తిరుపతి,న్యూస్‌లైన్: విభజన కుట్రదారుల్లో ఒకరైన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రావడాన్ని సమైక్యవాదులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరు సాగిస్తున్న సమైక్యవాదులు గురువారం పలుచోట్ల డిగ్గీరాజా దిష్టిబొమ్మలను దహనంచేసి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మ సర్కిల్‌లో సమైక్యవాదులు దిగ్విజయ్ గోబ్యాక్..ఇటలీ సోనియా క్విట్ ఇండియా...జీఓఎం డౌన్ డౌన్ అంటూ నినాదాచేశారు.జేఏసీ గౌరవాధ్యక్షుడు మునిసుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు ప్రకాష్,ఆవుల ప్రభాకర్‌యాదవ్,లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరులో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనంచేశారు. అంతకు ముందు దిష్టి బొమ్మను కోడిగుడ్లు.టమాటాలతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం ఉద్యోగ జేఏసీ చైర్మన్ వరదారెడ్డి,బీసీ నాయకుడు అద్దాల నాగరాజు ఆధ ్వర్యంలో గోకుల్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక ్తం చేశారు.
మదనపల్లిలో జేఏసీ,మిట్స్ అధ్వర్యంలో సమైక్యవాదులు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.పలమనేరులో టీడీపీ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష కొనసాగించారు. కుప్పంలోసమైక్యవాదులు జేఏసీ ఆధ్వర్యంలో దిగ్విజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
దిగ్విజయ్ గోబ్యాక్
Published Fri, Dec 13 2013 3:25 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement
Advertisement