నక్కపల్లి, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళవారం రహదారుల దిగ్బంధం చేపట్టాయి. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో జాతీయరహదారితోపాటు వివిధ రోడ్లపై ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు సమన్వయకర్తలు, వివిధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రహదారుల దిగ్బంధనాన్ని జయప్రదం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త చెంగలవెంకటరావు, డీసీసీబీ మాజీడైరక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో నక్కపల్లి జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. నక్కపల్లి ,పాయకరావుపేట మండలాలకు చెందిన వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు నాయకులు, కార్యకర్తలు జాతీయరహదారిపై ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గంటపాటు బైఠాయించారు.
పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఇందులో పాల్గొన్నారు. నినాదాలతో జాతీయరహదారి హోరెత్తింది. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద జాతీయరహదారిపై కూడా ఆందోళన చేపట్టారు. ఎల మంచిలి నియోజకవర్గ నాయకుడు బోదెపు గోవింద్, తదితరులు పాల్గొన్నారు. యల మంచిలి నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డే డ ప్రసాద్ ఆధ్వర్యంలో పూడిమడక వద్ద జాతీయ రహదారిపై మునగపాక నుంచి ర్యాలీ చేపట్టారు. సుమారు 45 నిముషాల పాటు దిగ్బంధం చేశారు. రాంబిల్లిలో చంటిరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టా రు. అంతకు ముందు రోడ్డుపై బైటాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశా రు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కశింకో ట వద్ద జాతీయరహదారిపై జిల్లా కన్వీనర్ వెంకట్రావుతోపాటు కార్యకర్తలు రాస్తారోకో,మానవహారం చేపట్టారు.
సైకిల్ తొక్కారు. జగన్మోన్‌రెడ్డి, వైఎస్సార్‌కు అనుకూలంగా, కేసీఆర్,సోనియాగాంధీలకు వ్యతిరేకంగానూ నినాదాలు చేశారు. చోడవరంలో నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు పి.వి.ఎస్.ఎస్.రా జు తోపాటు రోలుగుంట మండల మాజీ ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి శ్రీనివాసరావు, అంకుపాలెం ఎంపీటీసీ మాజీ సభ్యుడు ము త్యాలనాయుడు ఆమరణదీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని జిల్లా కన్వీనర్‌తోపాటు చోడవరం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ప్రారంభించారు. అనంతగిరి మండలకేంద్రంలో పా ర్టీ నాయకులు శెట్టి ఆనంద్, వీరాస్వామి, రామస్వామిల ఆధ్వర్యంలో రహదారిపై ఆం దోళన చేపట్టారు. చింతపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. జల్లి సుధాకర్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. విగ్రహాల జంక్షన్ వద్ద వినూత్నంగా మోకాళ్లపై మానవహారం చేపట్టారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు సంఘీభావం
Published Wed, Aug 28 2013 3:31 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement