chilamattur
-
ఏటీఎం కార్డు మారి.. రూ.57వేలు గల్లంతు!
చిలమత్తూరు (హిందూపురం) : ఒకరికి రావాల్సిన ఏటీఎం మరొకరికి వెళ్లింది. సదరు ఖాతాదారు ఏటీఎం కార్డుతో రూ.57వేలు డ్రాచేసేశారు. తమ ప్రమేయం లేకుండా నగదు గల్లంతవడంపై బాధితులు కంగుతిన్నారు. వివరాల్లోకెళితే.. చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన బి.ప్రభావతమ్మకు సిండికేట్ బ్యాంకులో ఖాతా (నంబర్ 31312250037750) ఉంది. ఇందులో రూ.57,700 నగదు ఉంది. వీరికి ఏటీఎం కార్డు ఇంకా రాలేదు. డబ్బు అవసరం కావడంతో భర్త రామాంజనేయులుతో కలిసి ఆమె సోమవారం బ్యాంకుకు వెళ్లారు. ఖాతాలో రూ.50 మాత్రమే ఉందని క్యాషియర్ చెప్పడంతో వారికి గుండె ఆగినంత పనైంది. వెంటనే బ్యాంకు మేనేజర్ శ్రీనాథ్‌ను కలిశారు. ఆయన స్టేట్మెంట్ తీసి చూడగా.. ఏటీఎం కార్డు ద్వారా రూ.57వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. అసలు తమకు ఏటీఎం కార్డే లేదు.. అలాంటపుడు ఎవరు, ఎలా డ్రా చేసి ఉంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులతో కలిసి బీసీ కాలనీకి వెళ్లి ఆరా తీశారు. ఇదే కాలనీలో మొరంపల్లి గ్రామం నుంచి వచ్చి నివాసముంటున్న ప్రభావతమ్మ, రామాంజి అనే పేర్లు కలిగిన దంపతులు ఉన్నారని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. వారికి వీరి ఏటీఎం కార్డు వెళ్లడంతో పొరబాటు జరిగి ఉంటుందని భావించారు. సదరు మహిళతో మాట్లాడగా.. ఏటీఎం కార్డు తన కుమారుడి వద్ద ఉందని తెలిపింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని బాధితురాలికి మేనేజర్ హామీ ఇచ్చారు. -
అదనపు కట్నం కేసులో 8 ఏళ్ల జైలు
చిలమత్తూరు : అదనపు కట్నం వేధింపులతోపాటు భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పరిగి మండలం కాలువపల్లికి చెందిన వి.హరికి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ జమాల్ బాషా గురువారం విలేకరులకు తెలిపారు. చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీలోని కంబాలపల్లికి చెందిన అలివేలమ్మతో హరికి 2013లో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని అలివేలమ్మ 2014 డిసెంబర్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలించి కోర్టు అభియోగాలు రుజువు కావడంతో హరికి ఎనిమిదేâýæ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
జాతీయ రహదారిలో ఆక్రమణల తొలగింపు
అనంతపురం : అనంతపురం జిల్లా చిలమత్తూరు జాతీయ రహదారిలోని చెక్‌పోస్టు వద్ద రోడ్లు భవనాల శాఖ స్థలంలో వెలిసిన ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. చెక్‌పోస్టు పరిసరాల్లోని ఆక్రమణలను పోలీసుల పర్యవేక్షణలో ఆర్ అండ్ బి అధికారులు శనివారం ఉదయం తొలగిస్తున్నారు. జేసీబీలను ఉపయోగించి భవనాలను కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చిలమత్తూరు ) -
వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో టైంబాంబు
-
వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో టైంబాంబు
అనంతపురం జిల్లాలో టైంబాంబు కలకలం సృష్టించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంట్లో ఈ టైంబాంబు మంగళవారం తెల్లవారుజామున బయటపడింది. ఈ ప్రాంతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వెంకట శివప్పను హతమార్చేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులే ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తన స్వగ్రామమైన బండ్లపల్లిలోని ఇంట్లో ఉన్న శివప్ప, మంగళవారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో మోటార్ ఆన్ చేసేందుకు బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఇంట్లో టైం బాంబు ఉన్న విషయాన్ని ఆయన గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిలమత్తూరు నుంచి పోలీసులు వచ్చారు. వెంటనే బాంబు నిర్వీర్యదళాన్ని పిలిపించి, ఆ టైంబాంబును నిర్వీర్యం చేయించారు. శివప్ప ప్రత్యర్థులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.