రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు  | In Road Accident 8 Members Were Injured | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు 

Published Fri, May 17 2019 10:39 AM | Last Updated on Fri, May 17 2019 10:39 AM

In Road Accident 8 Members Were Injured - Sakshi

తీవ్రంగా గాయపడ్డ రామాంజనేయులు

సాక్షి, గుత్తి రూరల్‌: జక్కలచెరువు శివారులో ఇసురాళ్లపల్లి క్రాస్‌ వద్ద 67వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం తిమ్మాపురానికి చెందిన రామాంజనేయులు, పెద్దొడ్డికి చెందిన వీరన్న, కోడలు సునీత, అనంతపురానికి చెందిన వాణి, కుమారుడు నరసింహ, కుమార్తె నందిని, రంగమ్మ, గుంతకల్లు మండల మొలకలపెంటకు చెందిన పార్వతి పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో జరిగే వివాహానికి గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ఆటో ఎక్కారు.

ఇసురాళ్లపల్లి క్రాస్‌ వద్ద వేగంగా వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడ్డ వారిలో రామాంజనేయులు మినహా అందరూ బంధువులు. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ రామాంజనేయులు, వాణి, వీరన్న, సునీతలను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement