Billboard
-
ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
ముంబై: మహారాష్ట్ర రాజధానిలో ఇటీవల కుప్పకూలిన హోర్డింగ్ ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఘాట్కోపర్ వద్ద కూలిన బిల్ బోర్డ్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా శిథిలాలను తొలగిస్తుండగా మరో రెండు మృతుదేహాలు లభ్యమయ్యాయి. రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ మనోజ్ చన్సోరియా(60), ఆయన భార్య అనిత(59)గా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.కాగా ముంబైలోని ఘాట్కోపవర్ వద్ద ఈదురుగాలులతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంప్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 100 మంది హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఈ వృద్ధ దంపతులు కూడా ఉన్నారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.ముంబయి ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే మార్చిలో పదవీ విరమణ పొందారు. తర్వాత వారు ముంబైని వీడి, జబల్‌పుర్‌కు మారారు. వీసా పనుల నిమిత్తం వారు ముంబై వచ్చారు. పని పూర్తవడంతో జబల్‌పుర్‌కు తిరిగి ప్రయాణం చేస్తుండగా కారులో పెట్రోల్ కొట్టించేందుకు బంక్ వద్ద ఆగారు. ఆ సమయంలో హోర్డింగ్ రూపంలో మృత్యువు వారిని కబళించింది.అమెరికాలో నివసిస్తున్న వారి కుమారుడు తల్లిదండ్రులకు కాల్ చేయగా.. సమాధానం రాకపోవడంతో సాయం కోసం బంధువులను సంప్రదించాడు. వారు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయగా చివరి లోకేషన్ ఘాట్కోపర్ పెట్రోల్ పంప్ వద్ద చూపించింది.బందువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించగా.. దంపతుల మృతదేహాలు వెలుగుచూశాయి. శిథిలాల నుండి అన్ని మృతదేహాలను బయటకు తీయడంతో ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ 40x40 అడుగుల కంటే పెద్ద హోర్డింగ్‌లను అనుమతించనప్పటికీ, ఈ హోర్డింగ్ మూడు రెట్లు పెద్దది. 120x120 అడుగుల విస్తీర్ణం, 250 టన్నుల బరువు కలిగి ఉంది. బిల్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కేసు నమోదైంది. భిండేపై గతంలో అత్యాచారం సహా 20కి పైగా పోలీసు కేసులు ఉన్నట్లు తేలింది.కాగా పెట్రోల్ పంప్ మీద కూలిన హోర్డింగ్‌కు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈదురుగాలులతో పెట్రోల్ పంప్ ముందు నెమ్మదిగా వెళ్తున్న ఓ కారులోనుంచి ఈ వీడియో రికార్డ్ చేశారు. రోడ్డుపై భారీ వర్షం, గాలులు వీస్తుండగా కారులోని విండో నుంచి వీడియో తీశారు. ఇంధనం కోసం, వర్షం నుంచి తప్పించుకోవడానికి అనేక కార్లు, ట్రక్కులు, బైక్‌లు పెట్రోల్ పంపు వద్ద నిలిపి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో బిల్బోర్డ్ అమాంతం పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది. -
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్(చెక్ బౌన్స్) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్‌లు,బ్యానర్లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్కోపర్లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్ బోర్డ్ పక్కనే ఉ న్న పెట్రోల్ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
Taylor Swift: 14 స్పాట్లలో టాప్‌లో తొలి ఆర్టిస్ట్‌గా.. రికార్డుల సునామీ!
‘బిల్బోర్డ్ హాట్ 100 చాట్‌లో 14 స్పాట్లలో టాప్‌లో నిలిచిన తొలి ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టించింది పాప్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్. టేలర్ లేటెస్ట్ ఆల్బమ్ ‘ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్’లోని 14 ట్రాక్స్ ‘బిల్బోర్డ్’లోని 14 స్పాట్స్‌లో టాప్‌లో నిలిచాయి.‘ఫోర్ట్‌నైట్’ ‘మై బాయ్ వోన్లీ బ్రేక్స్’ ‘సో లాంగ్, లండన్, ఫ్రెష్ ఔట్ ది స్లమ్మర్, ది టార్చర్డ్ పోయేట్స్ డి, డౌన్ బ్యాడ్, బట్ డ్యాడీ ఐ లవ్ హిమ్, ఫ్లోరిడాలాంటి సాంగ్స్ ఇందులో ఉన్నాయి.ఈ నెల 19న విడుదల అయిన ‘ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్’ అమ్మకాలల్లో రికార్డ్ సృష్టించింది. స్పాటిఫైలో హైయెస్ట్ సింగిల్–డే గ్లోబల్ స్టీమ్స్ ఆల్బమ్‌గా నిలిచింది. యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్‌లోనూ ఈ ఆల్బమ్ హవా కొనసాగింది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ అరుదైన ఘనత
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించింది. విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్టివ్ బిల్‌బోర్డ్‌ను ఆవిష్కరించడంతో ఈ ఘనతను సాధించింది. 'మేఘ్ సంతూర్' పేరుతో 2250 చదరపు అడుగుల బిల్‌బోర్డ్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు. 50 మంది నిపుణుల బృందంతో 6 నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన ఈ బిల్ బోర్డ్ విజయవాడ నగర వాసుల్ని సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టేలా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దీంతో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తాజ్ మహల్ టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అందించారు. -
ట్వింకిల్ ట్వింకిల్ సూపర్‌స్టార్
మహేష్ బాబు–నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కూతురు సితార న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసి నెటిజనులను కనువిందు చేసింది. ఒక జ్యుయెలరీ యాడ్‌లో సితార నటించింది. ఆ యాడ్‌కు సంబంధించిన చిత్రాలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ‘సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫైర్ క్రాకర్’ అంటూ మహేష్‌బాబు సితార చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘పదాలలో చెప్పలేని సంతోషం ఇది. కీప్ షైనింగ్ మై సూపర్ స్టార్’ అంటూ స్పందించింది నమ్రతా శిరోద్కర్. చిన్న వయసులోనే యూ ట్యూబ్ చానల్ మొదలు పెట్టి ‘ఆహా!’ అనిపించిన సితార చక్కని డ్యాన్సర్ కూడా. ‘ఫ్రోజెన్–2’ సినిమా తెలుగు వెర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్–వోవర్ ఇచ్చింది. జ్యుయలరీ బ్రాండ్ ‘పీఎంజే’కు సితార బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో యంగెస్ట్ స్టార్ కిడ్‌గా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది. -
ఉత్తమ చిత్ర పురుషోత్తమన్
న్యూయార్క్‌లోని టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించిన ఆ ఆర్ట్‌వర్క్ ప్రేక్షకులను బాగా ఆట్టుకుంటుంది. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకొంటూ ‘వావ్’ అన్నారు. ప్రేక్షకులే కాదు కళావిమర్శకులు కూడా ‘బ్రహ్మాండం’ అన్నారు. ఆ ఆర్ట్‌వర్క్‌ను సృష్టించింది బెంగళూరుకు చెందిన అజయ్ పురుషోత్తమన్... బెంగళూరులోని ఒక ఎడ్వర్టైజింగ్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ పురుషోత్తమన్‌కు చిన్నప్పుడు చాలామంది పిల్లలలాగే బొమ్మలు వేయడం అంటే ఇష్టం. కార్టూన్ క్యారెక్టర్లు అంటే బోలెడు ఇష్టం. తన అభిమాన క్యారెక్టర్లను గీయడంలో ప్రాక్టిస్ చేస్తుండేవాడు. ఈ ఆసక్తి స్కూల్ రోజుల నుంచి కాలేజి రోజుల వరకు వచ్చింది. 