ఏలూరు, న్యూస్‌లైన్ :
సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం జిల్లాలో నిత్యనూతనమై ఉవ్వెత్తున సాగుతూనే ఉంది. ‘జై సమైక్యాంధ్ర’ అంటూ అన్నివర్గాల ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 52వ రోజైన శుక్రవారం కూడా వినూత్న నిరసనలతో విభజన నిర్ణయూనికి వ్యతిరేకంగా గర్జించారు. జిల్లా అంతటా బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, ఇన్‌కం టాక్స్, టెలిక ం, జాతీయ బ్యాంకులను ఎన్జీవోలు ముట్టడించి కార్యకలాపాలనుస్తంభింపచేశారు. బ్యాంకుల్లో రూ.250 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించారుు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో నాయీ బ్రాహ్మణులు దీక్షలు చేశారు.
దెందులూరు నుంచి రైతులు జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. రెండున్నర గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వంటావార్పు చేసి అన్నసమారాధన నిర్వహించారు. కొవ్వూరులో రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ మాదిగల ఆధ్వర్యంలో దండోరా కార్యక్రమం నిర్వహించారు. మంద కృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాళ్లపూడిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో మత్స్యకారులు, ఎన్జీవోలు గోదావరిలో పడవల యాత్ర నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో సమైక్యవాదులు, ఉపాధ్యాయుల జాతీయ రహదారిని దిగ్బం ధించి నిరసన తెలిపారు. ఉండి సెంటర్‌లో మహిళలు రోకళ్లు, రోళ్లతో పిండి దంచి వినూత్న నిరసన తెలిపారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పోడూరు మండలం జిన్నూరులో ఉపాధ్యాయులు మానహారం చేపట్టారు. తణుకులో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
ఉపాధ్యారుునులు బతుకమ్మ పండగ నిర్వహించగా, ఆర్టీసీ ఉద్యోగులు దుస్తులకు బదులు ఆకులను ధరించి ర్యాలీ చేశారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లోని కాలువలో విద్యార్థి జేఏసీ ఆధ్యర్యంలో మూడు గంటలపాటు జలదీక్ష చేపట్టారు. ఉంగుటూరులో ఎ.గోకవరం పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు తహసిల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో ఉద్యోగులు మోకాళ్లపై నడిచారు. నరసాపురం నియోజకవర్గ గౌడ సేవా సంఘం సభ్యులు కుటుంబాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గా సెంటర్ నుంచి ప్రకాశం రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. నరసాపురం సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు, పచ్చగడ్డి దుబ్బులతో మహిళలు ప్రదర్శన జరిపారు. నరసాపురం బార్ అసోసియేషన్‌కు చెందిన 45 మంది న్యాయవాదులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలకు రాజీనామా చేశారు. కేంద్ర మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో ఉపాధ్యాయులు 24 గంటల పల్లె మేలుకొలుపు దీక్ష చేపట్టారు.
విజయవాడ సదస్సుకు ఎన్జీవోలు
విజయవాడ స్వరాజ్య మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు జిల్లానుంచి ఎన్జీవోలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఏలూరు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలతోపాటు మండల ప్రధాన కేంద్రాల నుంచి 50 వాహనాల్లో విజయవాడ పయనమయ్యూరు.
వైసీపీ మండల కన్వీనర్ల ఆమరణ దీక్ష
గోపాలపురంలో గోపాలపురం, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండలాల వైసీపీ కన్వీనర్లు గెడా జగదీష్, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, బుసన బోయిన సత్యనారాయణ శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తోట గోపి చేపట్టిన పాదయూత్ర మూడో రోజుకు చేరింది. పోలీస్ ఐలండ్ సెంటర్‌లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నారుు. వీరవాసరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. నరసాపురంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 30వ రోజకు చేరాయి. హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా చింతలపూడిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.
నిత్య నూతనమై..
Published Sat, Sep 21 2013 2:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement