మిచిగాన్ : ఓ ఇద్దరు యువకులు చేసిన అల్లరి పనికి మిచిగాన్ హైవేపై వెళుతున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రచార ప్రదర్శనలు రావాల్సిన బిల్‌బోర్డుపై బూతు చిత్రాలేంటని ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మిచిగాన్ నేషనల్ హైవేపై బైకుమీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బిల్‌బోర్డును కంట్రోల్ చేసే గది దగ్గరకు వెళ్లారు. తమ సెల్‌ఫోన్‌లో ఉన్న పోర్న్ వీడియో బిల్‌బోర్డు తెరపై వచ్చేలా చేశారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న బిల్‌బోర్డు తెరలపై పోర్న్ వీడియోలోని దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో హైవేపై వెళుతున్న వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్కడినుంచి వెళ్లిపోతూ ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఆ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బిల్‌బోర్డుపై దాదాపు 17 నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రదర్శితమయ్యాయి. ఇది గమనించిన పోలీసులు సంబంధిత వ్యక్తులను అలర్ట్ చేశారు. వారు వెంటనే వీడియోలను నిలిపివేశారు. బిల్‌బోర్డ్ గది సీసీ టీవీ ఫొటేజ్‌ల ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment