
హాలీవుడ్ హాట్ కపుల్ ప్రియాంకచోప్రా, నిక్ జోనస్ మధ్య అనుబంధం రోజురోజుకు పెనవేసుకుంటోంది. ఈ జంట ఎక్కడ ఉన్నా.. అందరి చూపులు వారిపైనే. తాజాగా జరిగిన బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకకు వీరు జంటగా వచ్చారు. ఈ సందర్భంగా జోనస్ బ్రదర్స్ బిల్‌బోర్డ్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టేజ్ మీద ఆడిపాడుతున్న సమయంలో అనూహ్యంగా భార్య ప్రియాంక వేపు వచ్చిన నిక్ జోనస్.. ఆమె వైపు బెండై అలా అలవోకగా ఒక కిస్ ఇచ్చారు. వీరి మధ్య ప్రణయబంధాన్ని చాటే ఈ ముద్దు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వేడుకలో ప్రియానిక్ జంట సందడి చేసింది. జోనస్ కుటుంబసభ్యులైన కెవిన్ జోనస్ భార్య డానియెల్ జోనస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి సోఫీ టర్నర్, ప్రియాంక అత్త డెనిస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన నిక్.. ‘మై వైఫ్ ఈజ్ హాట్’ అంటూ కామెంట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment