తిరుపతి, న్యూస్‌లైన్:
సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం తుది వర కు పోరు కొనసాగుతుందని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యమంలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయించారు. ఎస్వీయూ విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్నారు. గాదంకి రాడార్ స్టేషన్ (ఎన్‌ఏఆర్‌ఎల్)కు చెందిన బస్సు అద్దాలను పగులగొట్టారు. మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో తపాలా కార్యాలయాన్ని ముట్టడించారు. బ్యాంకులను మూసివేయించారు. బెంగ ళూరు రోడ్డులోని సెంట్రల్ సిల్క్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించి, మూసివేయాలని కోరారు. సిబ్బంది స్పందించకపోవడంతో రా ళ్లు రువ్వారు. భవనం అద్దాలు ధ్వంసమయ్యా యి. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రెవెన్యూ, విద్యుత్ ఉద్యోగు ల దీక్షలు కొనసాగాయి. చిత్తూరులో ఉపాధ్యాయులు గాంధీ విగ్రహం వద్ద కూరగాయలు అమ్మి నిరసన తెలిపారు. ఎన్జీవోలు పట్టణంలోని బ్యాంకులను, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. చంద్రగిరిలో దీక్ష చేస్తున్న వారికి ప్రభుత్వ వైద్యులు మంగళవారం ఉదయం ఆరోగ్య పరీక్షలు చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న హరికృష్ణ, కిరణ్‌కుమార్(పీఈటీలు)ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్ష భగ్నం చేశారు. సిద్ధార్థ ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులు వంద మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రాపురం, నెన్నూరు, పీవీ పురం, కుప్పం బాదూరు, సూరావారిపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పలమనేరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, మూసివేయించారు. బ్యాంకులు, పోస్టాఫీసు లు మూతపడ్డాయి. కుప్పంలో ద్రవిడ యూని వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు.
కుప్పం జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు పాలార్ నదిని సందర్శించి, అది ఎండిపోతే తమ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రామకుప్పంలో సమైక్యవాదులు పోస్టాఫీస్, బ్యాంకు లు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలను మూసివేయించారు. కొందరు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. బి.కొత్తకోటలో ఉద్యో గ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తపాలా కార్యాలయం, బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, మూసివేయించారు. పుత్తూరులో సాప్స్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు శీర్షాసనాలు వేసి నిరసన తెలిపారు. పీలేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, క్రాస్‌రోడ్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. సమైక్యపోరు 70 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 సంఖ్య ఆకారంలో కూర్చొని నిరసన తెలిపా రు. పీలేరులో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో సోని యా, రాహుల్‌గాంధీ, సీమాంధ్ర మంత్రులకు సామూహిక సమాధి కట్టారు.
ఆగదు పోరాటం
Published Wed, Oct 9 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement