అనంతపురం జిల్లా చిలమత్తూరు జాతీయ రహదారిలోని చెక్‌పోస్టు వద్ద రోడ్లు భవనాల శాఖ స్థలంలో వెలిసిన ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు.
అనంతపురం : అనంతపురం జిల్లా చిలమత్తూరు జాతీయ రహదారిలోని చెక్‌పోస్టు వద్ద రోడ్లు భవనాల శాఖ స్థలంలో వెలిసిన ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. చెక్‌పోస్టు పరిసరాల్లోని ఆక్రమణలను పోలీసుల పర్యవేక్షణలో ఆర్ అండ్ బి అధికారులు శనివారం ఉదయం తొలగిస్తున్నారు. జేసీబీలను ఉపయోగించి భవనాలను కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
(చిలమత్తూరు )