పంట కాలువలో లారీ బోల్తా | Lorry roll over in Canal crop | Sakshi
Sakshi News home page

పంట కాలువలో లారీ బోల్తా

Published Wed, Oct 23 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

Lorry roll over in Canal crop


 నక్కపల్లి న్యూస్‌లైన్: జాతీయ రహదారిపై గొడిచర్ల వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసుల కథనం ప్రకారం విజ యవాడ నుంచి విశాఖ వైపు కాగితాల లోడుతో వెళ్తున్న లారీ ముందువెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గొడిచర్ల కూడలి వద్ద ఉన్న పంటకాలువలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన లారీ డ్రయివర్ జె.నాగేశ్వరరావు (38) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి మరణించాడు. బోల్తా పడుతున్నప్పుడు లారీ సమీపంలో బహిర్భూమికి వచ్చిన ముత్తిన వెంకటరమణ(32)ను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన డ్రయివర్ సోదరుడైన క్లీనర్ వెంకటదుర్గారావును తుని ఏరి యా ఆస్పత్రికి తరలించారు. డ్రయివర్ నిద్రమత్తులో ఉండ టం వల్ల లారీ అదుపు తప్పి పంటకాలువలోకి బోల్తా పడినట్టు తెలిసింది. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రయివర్ మృతదేహాన్ని బయటికి తీసేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు.
 
 చుట్టం చూపుగా వచ్చి మృత్యువాత
 ప్రమాదంలో మరణించిన వెంకటరమణది తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి మండలం సీతయ్యపేట గ్రామం.  భార్యాపిల్లలతో గొడిచర్లలో తోడల్లుడి ఇంటికి శనివారం వచ్చాడు. మంగళవారం వేకువజామున జాతీయరహదారిని ఆనుకుని పంటకాలువ వద్దకు బహిర్భూమికి వచ్చి లారీ ఢీకొని మృత్యువాత పడ్డాడు. స్వగ్రామానికి బుధవారం వెళ్లాల్లి ఉందని బందువుల చెబుతున్నారు. వెంకటరమణకు భార్య, అయిదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మరణంతో చిన్నారులను ఎలా పెంచాలని అతని భార్య సంఘటన స్థలం వద్ద రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌చార్జి ఎస్‌ఐ జి.ప్రేమ్‌కుమార్ విలేకరులకు తెలిపారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement