united supporters
-
దిగ్విజయ్ గోబ్యాక్
తిరుపతి,న్యూస్‌లైన్: విభజన కుట్రదారుల్లో ఒకరైన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రావడాన్ని సమైక్యవాదులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరు సాగిస్తున్న సమైక్యవాదులు గురువారం పలుచోట్ల డిగ్గీరాజా దిష్టిబొమ్మలను దహనంచేసి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మ సర్కిల్లో సమైక్యవాదులు దిగ్విజయ్ గోబ్యాక్..ఇటలీ సోనియా క్విట్ ఇండియా...జీఓఎం డౌన్ డౌన్ అంటూ నినాదాచేశారు.జేఏసీ గౌరవాధ్యక్షుడు మునిసుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు ప్రకాష్,ఆవుల ప్రభాకర్‌యాదవ్,లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరులో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనంచేశారు. అంతకు ముందు దిష్టి బొమ్మను కోడిగుడ్లు.టమాటాలతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం ఉద్యోగ జేఏసీ చైర్మన్ వరదారెడ్డి,బీసీ నాయకుడు అద్దాల నాగరాజు ఆధ ్వర్యంలో గోకుల్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక ్తం చేశారు. మదనపల్లిలో జేఏసీ,మిట్స్ అధ్వర్యంలో సమైక్యవాదులు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.పలమనేరులో టీడీపీ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష కొనసాగించారు. కుప్పంలోసమైక్యవాదులు జేఏసీ ఆధ్వర్యంలో దిగ్విజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఆమోదంపై ఆగ్రహం
జగ్గంపేట, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై జీఓఎం నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదులు భగ్గుమన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరు తూ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జగ్గంపేటలో 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధిం చారు. పెద్దసంఖ్యలో నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, సమైక్యవాదులు రాత్రి ఏడు గంటల నుంచి ఆందోళన చేపట్టారు. సోనియా గాంధీ, కాంగ్రెస్, మంత్రి తోట నరసింహంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సీఐ సుంకర మురళీమోహన్, ఎస్సై సురేష్‌బాబు, ట్రైనీ ఎస్సై సురేష్ ఆందోళన విరమించాలని జ్యోతులకు నచ్చజెప్పబోయినా ఆయన ససేమిరా అన్నారు. గంటపాటు వేచి ఉన్న పోలీసులు చివరికి జ్యోతులను, పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ జీపులో ఎక్కించబోయారు. తిరస్కరించిన జ్యోతుల సర్వీసు రోడ్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిచి వెళ్లగా కార్యకర్తలు, సమైక్యవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనను అనుసరించారు. కేబినెట్ ఆమోదం దారుణం ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా గతంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి జీఓఎం, కేంద్ర కేబినెట్లు ఆమోదం తెలపడం దారుణమన్నారు. విభజన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్న తమ అభిమతం కేంద్రానికి తాకేలా చేసేందుకే జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల మూడు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి సమైక్య పోరును సాగిస్తూ దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు విభజనకు సహకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్ పిలుపునకు కట్టుబడి సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలుగుజాతి విచ్ఛిన్నం జరిగేది కాదన్నారు. అక్కడోమాట, ఇక్కడో మాటా చెబుతున్న టీడీపీ కూడా రాష్ట్ర విభజన పాపం మూటకట్టుకుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి సమైక్యాంధ్ర ఉద్యమద్రోహిగా మిగిలిపోతారని, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన ఆయన రోడ్డుపైకి వస్తే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆందోళనలో పార్టీ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్, మారిశెట్టి భద్రం, నీలాద్రిరాజు, జీను మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, వెలిశెట్టి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ, సోమవరం రాజు, సుంకర సీతారామయ్య, అడబాల వెంకటేశ్వరరావు, కుదప శ్రీనివాస్, మారిశెట్టి పుండరీకాక్షుడు, రాయి సాయి, కింగం రమణ, నాళం గోపి, బోరా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల సహా 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నేటి బంద్‌కు సహకరించండి రాష్ర్ట విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జరపతలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా చేయి కలిపి పోరుబాటలో కలిసి రావాలని కోరారు. రాష్ర్ట చరిత్రలో దుర్దినం రాష్ర్ట చరిత్రలో ఇదొక దుర్దినం. కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది. ఈ నిర్ణయానికి రాష్ర్ట ముఖ్యమంత్రితో పాటు మొత్తం కేబినెట్ బాధ్యత వహించాలి. రాజకీయ కుట్రలో భాగంగా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. తమ మనోభావాలకు విరుద్ధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంటులో తెలంగాణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తారు. సమైక్యవాదులంతా చేయి కలిపి శుక్రవారం తలపెట్టిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేసి కేంద్రం కళ్లు తెరిపించాలి. కేంద్ర, రాష్ర్ట మంత్రులకు తగిన గుణపాఠం చెప్పాలి. - పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మెజార్టీ ప్రజల అభిమతానికి వ్యతిరేకం రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ తీర్పు వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారయ్యే ప్రమాదం ఉంది. మరో రాష్ట్రం ఏర్పడటంతో ఈ ప్రాంతంలో రైతులు పంటలు వదులుకునే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ తీర్మానం అవసరం లేదంటూ కేంద్రం సాంపద్రాయాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మార్చుకోవాలి. గతంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన సాంప్రదాయాలను పాటించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం చేస్తున్న బంద్‌కు ప్రతివారూ సహకరించాలి. - పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఫల్యమే.