అనంతపురం జిల్లాలో టైంబాంబు కలకలం సృష్టించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంట్లో ఈ టైంబాంబు మంగళవారం తెల్లవారుజామున బయటపడింది. ఈ ప్రాంతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వెంకట శివప్పను హతమార్చేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులే ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తన స్వగ్రామమైన బండ్లపల్లిలోని ఇంట్లో ఉన్న శివప్ప, మంగళవారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో మోటార్ ఆన్ చేసేందుకు బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఇంట్లో టైం బాంబు ఉన్న విషయాన్ని ఆయన గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిలమత్తూరు నుంచి పోలీసులు వచ్చారు. వెంటనే బాంబు నిర్వీర్యదళాన్ని పిలిపించి, ఆ టైంబాంబును నిర్వీర్యం చేయించారు. శివప్ప ప్రత్యర్థులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో టైంబాంబు
Published Tue, May 27 2014 12:11 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
Advertisement