2డీ ఆర్ట్, త్రీడి ఆర్ట్‌లతో ప్రయోగాలు చేస్తుండేవాడు. తనకు తెలిసిన కథలను యానిమేషన్ మరియు త్రీడి మోడలింగ్‌లోకి తీసుకువచ్చాడు. ఎన్నో సొంత ప్రాజెక్ట్‌లు చేసేవాడు. న్యూయార్క్‌లో జరిగే ‘ఎన్ఎఫ్టీ ఎన్వైసీ’ ప్రదర్శన ‘ఎన్ఎఫ్టీ’పై ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే వేదిక. ఈ ఉత్సవానికి అజయ్ హాజరు కానప్పటికీ అతడి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ప్రశంసలు అందుకున్నాయి. ‘మన ఆర్ట్‌ను ప్రపంచ వేదిక మీదికి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటాడు అజయ్. న్యూయార్క్ టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై తన ఆర్ట్‌వర్క్ ప్రదర్శించడం అజయ్ పురుషోత్తమన్‌ని ఎంతో సంతోషానికి గురిచేసింది. మొదట దీని గురించి విన్నప్పుడు ‘కలా నిజమా!’ అనుకున్నాడు. ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాలనుకున్నాడు. సన్నిహితుల సహాయంతో న్యూయార్క్‌కు వెళ్లి ‘ఇంతకు మించిన ఆనందం ఏమున్నది!’ అనుకున్నాడు. గత సంవత్సరం అజయ్ మొదలుపెట్టిన ‘టాయ్ స్టోరీస్ ప్రొఫైల్’ చాలామందిని ఆకట్టుకుంది. ఈ యానిమేషన్ సిరీస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక హిప్–హప్ పాటకు డ్యాన్స్ చేస్తాడు. ‘షోలే’ సినిమాలోని క్యారెక్టర్లు అన్నీ కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తాయి! నిజజీవితంలోని ప్రముఖ వ్యక్తులు ఈ సిరీస్‌లోని క్యారెక్టర్లు. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే వెబ్3, ఎన్ఎఫ్టీకి సంబంధించి ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ కోసం అర్జెంటీనా ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ‘ఇది సవాళ్లతో కూడిన ప్రయాణం’ అంటున్నాడు అజయ్. సాధారణ ఆర్టిస్ట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న అజయ్ పురుషోత్తమన్ ఆ సవాళ్లను అధిగమించి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. మోస్ట్ పాపులర్ నాన్–ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)లు చిత్రకళ, సంగీతం, క్రీడా ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని, ట్రెండ్‌ను అందిపుచ్చుకొని మన దేశంలోని ‘మోస్ట్ పాపులర్ ఎన్ఎఫ్టీ క్రియేటర్’లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ పురుషోత్తమన్. తనకు వచ్చే కంటెంట్ ఐడియాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ మొదలుపెట్టాడు. తనలోని సృజనకు సంబంధించి అవతలి కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. తాను రూపొందించిన ఎన్ఎఫ్టీలను రకరకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకం మొదలు పెట్టాడు. తన ఆర్ట్ మన దేశానికి మాత్రమే పరిమితం కావాలని అజయ్ అనుకోలేదు. ‘అక్కడ ఏం జరుగుతుంది’ అంటూ అంతర్జాతీయ ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. ట్రెండ్ ఏమిటో తెలుసుకున్నాడు. హాలివుడ్ కలెక్షన్స్‌కు శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన గాయకుల త్రీడీ బాటిల్ ఆర్ట్‌ను రూపొందించాడు. ప్రయాణాలు అంటే అజయ్‌కు ఇష్టం. ఎందుకంటే స్థానిక సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నది తన కళలోకి వచ్చి చేరుతుంది. బలాన్ని ఇస్తుంది. -
ఉద్యోగం కావాలంటూ ఏకంగా హోర్డింగ్నే ఏర్పాటు చేశాడు.. అయినా..?
డబ్లిన్: ఐర్లాండ్‌కు చెందిన క్రిస్ హార్కిన్ అనే నిరుద్యోగి.. తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ వినూత్నంగా అభ్యర్ధించిన ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన 24 ఏళ్ల క్రిస్ 2019 సెప్టెంబర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాటి నుంచి వందల సంఖ్యలో ఇంటర్వ్యూలకు వెళ్లిన క్రిస్‌కు అన్నీ చోట్ల మొండిచెయ్యే ఎదురైంది. దీంతో విసుగెత్తిపోయిన క్రిస్.. ఇలా అయితే కాదని వినూత్నంగా ఉద్యోగ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. 400 డాలర్లు ఖర్చు పెట్టి ఓ ప్రాంతంలో హోర్డింగ్ ఏర్పాటు చేయించాడు. ఆ హోర్డింగ్‌పై ప్లీజ్ హైర్ మీ అని పెద్ద అక్షరాలతో రాయించి దాని కింద తన అర్హతలు, తన ఫోటో, వ్యక్తిగత వివరాలు, తాను ఏ రంగంలో ఉద్యోగం ఆశిస్తున్నాడో వాటి వివరాలు పొందుపరిచాడు. ఇంతటితో ఆగని క్రిస్.. ఎలాగైనా ఉద్యోగం రాకపోదా అని, ఈ తతంగం మొత్తాన్ని యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేశాడు. కానీ, ఇంత చేశాక కూడా క్రిస్‌కు ఉద్యోగం రాలేదు. ఇలా దాదాపు 2 వారాలు వేచి చూసిన క్రిస్.. ఏ ఉపయోగం లేకపోవడంతో తన వినూత్న ఉద్యోగ ప్రయత్నానికి స్వస్థి పలికాడు. బిల్ బోర్డు(హోర్డింగ్) ఖర్చు భరించే స్తోమత లేకే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కాగా, క్రిస్‌కు ఈ ఐడియాను సోషల్ మీడియా మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరి ఇచ్చిందట. చదవండి: Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే.. -
చిరకాల కోరిక నెరవేర్చుకున్న టాప్ సింగర్
అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్‌రైటర్ పోలో జీ ‘ర్యాప్‌స్టార్’ సాంగ్ బిల్బోర్డ్ హాట్ 100 సాంగ్స్ చార్ట్‌లో నెంబర్‌వన్ ఘనతను సాధించింది. ఫైనర్ థింగ్స్(2018) సింగిల్‌తో వెలుగులోకి వచ్చాడు పోలో జీ. ఇది బిల్‌బోర్డ్‌లో ‘11’వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత వచ్చిన డై ఏ లెజెండ్ (2019) ‘6’వ స్థానంలో నిలిచింది. ఇక ‘ది గోట్’ రెండో స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం ట్రాప్ జానర్లో వచ్చిన ‘ర్యాప్‌స్టార్’తో మొదటిస్థానంలో నిలిచి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు పోలో జీ. ఈ నెల 9న కొలంబియా రికార్డ్స్ ద్వారా విడుదలైన ర్యాప్‌స్టార్ సాంగ్ ‘ప్రతిరోజూ ఒక యుద్ధమే’ అంటోంది. మన ఆలోచనల నుంచి అలవాట్ల వరకు ఎన్నో యుద్ధాలు అవి! ‘మోడ్రన్ మ్యూజిక్‌లో పోలో జీ స్ట్రాంగెస్ట్ స్టోరీ టెల్లర్’ అంటున్నారు సంగీతకారులు. చదవండి: 'రాజా రవి వర్మ'..వాళ్లను ఊహించుకొని పెయింటింగ్స్ వేసేవారట -
ఇది నిజంగా హైదరాబాద్‌లో జరిగిందా?
-
ఇది నిజంగా హైదరాబాద్‌లో జరిగిందా?
