చిలమత్తూరు : అదనపు కట్నం వేధింపులతోపాటు భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పరిగి మండలం కాలువపల్లికి చెందిన వి.హరికి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ జమాల్ బాషా గురువారం విలేకరులకు తెలిపారు. చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీలోని కంబాలపల్లికి చెందిన అలివేలమ్మతో హరికి 2013లో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని అలివేలమ్మ 2014 డిసెంబర్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలించి కోర్టు అభియోగాలు రుజువు కావడంతో హరికి ఎనిమిదేâýæ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.