ట్రంప్ వాళ్లకు ఓ ఏలియన్.. భారీ ప్లెక్సీలు
మెక్సికో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మెక్సికోలో ఊహించని విధంగా వ్యంగ్యాత్మక చిత్రం బయటకు వచ్చింది. అది కాస్త ఏకంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కన ఓ భారీ బిల్‌బోర్డుపై ఫ్లెక్సీ మాదిరిగా దర్శనమిచ్చింది. దీనిపై ట్రంప్ కార్యాలయ అధికారులు గుర్రుమంటున్నారు. ఎందుకంటే ఆ చిత్రంలో ట్రంప్‌ను ఏలియన్ ట్రంప్‌గా పేర్కొన్నారు. మెక్సికోలోని అంతర్గత వలయ రహదారి వెంట స్పోర్ట్స్ క్యారీ కేచర్‌గా గీసిన చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో ట్రంప్‌ను ఏలియన్ మాదిరిగా వికృతంగా చిత్రించి ఎప్పటి మాదిరిగానే ఆయన జుట్టును మాత్రం ఉంచారు. బ్లూ, ఎరుపు రంగుల మిశ్రమాలతో గీసిన ఈ చిత్రంలో ట్రంప్ వెనుక భాగంలో ఓ భారీ అమెరికా జెండాను కూడా గీశారు. మొత్తం 13 మీటర్లు పొడవు, ఏడు మీటర్ల ఎత్తుతో క్యారీ కేచర్‌గీసి రోడ్డుపక్కన పెద్ద కటౌట్ మాదిరిగా ఏర్పాటు చేశారు. దీనిని గీసిన వ్యక్తి చికాగోకు చెందిన మిచ్ ఓ కానెల్ అని తెలిసింది. మెక్సికోకు చెందిన వారిని అత్యంత క్రూరంగా ట్రీట్ చేయడమే కాకుండా, వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు కోపంతోనే మెక్సికో అధికారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ బిల్ బోర్డును ఏర్పాటు చేశారంట.