ప్రియాంకకు ఏకంగా క్రికెట్‌ టీమే కావాలట!  | Priyanka Chopra Funny replay about kids with Nick Jonas | Sakshi
Sakshi News home page

 పిల్లలపై ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన కమెంట్స్‌  

Published Tue, Jan 12 2021 11:07 AM | Last Updated on Tue, Jan 12 2021 11:31 AM

Priyanka Chopra Funny replay about kids with Nick Jonas - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌  దాకా తన ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్‌  ప్రియాంక చోప్రా  తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఎంత మంది పిల్లలు కావాలని అడిగిన ప్రశ్నకు ఆమె ఫన్నీ రిప్లై ఇచ్చారు. నాకు పిల్లలంటే అంటే చాలా ఇష్టం. వీలైనంత ఎక్కువ మందిని కనాలని ఉంది. నిజంగా అదొక  క్రికెట్‌ టీమ్‌ కావొచ్చేమో అంటూ చిలిపిగా నవ్వేశారు. ఈ సందర్భంగా  తన కొత్త ఫోటోషూట్  పిక్స్‌ను షేర్‌ చేశారు.

అంతేకాదు భర్త, పాప్‌ గాయకుడు నిక్‌కు తనకు వయసులో పదేళ్ల గ్యాప్‌ , కల్చరల్‌ గ్యాప్‌ గురించి అడిగినప్పుడు వాటిని చాలా తేలిగ్గా కొట్టి పారేశారు. అసలు అలాంటి తేడాలు, అడ్డంకులేవీ తమ మధ్య లేవని, అందరిదంపతుల్లాగానే తామూ గడుపుతున్నామనిక్లారిటీ ఇచ్చారు. అడ్డంకులు గురించి ఆలోచించకుండా ఒకరి అలవాట్లను, ఇష్టాలను  మరొకళ్లం అర్థం చేసుకుని జీవించాలి...నిక్‌ నీటిలో చేపలా కలిసిపోతాడు...సో ఏదీ కష్టం కాదని చెప్పారు. అలాగే కరోనా సంక్షోభం, క్వారంటైన్‌ సమయంలో భర్త‌తో ఎక్కువ సమయం గడిపే అవకాశం తనకు వచ్చిందని, ఇది నిజంగా చాలా అదృష్టమని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎవరి కరియర్లో వాళ్లం బిజీగా ఉన్న టైంలో ఇంత టైం కలిసి గడపటం సాధ్యం కాదన్నారు. కాగా ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  

ప్రస్తుతం లండన్‌లో  షూటింగ్‌ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న ఈ గ్లోబ‌ల్ బ్యూటీ తాజాగా తన టీనేజ్‌ ఫొటోను షేర్‌ చేశారు.  దీంతో ఈ ఫోటో ఇపుడు నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఒక సాధారణ అమ్మాయి మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌ టైటిల్స్‌ సొంత చేసుకోవడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ హీరోయిన్‌గా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లడం లాంటి విషయాలతో  తీసుకొస్తున్న  తన అన్‌ఫినీష్‌డ్‌ బుక్‌ను  త్వరలోనే  రిలీజ్‌ చేసేందుకు ప్రియాంక సిద్ధమవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement