ఉద్యమం 42వరోజుకు చేరింది. పుంగనూరులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ వినాయకుని విగ్రహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహిం చారు. నివాసాల్లో పూజలు చేసిన వినాయకుని విగ్రహాలను రోడ్డుపై పెట్టి భారీ ప్రదర్శన చేసి, నిరసన తెలియజేశారు.
 
  22 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరులో విద్యార్థులు తెలుగుతల్లి మాస్క్‌లతో గాంధీ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులు రాస్తారోకో, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస్టాండ్‌లో వివిధ క్రీడలు ఆడుతూ నిరసన తెలిపారు. పలమనేరులో ని వాసాల ముందు సమైక్య ముగ్గులు వేశారు. అనేక ప్రాం తాల్లో సమైక్య వినాయకుడిని ఏర్పాటు చేశారు. జేఏసీ దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు కోర్టు వద్ద యజ్ఞం చేశారు. రవీంద్ర భారతి విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో, మానవహారం నిర్వహించి మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయలు, విద్యార్థులు మానవహారం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి శివాలయంలో సమైక్యాంధ్ర కోసం ప్రత్యేక పూజలు చేశారు. వీ.కోటలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష, గణపతి పూజ చేశారు.
 
 వినాయకుని మాస్క్‌లతో నిరసన
 బెరైడ్డిపల్లిలో ఉపాధ్యాయులు వినాయకుని మాస్క్‌లు ధరిం చి ర్యాలీచేశారు. గంగవరంలో జాతీయ రహదారిని దిగ్బం ధించారు. కుప్పం, శాంతిపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ల రిలే దీక్షలు కొనసాగాయి. శాంతిపురంలో రహదారులను దిగ్బంధించారు. పుత్తూరులో ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మదనపల్లెలోని టౌన్‌బ్యాంక్ కూడలిలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు ఉరి వేసుకున్నట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ జూనియర్ క ళాశాలలు జేఏసీగా ఏర్పడి బెంగళూరు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు.
 
  బాలికల జూనియర్ కళాశాల వారు వంటావార్పు చేశారు. మదనపల్లె రూరల్ మండలం బసినికొండ మహిళా సంఘాల వారు పట్టణం భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో  రిలేదీక్షలు కొనసాగాయి. నగరంలోని అన్ని దీక్ష శిబిరాల్లో వినాయకుని విగ్రహాలు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, నిరసన తెలియజేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులపై సమైక్యవాదులు బైఠాయించి, ధర్నా రాస్తారోకో కార్యక్రమా లు నిర్వహించారు.
 
 16వరకు విద్యా సంస్థలు బంద్
 ప్రయివేటు విద్యాసంస్థల యజమానులు బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు మూసేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డీవో, ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యం, సాప్స్ నాయకులు మంగళవారం రాత్రి సమావేశమై నిర్ణయించారు. అలాగే వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు కూడా బంద్ పాటించే విషయమై చర్చించారు. బుధవారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement