
Priyanka Chopra Gives New Year Kiss To Nick Jonas: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోంది. గత సంవత్సరం మధురు స్మృతులు, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారంతా. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, శుభాకాంక్షలు తెలపడం వంటివి ఒక‍్కొక్కరూ ఒక్కోలా చేస్తారు. ముఖ్యంగా సినీ తారలైతే భిన్న రకాలుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు విష్ చేస్తున్నారు. వీళ్లందరికన్నా భిన్నంగా రొమాంటిక్‌గా విష్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రియాంక విష్ చేస్తూ నిక్ జోనాస్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు నిక్ జోనాస్.
ప్రియాంక తనను ముద్దు పెట్టుకునే ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో నిక్ జోనాస్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు 'మై ఫరెవర్ న్యూ ఇయర్ కిస్ (ఎప్పటికీ నా కొత్త సంవత్సరపు ముద్దు)' అని లవ్ సింబల్‌తో క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నిక్, ప్రియాంక అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లోని ఇలాంటి మరికొన్ని రొమాంటిక్ క్షణాలను తమతో పంచుకోవాలని కోరుతున్నారు. 2021లో ఈ జంట చాలా బిజీగా గడిపింది. ప్రియాంక, నిక్ జోనాస్ విడిపోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటికి ప్రియాంక చెక్ పెట్టిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్ హీరోయిన్.. అదేంటంటే ?
Comments
Please login to add a commentAdd a comment