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న బిల్‌బోర్డు అమాంతం ఊడిపడి వాహనదారులపై పడింది. ఈ ప్రమాదంలో వేర్వేరు బైకులపై వస్తున్న ఇద్దరు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇది హైదరాబాద్‌లో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భయంకర ఘటన మెహదీపట్నంలో జరిగిందంటూ ఓ ఫేస్బుక్ యూజర్ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో అనేకమంది ఈ వీడియోను హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదం అంటూ షేర్ చేస్తున్నారు. (లాప్టాప్ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..) అయితే ఈ వార్తలో నిజం లేదు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిందని తేలింది. ఆగస్టు 6న కరాచీలోని మెట్రోపోల్ హోటల్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని 'ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఆ నగరంలోని బిల్‌బోర్డులను తొలగించాలని కరాచీ కమిషనర్ కార్యాలయం అధికారులను ఆదేశించింది. మరోవైపు తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సైతం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ఈ వీడియో హైదరాబాద్‌లో జరగలేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. (నదిలో లక్ష లింగాలు: నిజమేనా?) వాస్తవం: ఈ భయానక ప్రమాదం హైదరాబాద్‌లో చోటు చేసుకోలేదు. -
మోహన్ బగాన్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో ఇప్పటికీ ఫుట్‌బాల్‌ను బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక మోహన్ బగాన్ క్లబ్ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌లో ‘నాస్డాక్’ బిల్‌బోర్డులపై క్లబ్ లోగోను, టీమ్ రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత్ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా ఇలా ‘నాస్డాక్’ బిల్‌బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జులై 29ని ‘మోహన్ బగాన్ డే’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఏర్పాటు చేశారు. 1911లో ఇదే రోజు ప్రతిష్టాత్మక ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో భాగంగా మోహన్ బగాన్ 2–1తో బ్రిటిష్‌కు చెందిన ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్ జట్టును ఓడించింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో దక్కిన ఈ గెలుపునకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత లభించింది. తమ జట్టుకు తాజాగా దక్కిన గౌరవంపట్ల మోహన్ బగాన్ యాజమాన్యం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టు ఎంతో ప్రత్యేకమైందో ఇది చూపించిందని అభిమానులు ఆనందం ప్రదర్శించారు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా దీనిపై అభినందనలు తెలపడం విశేషం. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బిల్‌బోర్డుపై కనిపించిందంటే అది ఒక క్లబ్ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్‌కు అమితంగా మద్దతిచ్చే క్లబ్‌లలో ఒకటైన మోహన్ బగాన్‌ను అభినందనలు’ అని ‘ఫిఫా’ ట్వీట్ చేసింది. -
నేషనల్ హైవేపై పోర్న్ వీడియో..
మిచిగాన్ : ఓ ఇద్దరు యువకులు చేసిన అల్లరి పనికి మిచిగాన్ హైవేపై వెళుతున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రచార ప్రదర్శనలు రావాల్సిన బిల్‌బోర్డుపై బూతు చిత్రాలేంటని ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మిచిగాన్ నేషనల్ హైవేపై బైకుమీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బిల్బోర్డును కంట్రోల్ చేసే గది దగ్గరకు వెళ్లారు. తమ సెల్ఫోన్లో ఉన్న పోర్న్ వీడియో బిల్‌బోర్డు తెరపై వచ్చేలా చేశారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న బిల్‌బోర్డు తెరలపై పోర్న్ వీడియోలోని దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో హైవేపై వెళుతున్న వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్కడినుంచి వెళ్లిపోతూ ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఆ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిల్‌బోర్డుపై దాదాపు 17 నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రదర్శితమయ్యాయి. ఇది గమనించిన పోలీసులు సంబంధిత వ్యక్తులను అలర్ట్ చేశారు. వారు వెంటనే వీడియోలను నిలిపివేశారు. బిల్బోర్డ్ గది సీసీ టీవీ ఫొటేజ్ల ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
వేదిక మీద ముద్దు.. వైరల్ వీడియో
హాలీవుడ్ హాట్ కపుల్ ప్రియాంకచోప్రా, నిక్ జోనస్ మధ్య అనుబంధం రోజురోజుకు పెనవేసుకుంటోంది. ఈ జంట ఎక్కడ ఉన్నా.. అందరి చూపులు వారిపైనే. తాజాగా జరిగిన బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకకు వీరు జంటగా వచ్చారు. ఈ సందర్భంగా జోనస్ బ్రదర్స్ బిల్బోర్డ్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టేజ్ మీద ఆడిపాడుతున్న సమయంలో అనూహ్యంగా భార్య ప్రియాంక వేపు వచ్చిన నిక్ జోనస్.. ఆమె వైపు బెండై అలా అలవోకగా ఒక కిస్ ఇచ్చారు. వీరి మధ్య ప్రణయబంధాన్ని చాటే ఈ ముద్దు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేడుకలో ప్రియానిక్ జంట సందడి చేసింది. జోనస్ కుటుంబసభ్యులైన కెవిన్ జోనస్ భార్య డానియెల్ జోనస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి సోఫీ టర్నర్, ప్రియాంక అత్త డెనిస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన నిక్.. ‘మై వైఫ్ ఈజ్ హాట్’ అంటూ కామెంట్ పెట్టారు. View this post on Instagram The Jonai in Vegas. 😎 A post shared by Nick Jonas (@nickjonas) on May 1, 2019 at 6:21pm PDT View this post on Instagram 💎✨💎✨ A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on May 1, 2019 at 8:25pm PDT -
బిల్‌బోర్డులో బ్లూ ఫిల్మ్.. భారీ ట్రాఫిక్ జాం
మనీలా : పిలిప్పీన్స్‌లోని ఓ ప్రముఖ వాణిజ్య పట్టణంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మకాటి నగరంలోని రద్దీగా ఉన్న ఓ రోడ్డు పక్కనే ఉన్న బిల్ బోర్డులో అనూహ్యంగా అశ్లీల చిత్రం ప్రసారం అయింది. దాదాపు అరనిమిషంపాటు ఇది ప్రసారం కావడంతో వాహనదారులు నిర్ఘాంతపోయారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్షణాల్లో ఈ విషయం నగర మేయర్‌కు తెలిసి దానిని అప్పటికప్పుడు నిలుపుదల చేయించారు. అయితే, అప్పటికే ఆ దృశ్యాలను వివిధ వాహనాల్లో వెళుతున్న వారు తమ ఫోన్లలో బందించడంతో ఇప్పుడవి వైరల్‌గా మారాయి. దీనిపై మకాటి మేయర్ వివరణ ఇస్తూ అనుకోకుండా ఈ సంఘటన జరిగిందని, తాము దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఆ బిల్బోర్డును పనిచేయకుండా ఆపేశామని, అయితే, అప్పటికే వాహనదారులు తమ ఫోన్లలో వాటిని బందించడంతో వైరల్ అయ్యాయని చెప్పారు. దర్యాప్తులో బిల్ బోర్డు యజమాని పేరును, ఆపరేటర్లు, ఇతర ఉద్యోగులను కూడా బాధ్యులుగా చేర్చినట్లు చెప్పారు. పిలిప్పీన్స్‌లో పోర్నోగ్రఫీ చట్టరిత్యా నేరం. టీవీల్లో, సినిమాల్లో అలాంటి దృశ్యాలు ఏ మాత్రం లేకుండా వారు జాగ్రత్తలు పడతారు.. వాటి నిషేధం కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. అలాంటిది బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన ఓ బిల్‌బోర్డుపై ఏకంగా పోర్నోగ్రపి చిత్రం ప్రసారం కావడం కలకలం రేపుతోంది. -
ట్రంప్ వాళ్లకు ఓ ఏలియన్.. భారీ ప్లెక్సీలు
మెక్సికో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మెక్సికోలో ఊహించని విధంగా వ్యంగ్యాత్మక చిత్రం బయటకు వచ్చింది. అది కాస్త ఏకంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కన ఓ భారీ బిల్‌బోర్డుపై ఫ్లెక్సీ మాదిరిగా దర్శనమిచ్చింది. దీనిపై ట్రంప్ కార్యాలయ అధికారులు గుర్రుమంటున్నారు. ఎందుకంటే ఆ చిత్రంలో ట్రంప్‌ను ఏలియన్ ట్రంప్‌గా పేర్కొన్నారు. మెక్సికోలోని అంతర్గత వలయ రహదారి వెంట స్పోర్ట్స్ క్యారీ కేచర్గా గీసిన చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ట్రంప్‌ను ఏలియన్ మాదిరిగా వికృతంగా చిత్రించి ఎప్పటి మాదిరిగానే ఆయన జుట్టును మాత్రం ఉంచారు. బ్లూ, ఎరుపు రంగుల మిశ్రమాలతో గీసిన ఈ చిత్రంలో ట్రంప్ వెనుక భాగంలో ఓ భారీ అమెరికా జెండాను కూడా గీశారు. మొత్తం 13 మీటర్లు పొడవు, ఏడు మీటర్ల ఎత్తుతో క్యారీ కేచర్గీసి రోడ్డుపక్కన పెద్ద కటౌట్ మాదిరిగా ఏర్పాటు చేశారు. దీనిని గీసిన వ్యక్తి చికాగోకు చెందిన మిచ్ ఓ కానెల్ అని తెలిసింది. మెక్సికోకు చెందిన వారిని అత్యంత క్రూరంగా ట్రీట్ చేయడమే కాకుండా, వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు కోపంతోనే మెక్సికో అధికారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ బిల్ బోర్డును ఏర్పాటు చేశారంట. -
భారీ బిల్‌బోర్డ్‌పై ఓ భార్య సందేశం
లండన్: పర స్త్రీ ప్రేమాయణంలో పడిపోయిన తన భర్తకు వినూత్న పద్ధతిలో బుద్ధి చెప్పాలనుకుంది లీసా. అందుకోసం ఎప్పుడూ రద్దీగా ఉంటే ‘షెఫీల్డ్ పార్క్ వే’లో 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు కలిగిన డిజిటల్ బిల్ బోర్డ్‌ను ఎంపిక చేసుకుంది. దానిపై తన సందేశాన్ని ఇలా డిస్ప్లే చేసింది. ‘నన్ను మోసం చేస్తున్న ఓ నా భర్త పాల్, మీరిద్దరు ఒకరికి ఒకరు తగినవారు. నీవు ఇంటికి తిరికొచ్చేసరికి నేనక్కడ ఉండను. నీవు ఆఫీసుకు సుఖంగా డ్రైవ్ చేస్తూ వెళ్లు!....ఇట్లు లీసా’. అన్న సందేశాన్ని భర్త పాల్ చూశారో, లేదోగానీ ఆ మార్గంలో వెళ్లిన వేలాది మంది ప్రయాణికులు ఆసక్తిగా చూశారు. ఎంతో మంది లీసాను ఉద్దేశించి ట్టిట్టర్లో ట్వీట్లు కూడా చేశారు. ఈ సందేశం డిజిటల్ బిల్ బోర్డ్‌పై బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, మళ్లీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్ప్లే అయింది. కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోని ఫెఫీల్డ్ నగరానికి వెళ్లే ప్రధాన రహదారి పార్క్ వే అవడంతో అది ఎప్పుడు రద్దీగా ఉంటుంది. రష్ అవర్‌లో ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. తన భర్త పాల్ ఆఫీసుకు వెళ్లే సమయంలోనే ఈ సందేశాన్ని డిస్ ప్లే చేయాలని లీసా కోరినట్టు కాంగ్ మీడియా యాడ్ ఏజెన్నీ తెలిపింది. అందుకు లక్షలాది రూపాయలకు కూడా చెల్లించిందని చెప్పింది. అమెరికాలో ఇలాంటి ప్రకటనలు ఇస్తారని విన్నానుగానీ, బ్రిటన్‌లో మాత్రం ఇంతవరకు ఇలాంటి ప్రకటనలను తాము చూడలేదని, కనీసం వినలేదని కాంగ్ మీడియా పేర్కొంది. లీసా వివరాలను వెల్లడించేందుకు తిరస్కరించింది. లీసా సందేశంపై స్పందించిన ట్విట్టర్ యూజర్లలో పలువురు ‘గుడ్ లక్ లీసా’ అంటూ ట్వీట్ చేశారు. మొైబె ల్ మెసేజ్‌ల కాలంలో ఇలా మెసేజ్ ఇవ్వడం చిత్రమేనని కొందరు వ్యాఖ్యానించారు. మరి కొంతమందేమో ఇది ఫేక్ సందేశం కావచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఫేక్ కాదని, తాము అన్ని ధ్రువీకరించుకున్నాకే ప్రకటనకు అనుమతించామని బిల్బోర్డ్ యజమాని ‘ఆంకో డిజిటల్’ స్పష్టం చేసింది. లీసాది మంచి ఆలోచనని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు మ్యారేజ్ ప్రపోజల్స్‌ను కూడా ఇలా డిస్ ప్లే చేస్తామని కాంగ్ మీడియా యాడ్ ఏజెన్సీ ప్రకటించింది.