పిఠాపురం, న్యూస్‌లైన్ : తెల్లవారకముందే వెళ్లి దైవదర్శనం చేసుకోవాలని బయలుదేరిన వారు శని వారం అర్ధరాత్రి పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 23 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు, బాధితుల బంధువులు తెలిపి న వివరాల ప్రకారం మండల కేంద్రమైన పెదపూడికి చెందిన గున్నం భద్రం కుటుం బ సభ్యులు మొక్కు తీర్చుకునేందుకు బంధువులతో కలసి మొత్తం 26 మంది ఒక ట్రాక్టర్‌పై తుని సమీపంలోని తలుపులమ్మ లోవకు బయలుదేరారు. ఆదివారం మరో శుభకార్యంలో పాల్గొనాల్సి ఉండడంతో తెల్లవారకముందే లోవ వెళ్లి త్వరగా తిరిగి రావాలని భావించారు. శని వారం రాత్రి పది గంటల సమయంలో ఒక ట్రాక్టరుపై పెదపూడి నుంచి తలుపుల మ్మ లోవకు బయలు దేరారు. వారి వాహ నం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పిఠాపురం బైపాస్ రోడ్డులో రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలోకి రాగానే కత్తిపూడి నుంచి కాకినాడ వైపు కంకర లోడుతో వస్తున్న లారీ అతి వేగంగా ఢీకొంది.
ట్రాక్టర్ ముందు భాగం నుజ్జునుజైంది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రగాయాలపాలయారు. సంఘటన స్థలానికి సమీపంలో ఒక శుభకార్యం జరుగుతుండడంతో ఆ కార్యక్రమంలోని యువకులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలపై ఆస్పత్రికి తరలించేం దుకు కృషి చేశారు. గున్నం పాపాయమ్మ (70) అక్కడికక్కడే మృతి చెందగా, బొడ్డు లోకేష్ (12) పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించే లోపు కన్నుమూశాడు. ఆర్.సూరిబాబు (55)ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బండారు రాజు, కాకర లోవ శుభాషిణి, గున్నం చిన వీర్రాజు, గున్నం లక్ష్మి, ఏ సత్యనారాయణ, కొంగర పాపారావు, పి సత్యనారాయణ, మాసిన సత్యవేణి, కోన శ్రీను, ఎస్. రామలక్ష్మి , బొడ్డు సురేఖ, జి. అనంతలక్ష్మి, కాకర గాయత్రి దేవి, సీహెచ్ లక్ష్మి ,కె.పద్మావతి, కాకర ఝాన్సీలక్ష్మి, ట్రాక్టరు డ్రైవరు ఎం.సత్తిబాబు, పందిరి వీరబాబు, నూనె వెంకటరావు, కె.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, గున్నం సత్యనారాయణ, పి.విజయలక్ష్మి, పి.సత్యప్రసాద్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
వీరంతా కాకినాడలో ప్రభుత్వాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం కారణంగా 216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొంత సేపు నిలిచి పోయింది. వంట చేసుకోవడానికి ట్రాక్టరుపై తీసుకు వెళుతున్న గ్యాస్ సిలిండర్ ఎగిరిపడినప్పటికీ అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం లో లారీ డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పిఠాపురం టౌన్ ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దైవదర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన
Published Mon, Sep 2 2013 3:22 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement