![Priyanka Chopra Nick Jonas Celebrate Mahashivratri In Los Angeles - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/1/priyashiva1.jpg.webp?itok=HfsKnwvc)
Priyanka Chopra Nick Jonas Celebrate Mahashivratri In Los Angeles: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగి తనదైన ముద్ర వేసుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే లాస్ ఏంజిల్స్లోని తమ ఇంట్లో పరమశివున్ని కొలిచింది ప్రియాంక-నిక్ జోనాస్ జంట. ఇండియాలో ఘనంగా జరుపుకునే పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. మార్చి 1 మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పూజ చేశారు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది ప్రియాంక చోప్రా. తన ఇన్స్టా స్టోరీలో 'మహా శివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్. శివరాత్రి జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ' అంటూ శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ప్రియాంక గులాబీ రంగు గల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, తెల్లటి కుర్తా పైజామాలో నిక్ జోనాస్ కనిపించాడు. ప్రియాంక కజిన్ దివ్య జ్యోతి కూడా ఈ వేడుకల్లో పాల్గోంది.
Comments
Please login to add a commentAdd a comment