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం వరకూ వెళ్లింది. ఇది ముమ్మాటికీ వారి వైఫల్యమే. వారు ఎంతసేపూ ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టడానికే ప్రయత్నించారు తప్ప విభజనను అడ్డుకోలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయారు. సమైక్యాంధ్రను సమర్థిస్తున్నట్టు పదేపదే ప్రకటనలు చేసిన ఆయన ఆచరణలో తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోయారు. తెలంగాణ ప్రాంతపు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతల్లో ఉన్న చొరవ, ఐక్యత సీమాంధ్ర మంత్రులు, నాయకుల్లో లేవు. - కుడుపూడి చిట్టబ్బాయి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ప్రజలే తగిన బుద్ధి చెపుతారు రాష్ట్ర విభజనను ఆమోదించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రహీనమైపోయింది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ 200 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది. కేంద్ర మంత్రులు గబ్బిలాల్లా పదవులను పట్టుకుని వేలాడడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. సోనియా ఆడించమన్నట్టు తలలాడించిన ఈ నేతలు తెలుగుతల్లికి ఏం సమాధానం చెబుతారు? జగన్మోహన్రెడ్డి వంటి సమర్థుడైన నేత అధికారంలో లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుర్దశ పట్టింది. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి విభజనకు కారకులైన టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు బుద్ధి చెబుతారు. - జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు -
అవిశ్రాంత పోరు
సాక్షి, విజయవాడ : విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో సమైక్యవాదులు అవిశ్రాంత పోరు సాగిస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు అన్ని మండలాలు, గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూతబడ్డాయి. బ్యాంకులు తెరవలేదు. పోస్టల్ సేవలు అందలేదు. దీంతో ఆయా సంస్థల నుంచి ప్రజలకు సేవలు అందకపోవడంతో జనజీవనం స్తంభించింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జనజీవనం అంధకారంలో మగ్గిపోయింది. జనం ఉక్కపోతతో విలవిలలాడారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అనేకచోట్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణాలు, పల్లెల్లో జనం విలవిల్లాడారు. మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ కోత విధించారు. దీంతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లు విద్యుత్ లేక చాలాచోట్ల మొరాయించాయి. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో రోగులు విల విల్లాడారు. విద్యుత్ జేఏసీ నాయకులు ట్రాన్స్‌కో కార్యాలయాల వద్ద, ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అయినా సమైక్యం కోసం ఈ బాధలు పడడానికి సిద్ధమని... ప్రభుత్వం గద్దె దిగేవరకు తాము ఇబ్బందులు ఓర్చుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. రాధా దీక్ష భగ్నం... రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఎమ్మెల్యే విష్ణు దౌర్జన్యం సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని బెజవాడ బార్ అసోసియేషన్ సమైక్య జేఏసీ న్యాయవాదులు ఎమ్మెల్యే మల్లాది విష్ణును నిలదీశారు. ఈ సంఘటనతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే న్యాయవాదులపై తన ప్రైవేటు సైన్యంతో దౌర్జన్యానికి దిగారు. దీంతో తిరగబడ్డ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో బెజవాడ కోర్టుల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ ఎంపీ లగడపాటి కనబడటం లేదంటూ విద్యార్థి జేఏసీ, పొలిటికల్ జేఏసీ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అవనిగడ్డలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం ముందు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న దీక్షలు... కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 60వ రోజూ కొనసాగాయి. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 48వ రోజుకు చేరాయి. వేకనూరుకు చెందిన 70 మంది రైతులు దీక్షలో పాల్గొన్నారు. తొలుత వారు ట్రాక్టర్లతో వేకనూరు నుంచి అవనిగడ్డ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు దివిసీమలో ప్రభుత్వ రంగసంస్థలు బంద్ పాటించాయి. జేఏసీ నాయకులు బ్యాంకులు, ఎల్ఐసీ, టెలికాం, పోస్టాఫీస్‌లను మూసివేయించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తిరువూరులో రిలేదీక్షలు ఏడోరోజుకు చేరాయి. పార్టీ నాయకురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో కృష్ణా థియేటర్ సెంటర్లో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పామర్రు నాలుగురోడ్ల కూడలిలో బజ్జీలు వేసి నిరసన తెలిపారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 62వ రోజుకు చేరాయి. విద్యుత్ ఉద్యోగులు జంక్షన్‌రోడ్డులో ధర్నా నిర్వహించారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు కూర్చున్నారు. ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు లక్ష రూపాయల విలువైన బియ్యాన్ని పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 43వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. -
ఆగదు పోరాటం
తిరుపతి, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం తుది వర కు పోరు కొనసాగుతుందని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యమంలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయించారు. ఎస్వీయూ విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్నారు. గాదంకి రాడార్ స్టేషన్ (ఎన్ఏఆర్ఎల్)కు చెందిన బస్సు అద్దాలను పగులగొట్టారు. మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో తపాలా కార్యాలయాన్ని ముట్టడించారు. బ్యాంకులను మూసివేయించారు. బెంగ ళూరు రోడ్డులోని సెంట్రల్ సిల్క్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించి, మూసివేయాలని కోరారు. సిబ్బంది స్పందించకపోవడంతో రా ళ్లు రువ్వారు. భవనం అద్దాలు ధ్వంసమయ్యా యి. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, విద్యుత్ ఉద్యోగు ల దీక్షలు కొనసాగాయి. చిత్తూరులో ఉపాధ్యాయులు గాంధీ విగ్రహం వద్ద కూరగాయలు అమ్మి నిరసన తెలిపారు. ఎన్జీవోలు పట్టణంలోని బ్యాంకులను, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. చంద్రగిరిలో దీక్ష చేస్తున్న వారికి ప్రభుత్వ వైద్యులు మంగళవారం ఉదయం ఆరోగ్య పరీక్షలు చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న హరికృష్ణ, కిరణ్‌కుమార్(పీఈటీలు)ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్ష భగ్నం చేశారు. సిద్ధార్థ ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులు వంద మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రాపురం, నెన్నూరు, పీవీ పురం, కుప్పం బాదూరు, సూరావారిపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పలమనేరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, మూసివేయించారు. బ్యాంకులు, పోస్టాఫీసు లు మూతపడ్డాయి. కుప్పంలో ద్రవిడ యూని వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. కుప్పం జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు పాలార్ నదిని సందర్శించి, అది ఎండిపోతే తమ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రామకుప్పంలో సమైక్యవాదులు పోస్టాఫీస్, బ్యాంకు లు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను మూసివేయించారు. కొందరు బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. బి.కొత్తకోటలో ఉద్యో గ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తపాలా కార్యాలయం, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, మూసివేయించారు. పుత్తూరులో సాప్స్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు శీర్షాసనాలు వేసి నిరసన తెలిపారు. పీలేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, క్రాస్‌రోడ్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. సమైక్యపోరు 70 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 సంఖ్య ఆకారంలో కూర్చొని నిరసన తెలిపా రు. పీలేరులో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సోని యా, రాహుల్‌గాంధీ, సీమాంధ్ర మంత్రులకు సామూహిక సమాధి కట్టారు. -
విభజన ఆపితేనే ఉద్యమానికి విరామం
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటేనే ఉద్యమానికి విరామం ప్రకటిస్తామని సమైక్యవాదులు పేర్కొన్నారు. 44 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నా కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళనలు ఆపేది లేదని, జీతాలు, జీవితాలు త్యాగం చేసైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుంటామని వారు ప్రతినబూనారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. పెద్దాసుపత్రి వైద్యులు, సిబ్బంది రాస్తారోకో: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు విజయశంకర్, శంకరశర్మ, మనోరాజు, రామకృష్ణానాయక్, ఆయుర్వేద వైద్యులు నాగరాజు, హోమియో వైద్యులు రాజారాం, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జి. పుల్లారెడ్డి విద్యార్థుల భారీ ర్యాలీ: నగర శివారులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల నుంచి రాజవిహార్ సెంటర్ వరకు వారు ర్యాలీ కొనసాగించారు. శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల మూసివేత: ప్రైవేటు జూనియర్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య, నారాయణ జూనియర్ రెసిడెన్సియల్ కళాశాలలను మూ యించారు. డే స్కాలర్ మూసివేసినా రెసిడెన్సియల్ కళాశాలలు కొనసాగిస్తున్నారని తెలుసుకుని శుక్రవారం జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ నెల 17 వరకు కళాశాలలు మూసివేయాల్సిందేనని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ శేషిరెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, సెక్రటరి పుల్యాల రామచంద్రారెడ్డి, మొయినుద్దీన్ పాల్గొన్నారు. -
సమైక్యతే లక్ష్యంగా..
సాక్షి, రాజమండ్రి : పాలపొంగులా అణగిపోతుందన్న పాలకపక్షం అంచనాను తలకిందులు చేస్తూ సమైక్య ఉద్యమం నానాటికీ తీవ్రతరమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయంపై కన్నెర్రజేస్తున్న సమైక్యవాదులు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ విశ్రమించేది లేదంటున్నారు. శుక్రవారం జిల్లాలోని ఓఎన్జీసీ, రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి కే ంద్రాలను ముట్టడించారు. బీఎస్ఎన్ఎల్, తపాలా, ఎల్ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్, జీవిత బీమా, ఎఫ్‌సీఐ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలను స్తంభింపజేశారు. కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, రైతులు, ఉపాధి కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందిన సుమారు 5000 మంది ఉదయం ఓడలరేవులోని ఓఎన్జీసీ టెర్మినల్‌ను ముట్టడించారు. ప్లాంటు లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ప్లాంటు మూసివేసి సమైక్యాంధ్ర పరిరక్షణకు సహకరించాలని డిమాండ్ చేశారు. చర్చల అనంతరం చివరికి ఉత్పత్తి నిలిపివేస్తున్నట్టు అధికారులు లిఖితపూర్వకంగా ప్రకటించారు. మరోవైపు తాళ్లరేవు మండలం గాడిమొగలోని రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని సమైక్యవాదులు ముట్టడించి ఉత్పత్తి నిలుపు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ, కోనసీమ ప్రాంతాల నుంచి ప్లాంటు వద్దకు చేరుకుని సమైక్య నినాదాలు చేశారు. ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ప్లాంటులోని ‘ఎ’ షిఫ్టులో ఉత్పత్తి నిలుపు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పడంతో సమైక్యవాదులు వెనుదిరిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్లాంటులో ఉత్పత్తి నిలుపుచేశారు. కాగా ఈ నెల 16 నుంచి నిరవధికంగా ఉత్పత్తి నిలుపు చేసేలా ఈ ప్లాంటుపై ఒత్తిడి తెస్తామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. సమైక్యవాదులు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, కార్యకలాపాలను స్తంభింప చేశారు. రాజమండ్రిలో ఏపీఎన్జీఓలు ఓఎన్జీసీ, గెయిల్, సెంట్రల్ ఎక్సైజ్, ఎల్ఐసీ, బీఎస్ఎన్ల్, తపాలా శాఖ కార్యాలయాలను ముట్టడించి ఉద్యోగులను బయటికి పంపారు. ఎన్జీఓల సంఘం అధ్యక్షులు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ధవళేశ్వరంలో ఏపీఎన్జీఓలు ఓఎన్జీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. అమలాపురంలో ఆదాయపు పన్ను శాఖ, పోస్టాఫీసు, బీఎస్ఎన్ల్ కార్యాలయాలను ముట్టడించారు. ముమ్మిడివరంలో టెలిఫోన్ ఎక్సేంజి, పోస్టల్ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించి సమైక్య నినాదాలు చేశారు. సామర్లకోటలో భారత ఆహార సంస్థ కార్యాలయాన్ని, పెద్దాపురంలో జీవిత బీమా సంస్థ కార్యాలయాలను ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మూయించారు. ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. రాజమండ్రిలో విద్యుత్తు ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కార్యాలయం గేటుకు తాళం వేసి సమైక్య నినాదాలు చేశారు. ఓ పక్క అత్యవసర సర్వీసులను పర్యవేక్షిస్తూ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. బొమ్మూరు 220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. కాకినాడ రామారావుపేట విద్యుత్తు సబ్‌స్టేషన్ ఎదుట దీక్షలు చేపట్టారు. అమలాపురం డివిజన్‌కు చెందిన 200 మంది విద్యుత్తు ఉద్యోగులు కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. ఈదరపల్లి వంతెన వద్ద విద్యుత్తు ఉద్యోగులు రాస్తారోకోచేశారు. వీరికి ఆర్డీఓ సంపత్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానమహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెం వద్ద విద్యుత్తు శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేసి దీక్షల్లో పాల్గొన్నారు. రాజానగరంలో విద్యుత్తు ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో పాల్గొన్నారు. వారికి స్థానిక జేఏసీలతో పాటు రాజమండ్రి నుంచి మోటార్ సైకిళ్లపై విద్యుత్తు ఉద్యోగులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. విద్యుత్తు ఉద్యోగులు జగ్గంపేట సెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ప్రదర్శనలు, బంద్‌లు.. రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉద్యోగులు సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మన్న, శ్రీనాథ కవిసార్వభౌముడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి తదితర వేషధారణలతో సమైక్య నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అంబాజీపేటలో పదిమంది సర్పంచ్‌లు కళ్లకు గంతలతో జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్లో ఉపాధ్యాయుల జేఏసీ భిక్షాటన చేపట్టింది. పి.గన్నవరంలో భారీ జాతీయ పతాకంతో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. షణ్యుఖ, సీతారామ యోగ శిక్షణా కేంద్రాల అభ్యాసకులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు. వ్యాపార సంస్థలు, విద్యాలయాలను మూయించారు. రోడ్లపై ర్యాలీచేసి నినాదాలు చేశారు. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో బంద్ సందర్భంగా ప్రధాన కూడళ్లలో సమైక్యవాదులు రాస్తారోకోలు చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీ చేసి బంద్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతుగా పెద్దాపురంలో తోపుడు బండ్ల సంఘం రోడ్డుపై తోపుడు బండ్లు పెట్టి ఐదు గంటల పాటు రాస్తారోకో చేశారు. జేఏసీ పిలుపు మేరకు ఏలేశ్వరంలో 48 గంటల బంద్ కొనసాగుతోంది. అంతటా సమైక్య నాదమే రాజమండ్రిలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. కంబాలచెరువు వద్ద విద్యార్థులు ర్యాలీ చేసి సమైక్య నినాదాలు చేశారు. బొమ్మూరు పాలిటెక్నిక్ ఉద్యోగులు ఒక్కరోజు రిలే దీక్ష చేపట్టారు. మోరంపూడి సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు, జెడ్పీ సెంటర్లో రాస్తారోకో చేశారు. జేఏసీ శిబిరం వద్ద ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. అమలాపురం మండలం ఎన్.కొత్తపల్లిలో టైలర్లు ర్యాలీ చేసి జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. ఉప్పలగుప్తంలో వాయిద్య కళాకారులు రాస్తారోకో చేశారు. రాజోలులో ఎల్ఐసీ ఏజెంట్లు రిలే దీక్షలు ప్రారంభించారు. సఖినేటి పల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఉద్యోగులు కార్లు తుడిచి నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో టేకిశెట్టిపాలెంలో కొవ్వొత్తుల ప్రదర్శ చేశారు. తుని పట్టణంలో టాటా మేజిక్ వాహన నిర్వాహకులు ర్యాలీ చేసి చాంబర్ ఆఫ్ కామర్స్ జేఏసీ చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షా శిబిరాలను ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఆటో కార్మికులు రాస్తారోకో చేశారు. రౌతులపూడిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. జ గ్గంపేటలో వివేకానంద పాఠశాల విద్యార్థులు రోడ్డుపై డ్రిల్లు చేస్తూ సమైక్య నినాదాలు చేశారు. గోకవరంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులురోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. మండపేట కలువపువ్వు సెంటర్లో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకారంలో మానవ హారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. విద్యార్థిని సమైక్య పరుగు రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సునంద అనే విద్యార్థిని రామచంద్రపురం మండలం జువ్విపాడు నుంచి ఎల్ఐసీ భవనం వరకూ ఎనిమిది కిలోమీటర్లు సమైక్య పరుగు చేపట్టింది. ఆమెకు మద్దతుగా ఉపాధ్యాయులు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కె.గంగవరం మండలం కుందూరులో ఉపాధ్యాయులు పాదయాత్ర చేశారు. రాజవొమ్మంగిలో ఉపాధ్యాయులు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో ముస్లింలు వంటా వార్పూ చేపట్టారు. ఇంటింటా సమైక్య పతాకాలు ప్రతి ఇంటిపై సమైక్య జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంలో భాగంగా జేఏసీ రాజానగరం మండల కలవచర్ల నుంచి కార్యక్రమం ప్రారంభించింది. మహిళలు ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంటి ఇల్లాలికి బొట్టు పెట్టి వారికి సమైక్య పతాకాన్ని అందించారు. కలవచర్లలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని ముట్టడించి ప్రధాన గేటుకు తాళం వేశారు. సీతానగరం మండలం ముగ్గళ్లలో సమైక్యవాదులు వంటా వార్పూ చేపట్టారు. సీతానగరంలో కొనసాగుతున్న జేఏసీ రిలే దీక్షల్లో 9 మంది సర్పంచ్, ఉప సర్పంచ్‌లు దీక్షలు చేపట్టారు. -
జిల్లాలో 42వ రోజు కొనసాగిన సమైక్య ఉద్యమం
సాక్షి, తిరుపతి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని జి ల్లావ్యాప్తంగా సమైక్యవాదులు మంగళవారం వినూత్న తరహాలో ఆందోళనలు చేశారు. ఉద్యమం 42వరోజుకు చేరింది. పుంగనూరులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ వినాయకుని విగ్రహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహిం చారు. నివాసాల్లో పూజలు చేసిన వినాయకుని విగ్రహాలను రోడ్డుపై పెట్టి భారీ ప్రదర్శన చేసి, నిరసన తెలియజేశారు. 22 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరులో విద్యార్థులు తెలుగుతల్లి మాస్క్‌లతో గాంధీ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులు రాస్తారోకో, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస్టాండ్‌లో వివిధ క్రీడలు ఆడుతూ నిరసన తెలిపారు. పలమనేరులో ని వాసాల ముందు సమైక్య ముగ్గులు వేశారు. అనేక ప్రాం తాల్లో సమైక్య వినాయకుడిని ఏర్పాటు చేశారు. జేఏసీ దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు కోర్టు వద్ద యజ్ఞం చేశారు. రవీంద్ర భారతి విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో, మానవహారం నిర్వహించి మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయలు, విద్యార్థులు మానవహారం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి శివాలయంలో సమైక్యాంధ్ర కోసం ప్రత్యేక పూజలు చేశారు. వీ.కోటలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష, గణపతి పూజ చేశారు. వినాయకుని మాస్క్‌లతో నిరసన బెరైడ్డిపల్లిలో ఉపాధ్యాయులు వినాయకుని మాస్క్‌లు ధరిం చి ర్యాలీచేశారు. గంగవరంలో జాతీయ రహదారిని దిగ్బం ధించారు. కుప్పం, శాంతిపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ల రిలే దీక్షలు కొనసాగాయి. శాంతిపురంలో రహదారులను దిగ్బంధించారు. పుత్తూరులో ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మదనపల్లెలోని టౌన్‌బ్యాంక్ కూడలిలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు ఉరి వేసుకున్నట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ జూనియర్ క ళాశాలలు జేఏసీగా ఏర్పడి బెంగళూరు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. బాలికల జూనియర్ కళాశాల వారు వంటావార్పు చేశారు. మదనపల్లె రూరల్ మండలం బసినికొండ మహిళా సంఘాల వారు పట్టణం భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. నగరంలోని అన్ని దీక్ష శిబిరాల్లో వినాయకుని విగ్రహాలు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, నిరసన తెలియజేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులపై సమైక్యవాదులు బైఠాయించి, ధర్నా రాస్తారోకో కార్యక్రమా లు నిర్వహించారు. 16వరకు విద్యా సంస్థలు బంద్ ప్రయివేటు విద్యాసంస్థల యజమానులు బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు మూసేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డీవో, ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యం, సాప్స్ నాయకులు మంగళవారం రాత్రి సమావేశమై నిర్ణయించారు. అలాగే వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు కూడా బంద్ పాటించే విషయమై చర్చించారు. బుధవారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు.